Go to full page →

ఇతరుల పట్ల సహనం CDTel 518

ఉత్తరం 45, 1903 CDTel 518.5

25. ఎవరికీ ఆదర్శంగా నన్ను నేను పరిగణించుకోను. కొన్నింటిని తింటే గొప్ప బాధకు గురి అవుతారు. కనుక వాటిని తినేలేను. నాకు ఏది మంచిదా అని నేర్చుకోటానికి ప్రయత్నిస్తాను. అప్పుడు దాన్ని గురించి మరెవరికీ చెప్పకుండా నేను తినగలవాటిని తింటాను. అవి కడుపులో గందరగోళం పుట్టించని రెండు లేక మూడు సామాన్యరకాలు. CDTel 518.6

ఉత్తరం 194, 1891 CDTel 519.1

26. వ్యక్తుల దేహ తత్వాల్లోను మానసిక ప్రవృత్తుల్లోను పెద్ద తేడా ఉంటుంది. వివిధ వ్యక్తుల వ్యవస్థల అవసరాలూ చాలా భిన్నంగా ఉంటాయి. ఒకరి ఆహారం ఇంకొకరికి విషమవ్వవచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తి విషయంలోను కచ్చితమైన నిబంధనలు నిర్దేశించలేం. నేను చిక్కుడు కాయలు తినలేను. అవి నాకు విషం వంటివి. కాని ఈ కారణం వల్ల వాటిని ఎవరూ తినకూడదనటం అర్థరహితం. నేను ఓ చెంచాడు పాలగ్రేవీ పాలటోస్టుగాని తీసుకోలేను. దాని పర్యవసానాల్ని అనుభవించాల్సి వస్తుంది. అయినా మా కుటుంబంలోని తక్కిన సభ్యులు వీటిని ఈ పర్యవసానాలు లేకుండా తినవచ్చు. కనుక నా కడుపుకి సరిపడేదాన్నే నేను తీసుకుంటాను. వారూ అలాగే చేస్తారు. మాకు విభేదాలేమీ ఉండవు. నా పెద్ద కుటుంబంలో మేమందరం సామరస్యంగా నివసిస్తాం. ఎందుకంటే వారు ఏమి తినాలో ఏమి తినకూడదో శాసించటానికి నేను ప్రయత్నించను. CDTel 519.2