Go to full page →

ఒకభాగమే, పూర్తి వర్తమానం కాదు CDTel 69

(1867) 1T559 CDTel 69.4

103. ఆరోగ్య సంస్కరణ మూడోదూత వర్తమాన పరిచర్యతో దగ్గర సంబంధం కలిగి ఉన్నది. అయినా అదే వర్తమానం కాదు. మన బోధకులు ఆరోగ్యసంస్కరణను ప్రబోధించాలి. అయినా వర్తమానం స్థానంలో దీన్నే ప్రాధమ్యాంశం చెయ్య కూడదు. వర్తమానం సూచించే ఘటనల్ని ఎదుర్కోటానికి సిద్ధం చేసే పనిని వివరించే అంశాలనడుమ దీనికి స్థానముంది. వాటిలో ఇది ప్రధానమైంది. ప్రతీ దిద్దుబాటును మనం ఉత్సాహంగా చేపట్టాలి. అయితే మనం స్థిరతలేకుండా అటూ యిటూ ఊగే వ్యక్తులం, మతమౌఢ్యులం అన్న అభిప్రాయం పుట్టించకుండా జాగ్రత్తపడాలి. CDTel 69.5

ఉత్తరం (1867) 1T 559 CDTel 70.1

104. శరీరానికి హస్తానికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో అంత దగర సంబంధం మూడోదూత వర్తమానానికి ఆరోగ్యసంస్కరణకు ఉన్నది. మూడోదూత వర్తమాన ప్రకటన, దేవుని ఆజ్ఞలు, యేసును గూర్చిన సాక్ష్యం మనసేవలో కేంద్రబిందువు కావాలి. వర్తమానాన్ని గొప్పకేకతో ప్రకటించాలి. లోకమంతటా ప్రకటించాలి. ఈ వర్తమానంతో కలిపి ఆరోగ్య సూత్రాల్ని ప్రకటించాలి గాని ఆరోగ్యాంశం ఒకటే విడిగా ప్రకటించ కూడదు. వర్తమానం స్థానే దాన్ని ప్రకటించకూడదు. CDTel 70.2