Go to full page →

వైద్యసంస్థలతో కలిసి CDTel 70

MS 23, 1901 CDTel 70.3

105. మనం స్థాపించే ఆసుపత్రులు సువార్తలో భాగాలుగా పనిచెయ్యాలి. రెండింటికీ అవినాభావ సంబంధం ఉండాలి. సువార్త ముందుకి సాగాలని ప్రభువు ఉపదేశించాడు. వివిధ రూపాల్లోని ఆరోగ్య సంస్కరణ సువార్తలో ఇమిడి వుంది. లోకానికి జ్ఞానాన్ని అందించటం మన పని. ఎందుకంటే లోకంలో చోటుచేసుకోనున్న తెగుళ్లకు మార్గం సుగమం చేస్తున్న కదలికల్ని అది గమనించలేనంత గుడ్డిదైవుంది. దేవుని నమ్మకమైన కావలివారు హెచ్చరిక చెయ్యాలి.... CDTel 70.4

మూడో దూర వర్తమాన ప్రకటనలో ఆరోగ్య సంస్కరణ మరింత ప్రధానంగా నిలవాలి. ఆరోగ్యసంస్కరణ సూత్రాలు దైవవాక్యంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆరోగ్యసువార్త వాక్యపరిచర్యతో ధృఢంగా అనుసంధానపడి ఉండాలి. ఆరోగ్యసంస్కరణ పునరుద్ధరణ ప్రభావం సువార్త వర్తమాన ప్రకటన సేవ అంతిమ మహా కృషిలో ఓ భాగం కావాలి. CDTel 70.5

మన వైద్యులు దేవుని కార్యకర్తలు కావాలి. వారు ఎవరి శక్తి సామర్థ్యాలు క్రీస్తు కృపచే పరిశుద్దీకరించబడి మార్పుచెందుతాయో ఆ పురుషులు స్త్రీలు కావాల్సివున్నారు. లోకానికి అందించాల్సి ఉన్న సత్యంతో వారి ప్రభావం అల్లుకుపోవాలి. సువార్త పరిచర్యతో ఏకమైనప్పుడు ఆరోగ్య సంస్కరణ సేవ దేవుడిచ్చిన శక్తిని వెల్లడి చేస్తుంది. సువార్త సేవ ప్రభావం కింద వైద్య మిషనెరీ సేవ ద్వారా గొప్ప సంస్కరణలు చోటు చేసుకుంటాయి. కాగా వైద్య మిషనేరీ పరిచర్యను సువార్త సేవ నుంచి వేరు చేస్తే దైవ సేవ కుంటుపడుంది. CDTel 70.6

ఉత్తరం 146,1909 CDTel 71.1

106. మన ఆసుపత్రులు, మన సంఘాలు ఇంకా ఉన్నతమైన, ఇంకా పరిశుద్ధమైన ప్రమాణాన్ని చేరవచ్చు. మన ప్రజలు ఆరోగ్య సంస్కరణను బోధించి ఆచరించాల్సి ఉంది. దైవ వార్తాహరులుగా సెవెంతుడె ఎడ్వంటిస్తులు ఓ ప్రత్యేక పరిచర్య చేయాల్సి ఉంది. అది జనుల ఆత్మల నిమిత్తం శరీరాల నిమిత్తం చేయాల్సిన సేవ. - CDTel 71.2

తన ప్రజల గురించి క్రీస్తు అన్నాడు, “మీరు లోకమునకు వెలుగైయున్నారు.” దేవుడు మానవులకిచ్చిన అతి గంభీరమై, పవిత్రమైన సేవ మొదటి దూత, రెండోదూత, మూడోదూత వర్తమానాల్ని లోకప్రజలికి ప్రకటించటం. రోగులకి వైద్య సహాయం చెయ్యటానికి, ఆరోగ్య సంస్కరణ సూత్రాల్ని బోధించటానికి మన పెద్ద పెద్ద నగరాల్లో ఆరోగ్య సంస్థలు స్థాపితమవ్వాలి. CDTel 71.3