ఉత్తరం 76, 1895 CDTel 511.3
12. బటన్లోని సమావేశాల నాటినుంచి (జనవరి, 1894) నేను మాంసాహారం పూర్తిగా మానేశాను. ఇంటివద్ద ఉన్నా లేక విదేశాల్లో ఉన్నా మాంసం నా కుటుంబంలో ఉపయోగించటం కాని నా భోజనంలోకి రావటం గాని జరగకూడదన్నది నా అవగాహన. ఈ అంశం రాత్రి దర్శనంలో నా మనసు ముందు చాలా ప్రదర్శితమవ్వటం జరిగింది. CDTel 511.4
MS 25, 1894 CDTel 511.5
13. మంచి పాలు, పండ్లు, బ్రెడ్ మాకు సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పటికే నేను నా భోజనబల్లను దేవునికి ప్రతిష్ఠించాను, అన్ని రకాల మాంస పదార్ధాలు వంటకాల నుంచి దానికి విముక్తి కలిగించాను. జంతువుల మాంసం తిండికి దూరంగా ఉండటం శరీరానికి మనసుకి ఆరోగ్యం . సాధ్యమైనంత వరకు దేవుని ఆది ప్రణాళికకు మనం తిరిగి రావాలి. ఇకనుంచి నా భోజన బల్లపై చచ్చిన జంతువుల మాంసం ఉండదు. తయారు చెయ్యటానికి ఎక్కువ సమయం శక్తి హరించే తీపి పదార్థాలు ఉండవు. పండ్లను వివిధ రీతుల్లో స్వేచ్చగా తినవచ్చు. చచ్చిన జంతువుల మాంసం తినటం వల్ల వచ్చే వ్యాధులు పండ్ల వల్ల వస్తాయన్న భయం ఉండదు. ఆరోగ్యదాయకమైన సాదా ఆహారాన్ని తిని ఆనందించేందుకు, ఎవరూ ఆకలితో బాధపడకుండేందుకు ఆహారం సమృద్ధిగా కలిగి ఉండేందుకు మనం ఆకలిని అదుపులో ఉంచుకోవాలి. CDTel 511.6