Go to full page →

ఏడాది పాటు పరీక్ష తర్వాత ఉపకార లబ్ధి CDTel 504

(1864) Sp. Gifts IV, 153, 154 CDTel 504.9

4. బలానికి మాంసాహారం మీద ఆధారపడి ఉన్నానని అనేక సంవత్సరాలుగా తలంచాను. కొన్ని మాసాల వరకు నేను రోజుకి మూడు పూటలు తిన్నాను. భోజనానికి భోజనానికీ మధ్య కడుపులో బలహీనతతో కళ్లు తిరగటంతో బాధపడ్డాను. ఏదైనా తింటే ఇవి సద్దుమణిగేవి. భోజనానికీ భోజనానికీ మధ్య నేను ఏమీ తినేదాన్ని కాదు. సాయంత్రం భోజనం చెయ్యకుండా నిద్రించటం నా అలవాటు. ఉదయం సాష్ఠనుంచి సాయంత్రం భోజనం వరకు ఆకలితో బాధపడేదాన్ని. తరచు స్పృహ తప్పి పడిపోయేదాన్ని. ఈ నిస్సత్తువ మనోభావాల్ని మాంసాహారం తొలగించేది. కనుక నా విషయంలో మాంసాహారం అనివార్యమని నిశ్చయించుకున్నాను. CDTel 504.10

కాని 1863 జూన్ లో ఆరోగ్యానికి సంబంధించి మాంసం భుజించటమన్న అంశంపై ప్రభువు నాకు ఉపదేశమిచ్చినప్పటినుంచి మాంసాహారం మానేశాను. కొంతకాలం బ్రెడ్ పట్ల ఆకలి ఉండేది కాదు. క్రితంలో అదంటే సుతరాము హితముండేది కాదు. కాని పట్టుదలతో ప్రయత్నించటం ద్వారా దీన్ని సాధించగలిగాను. మాంసం తినకుండా దాదాపు ఓ ఏడాది నివసించాను. దాదాపు ఆరుమాసాలు మా భోజనబల్ల మీద, సంపూర్ణ గోధుమ పిండి నీళ్లు ఎక్కువ ఉప్పులేకుండా కలిపి చేసిన పులియని బ్రెడ్, రొట్టెలు ఉండేవి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా ఉపయోగించటం ఎనిమిది నెలల పాటు రోజుకి రెండుపూటలే భోంచేశాను. CDTel 505.1

దినంలో ఎక్కువ భాగం సుమారు ఒక సంవత్సరం రాత పనిలో నిమగ్నమయ్యాను. ఎనిమిది నెల్లు రాత పనికే పరిమితమయ్యాను. నా మెదడుకి శ్రమ ఎక్కువయ్యింది. వ్యాయామం దాదాపు లేదు. అయినా గత ఆరుమాసాలుగా నా ఆరోగ్యం ఎంతో బాగుంది. గతంలో నన్ను బాధించిన బలహీనత, తలతిప్పు భావాలు మాయమయ్యాయి. ప్రతీ వసంతకాలంలో నాకు ఆకలి ఉండేది కాదు. గత వసంత కాలంలో నాకీ సమస్య రాలేదు. CDTel 505.2

రెండు పూటలే తినే మా సాదా భోజనం ఎంతో ఇష్టంగా తింటాం. మా భోజనబల్లపై మాంసం, కేకులు, కొవ్వుతో నిండిన ఎలాంటి ఆహార పదార్థాలు ఉండవు. మేము కొవ్వు కాచిన నూనె వాడం. దాని బదులు పాలు, వెన్న, తగు మాత్రంగా బటర్ వాడ్డాం. ఆహారంలో ఉప్పు చాలా తక్కువ వాడ్తాం. మసాలాలు అసలు వాడం. ఉదయం నాషా ఏడుగంటలకి, మధ్యాహ్నం భోజనం ఒంటిగంటకు తీసుకుంటాం. బలహీనంగా ఉన్నట్లు అనిపించటం అరుదు. నా ఆకలి తీరుతుంది. మున్నెన్నటికన్నా ఎక్కువ ఇష్టంగా భోజనం తింటాను. CDTel 505.3