(1909) 9T 158,159 CDTel 519.3
27. ఆరోగ్య సంస్కరణ వర్తమానం నాకు మొట్టమొదటగా వచ్చినప్పుడు నేను బలహీనంగా ఉన్నాను. తరచుగా స్మారకం తప్పి పడిపోయేదాన్ని. సహాయం చెయ్యమంటూ దేవునితో విజ్ఞాపన చేసేదాన్ని. ఫలితంగా ఆరోగ్యసంస్కరణ అంశాన్ని ఆయన నాకు బయలు పర్చాడు. తన ఆజ్ఞలు ఆచరించేవారు తనతో పవిత్ర బాంధవ్యంలోకి రావాలని, ఆహార పానాల్లో మితం పాటించటం ద్వారా మనసును శరీరాన్ని సేవకు యోగ్యమైన స్థితిలో ఉంచాలని ప్రభువు నాకు ఉపదేశించాడు. ఈ వెలుగు నాకు ఎంతో దీవెనకరంగా ఉంది. ప్రభువు నన్ను బలపర్చుతాడన్న గుర్తింపుతో నేను ఆరోగ్య సంస్కర్తగా నివసించటానికి నిర్ణయం తీసుకున్నాను. ఈనాడు నాకు మెరుగైన ఆరోగ్యముంది. నా యౌవన దినాల్లోకన్నా ఇప్పుడు నా ఆరోగ్యం మెరుగుగా ఉంది. CDTel 519.4
ఆరోగ్య సంస్కరణ సూత్రాల్ని నేను కలంతో ప్రబోధించిన రీతిగా ఆచరణలో పెట్టటం లేదని కొందరు నివేదిస్తున్నారట. కాని నాకు తెలిసినంత వరకు నేను ఇంత వరకు ఈ సూత్రాల్ని ఉల్లంఘించలేదని చెప్పగలను. నా భోజనబల్లపై నాతో భోజనం చేసినవారు నేను తమ ముందు మాంస పదార్ధాలు పెట్టలేదని ఎరుగుదురు. CDTel 520.1