Go to full page →

పిక్ నిక్ భోజనం CDTel 81

(1867) 1T 514 CDTel 81.3

125. ఓ పట్టణంలోగానీ, గ్రామంలో గాని నివసిస్తున్న అనేక కుటుంబాలు తాము శారీరకంగానూ, మానసికంగానూ శ్రమపడి చేస్తున్న పనుల్ని విడిచి పెట్టి ఊరు వెలుపల చక్కని ప్రకృతి దృశ్యం గల చెరువు ప్రక్కకో లేక వనంలోకో వినోద యాత్రకు వెళ్లాలి. వారు శుభ్రమైన సామాన్యమైన భోజనం తయారుచేసుకుని, ఉత్తమమైన పండ్లు, గింజలు తీసుకుని వెళ్ళి చెట్టుకిందో ఆరుబైటో కూర్చుని భోజనం చెయ్యాలి. ప్రయాణం, వ్యాయామం తమ ముందున్న ప్రకృతి దృశ్యం వారికి ఆకలి పుట్టిస్తుంది. అంతట వారు తమ రాజ భోజనాన్ని ఆరగించి ఆనందిస్తారు. CDTel 81.4

[ఎక్కువ వంట పెట్టుకోకండి-793] CDTel 81.5

[నీడపట్టున పనిచేసేవారికి సలహా-225] CDTel 81.6

[సబ్బాతు నాటి ఆహారంలో సామాన్యత-56] CDTel 81.7

ఉత్తరం 135,1902 CDTel 81.8

126. ఆరోగ్య సంస్కరణ వాదులు ఆ సంస్కరణ ఏమిటని ప్రబోధిస్తారో అది సొంతం అలాగే ఉండేందుకు శాయశక్తుల కృషిచేయ్యాలి. వారు ఆరోగ్యానికి హాని కలిగించే సమస్తాన్నీ విసర్జించాలి. సామాన్యమైన ఆరోగ్యదాయకమైన ఆహారాన్నే తినాలి. పండ్లు తినటం ఎంతో మేలు చేస్తుంది. పండ్ల వాడకం వంటను చాలామట్టుకు తగ్గిస్తుంది. పేస్టీలు, కేకులు, డిజర్టులు, నోరూరించే ఇతర వంటకాల్ని ముట్టకండి. ఒకేసారి అనేక రకాల భోజనం తినకండి. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ భోజనం చెయ్యండి. CDTel 81.9