Go to full page →

విజయానికి పోరాటం CDTel 506

(1870) 2T 371,372 CDTel 506.1

5. ఆరోగ్యసంస్కరణను ఆచరించటం మొదలు పెట్టిన నాటినుంచి నేను ఏమీ మారలేదు. ఈ అంశంపై పరలోకం నుంచి నా మార్గంలో వెలుగు ప్రకాశించినప్పటినుంచి నేను ఒక అడుగు వెనక్కి వెయ్యలేదు. మాంసం, బటర్, మూడుపూటలు భోంచెయ్యటం, ఉదయంనుంచి సాయంత్రం వరకు మెదడుతో పని చేస్తూ రాయటం పనిని అన్నింటినీ ఒకేసారి విడిచి పెట్టేశాను. పనిలో మార్పు చెయ్యకుండా రోజుకి రెండుపూటల భోజనాన్ని అవలంబించాను. CDTel 506.2

నేను వ్యాధి బాధలతో సతమతమౌతున్న దాన్ని. అయిదు సార్లు పక్షవాతం దెబ్బతిన్నదాన్ని. నా గుండెల్లో పోటు ఎక్కువగా ఉన్నందువల్ల కొన్ని నెలలపాటు నా ఎడమ చేతిని పక్కకు కట్టారు. నా ఆహారంలో ఈ మార్పులు చేసుకుంటున్నప్పుడు నేను రుచిని లెక్క చెయ్యలేదు. దానికి బానిసవ్వలేదు. ఎక్కువ శక్తిని సంపాదించుకుని దానితో నా ప్రభువుని మహిమ పర్చకుండా అది నాకు అడ్డు తగులుతుందా? ఒక్క నిముషమైనా నా మార్గానికి అది ఆటంకంగా నిలుస్తుందా? అదెన్నటికీ జరగని పని! CDTel 506.3

తీవ్ర ఆకలి బాధను అనుభవించాను. నేను గొప్ప మాంసాహారిని. కాని బలహీనంగా ఉన్నప్పుడు, కడుపుమీద చేతులు వేసుకుని ” ఓముద్ద కూడా నోట పెట్టను. సాధారణ ఆహారాన్నే తింటాను. లేదా ఏమీ తినకుండా ఉండిపోతాను” అని నాతో నేను చెప్పుకునే దాన్ని. బ్రెడ్ నాకు రుచించేది కాదు. డాలరు బిళ్లంత బ్రెడ్ ముక్క కూడా తినేదాన్ని కాదు. సంస్కరణలోని కొన్నింటిని ఇష్టంగా తినేదాన్ని గాని బ్రెడ్ వద్దకు వచ్చేసరికి నాకు అసలు ఇష్టం పుట్టేది కాదు. ఈ మార్పులు చేసుకున్నప్పుడు నేను తీవ్ర పోరాటం పోరాడాల్సి వచ్చింది. మొదటి రెండు లేదా మూడు పూటలు తినలేకపోయాను.” బ్రెడ్ తినేవరకు నీవు వేచి ఉండవచ్చు” అని నా కడుపుతో చెప్పేదాన్ని. కొంతకాలానికి బ్రెడ్ తినగలిగాను - సంపూర్ణ గోధుమ బ్రెడ్ సయితం. క్రితంలో ఈ బ్రెడ్ ని తినలేకపోయే దాన్ని. ఇప్పుడైతే అది కమ్మగా ఉంటుంది. ఆకలి లేకపోటమన్నది లేదు. CDTel 506.4