Go to full page →

ప్రతికూల అభిప్రాయం తొలగింపుకి ప్రభావం పెంపుదల CDTel 71

(1890) C.T.B.H.121,122 CDTel 71.8

109. ఆరోగ్య సంస్కరణ పై ఎక్కువ శ్రద్ధ పెట్టటం జరిగితే, మూడోతూత వర్తమాన సత్యం ప్రజల హృదయాల్ని చేరకుండా అడ్డుతగిలే ప్రతికూల అభిప్రాయం చాలా మట్టుకు తొలగిపోవచ్చు. ఈ విషయంలో ప్రజలు ఆసక్తి కనపర్చినప్పుడు, ఇతర సత్యాల ప్రవేశానికి తరచు మార్గం ఏర్పడటం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మనం తెలివిగా వ్యవహరిస్తున్నట్లు వారు చూస్తే, బైబిలు సిద్ధాంతాల్లోనూ మనం సరిగా ఉన్నట్లు నమ్మటానికి వారు మరింత సంసిద్ధంగా ఉంటారు. CDTel 71.9

ప్రభువు సేవలోని ఈ విభాగంపై ఎక్కువ గమనం ఉంచటం జరగటం లేదు. ఈ అశ్రద్ధ వల్ల చాలా నష్టం జరిగింది. ఏ సంస్కరణల ద్వారా దేవుడు తన సంఘాన్ని తన రాకకు సిద్ధం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడో ఆ సంస్కరణల పట్ల సంఘం మరింత ఆసక్తి ప్రదర్శిస్తే, వారి ప్రభావం ఇప్పటికన్నా మరెంతో అధికంగా ఉండేది. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. వారు తన స్వరాన్ని విని దానికి విధేయులవ్వాలన్నది దేవుని సంకల్పం. ఆరోగ్య సంస్కరణ మూడోదూత వర్తమానం కాకకపోయినా దానితో దీనికి సన్నిహిత సంబంధం ఉంది. సువార్త బోధించేవారు ఆరోగ్య సంస్కరణను కూడా బోధించాలి. మనకు సమీపంలోనే ఉన్న ఘటనలకు మనం సిద్ధపడటానికి ఇది మనం అవగాహన చేసుకోవలసిన అంశం. దానికి మనం ప్రాధాన్యాన్నివ్వాలి. ఈ సంస్కరణ కృషికి అడ్డుకట్ట వెయ్యటానికి సాతాను అతడి ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఆ కృషిలో ఉత్సాహంగా పనిచేస్తున్న వారిని తికమక పర్చటానికి వారు తమ శక్తి కొద్దీ ప్రయత్నిస్తారు. అయినా ఈ విషయమై ఎవరూ అధైర్యం చెందనవసరం లేదు లేక తమ ప్రయత్నాల్ని విరమించుకోనక్కరలేదు. క్రీస్తు గుణాల్లోని ఒకదాని గురించి యెషయా ప్రవక్త ఇలా అంటున్నాడు, “భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు.” కనుక ఆయన అనుచరులు వైఫల్యం గురించి అధైర్యపడటం గురించి మాట్లాడకుండా, మానవుడు నశించకుండా నిత్యజీవం పొందేందుకు అతణ్ని రక్షించటానికి ఆయన చెల్లించిన మూల్యాన్ని గుర్తుంచుకోవాలి. CDTel 72.1

(1909) 9T 112,113 CDTel 72.2

110. లోకంలోని బాధను తగ్గించటానికి తన సంఘాన్ని శుద్దీకరించటానికి ఆరోగ్యసంస్కరణ సేవ ప్రభువు వినియోగించే సాధనం. శారీరకారోగ్యాన్ని ఆధ్యాత్మికారోగ్యాన్ని పునరుద్ధరించటంలో మహ కార్యకర్త అయిన ప్రభువుతో సహకరించటం ద్వారా తాము దేవునికి సహాయకులుగా వ్యవహరించవచ్చని ప్రజలకు బోధించండి. ఈ సేవపై దేవుని ముద్ర వుంది. ఇది ఇతర సత్యాల ప్రవేశానికి తలుపు తెరుస్తుంది. ఈ సేవను జ్ఞానయుక్తంగా చేపట్టేవారందరికి చాలినంత స్థలముంది. CDTel 72.3

[మెడికల్ మినిస్ట్రీ, సెక్షన్ 2, “ది డివైన్ ప్లేన్ ఇన్ ది మెడికల్ మిషనెరీ వర్క్”, మరియు సెక్షన్ 13, “మెడికల్ మిషనెరీ వర్క్ అండ్ ది గాస్పుల్ మినిస్ట్రి” చూడండి] CDTel 72.4