Go to full page →

ఆతిథ్యమివ్వటంలో సామాన్యత CDTel 81

(1900) 6T 345 CDTel 81.10

127. ఆతిథ్యమివ్వటంలో తన సొంత జీవితంలో క్రీస్తు ఓ పాఠం నేర్పిస్తున్నాడు. సముద్రం పక్క తన చుట్టూ ఆకలిగా వున్న జన సమూహాన్ని చూసినప్పుడు భోజనం పెట్టి తృప్తి పర్చకుండా వారిని తమ గృహాలకి పంపటానికి ఇష్టపడలేదు. “వారికి భోజనము పెట్టుడి” అన్నాడు తన శిష్యులతో, మత్తయి. 14:16. అంతట తన సృజన శక్తితో ఆహారం సరఫరా చేసి వారిని తృప్తి పర్చాడు. అయినా వారికి ఆయన పెట్టిన ఆహారం ఎంత సామాన్యమైనది! విలాసవంతమైన వంటకాలేమీ అందులో లేవు. పరలోక వనరులన్నీ తన చేతిలో ఉన్న ఆ ప్రభువు ప్రజల ముందు విలాసవంతమైన విందు భోజనం ఉంచగలిగేవాడే కానీ సముద్రతీర ప్రాంతాల్లో నివసించే జాలర ప్రజల అనుదిన ఆహార అవసరాన్ని మాత్రమే ఆయన తీర్చాడు. CDTel 81.11

మనుషులు నేడు ప్రకృతి చట్టాలకు అనుగుణంగా నివసిస్తూ, తమ అలవాట్ల విషయంలో సామాన్యంగా ఉంటే, మానవ కుటుంబ అవసరాలన్నిటికి చాలినంత సరఫరా ఉంటుంది. ఊహాజనితమైన అవసరాలు చాలా తక్కువగా వుంటాయి. దేవుని మార్గాల్లో పనిచెయ్యటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విలాసాలు ప్రజల కోర్కెలు తీర్చటం ద్వారా క్రీస్తు వారిని ఆకట్టుకోటానికి ప్రయత్నించలేదు. ఆయన సమకూర్చిన సామాన్య ఆహారం ఆయన శక్తికి మాత్రమే గాక జీవిత సాధారణ అవసరాలు గల జనుల పట్ల ఆయన ప్రేమకు శ్రద్ధకు భరోసా. CDTel 82.1

(1865) H & L అద్యా 1, 54, 55 CDTel 82.2

128. క్రీస్తు అనుచరులమని చెప్పుకునే పురుషులు, స్త్రీలు ఫ్యాషన్ కి తిండిబోతుతనానికి బానిసలవుతున్నారు. ఫ్యాషన్ ప్రదర్శించుకునే సమావేశాలకి సిద్ధపడటంలో, ఉన్నతమైన ఉదాత్తమైన ఉద్దేశాలకు వినియోగించవలసిన సమయాన్ని ఎన్నో రకాల అనారోగ్యకరమైన వంటకాలు తయారు చెయ్యటానికి వ్యయం చేస్తున్నారు. అది ఫ్యాషన్ కనుక, బీదవారు, రోజు వారి పనిమీద ఆధారపడే వారు అనేకులు, ఎంతో ఖర్చు పెట్టి కేకులు, చెడకుండా నిల్వచేసిన ఆహారపదార్థాలు, పేస్త్రీలు, అతిథుకి విలాస ఆహారం తయారుచేయటం జరుగుతుంది. అవి తిన్నవారికి హాని తప్ప మేలు కలుగదు. చెప్పాలంటే వారిలా ఖర్చు పెట్టే డబ్బు తమకు తమ బిడ్డలకు బట్టలు కొనటానికి ఎంతో అవసరం. అన్నకోశానికి హాని కలిగే విధంగా రుచులు తృప్తిపర్చుకోటానికి వంటలు చెయ్యటంలో వ్యయం చేసే సమయాన్ని పిల్లలకు నైతిక ఉపదేశాన్ని మతపరమైన ఉపదేశాన్ని ఇవ్వటానికి ఉపయోగించటం మంచిది. CDTel 82.3

ప్రముఖుల సందర్శన సమయం అమితమైన తిండికి అదనుగా మారటం జరుగుతుంటుంది. హానికరమైన ఆహారం పానీయాలు మితం లేకుండా తీసుకున్నందువల్ల జీర్ణమండల అవయవాలపై పెనుభారం పడుతుంది. దాన్ని సర్దుబాటు చెయ్యటానికి ప్రధాన శక్తులు అనవసర కార్యాచరణకు పూనుకోవలసి వస్తుంది. ఇది అలసట పుట్టించి రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా ప్రధాన శక్తి కొరత శరీరమంతా కనిపిస్తుంది. మీ సంభాషణ వలన మీ అతిధేయి మేలు పొందేబదులు, మీకు రకరకాల వంటకాలతో పసందైన భోజనం తయారు చెయ్యటంలో శ్రమించాల్సి రావటంతో ఆ సాంఘిక సందర్శన వల్ల ఒనగూడే దీవెనలు లభించవు. ఇలా తయారు చేసిన నాజూకు ఆహారాన్ని తినటం ద్వారా క్రైస్తవ పురుషులు స్త్రీలు అలాంటి చర్యను సహించ కూడదు, ప్రోత్సహించకూడదు. మీ సందర్శన ఉద్దేశం భోజనం కాదని, కాని మీరు కలుసుకోటం, తలంపులు మనోభావాలు పంచుకుని పరస్పరం మేలు పొందటమని వారు అవగాహన చేసుకునేటట్లు చూడండి. మీ సంభాషణ ఉన్నత మైనది, ఉత్తమమైనది అయి, అనంతర కాలంలో ఆనందోత్సాహాలతో గుర్తుకు వచ్చేదిగా ఉండాలి. CDTel 83.1

(1865) H & L అధ్యా.1, 55, 56 CDTel 83.2

129. సందర్శించే వారికి ఆతిథ్యమిచ్చేవారు ఆహారాన్ని ఆరోగ్యదాయకంగా, బలవర్థకంగా, సామాన్యంగా, రుచిగా తయారు చెయ్యాలి. అలాంటి వంటకు అదనపు శ్రమగానీ ఖర్చుగానీ ఉండదు. అలాంటి భోజనాన్ని మితంగా తినటం ఎవరికీ హాని చెయ్యదు. ఆహారవాంఛను తృప్తి పర్చుకోటానికి సమయాన్ని ద్రవ్యాన్ని, ఆరోగ్యాన్ని త్యాగం చెయ్యటానికి అతిక్రమ మూల్యాన్ని చెల్లించుకోదలచుకోటానికి లోకస్తులు ఎంపిక చేసుకుంటే చేసుకోనివ్వండి. కానీ క్రైస్తవులు ఈ విషయాలలో స్థిరంగా నిలబడి ప్రజలు సరియైన మార్గంలో నడవటానికి వారిని ప్రభావితం చెయ్యాలి. ఫ్యాషన్ గా పరిణమించి ఆరోగ్యాన్ని ఆత్మను నాశనం చేసే ఆచారాల్ని సంస్కరించటంలో వారు చెయ్యగలిగింది ఎంతో ఉంది. CDTel 83.3

[భోజనం వద్ద క్రైస్తవుల ఆదర్శం, ఆత్మనిగ్రహం విషయంలో బలహీనులకి సహాయం - 354] CDTel 84.1

[భారీ విందులు భారం, హాని కరం-214] CDTel 84.2

[భారీ ఆతిథ్యం సొంత పిల్లల పై ప్రభావం చూపుతుంది-348] CDTel 84.3

[కుటుంబానికి మితాహారం; సందర్శకులకు అమితాహారం పాపం-284] CDTel 84.4

[సామాన్యాహారం పిల్లలకి ఉత్తమ ఆహారం-349,356,357,360,365] CDTel 84.5

ఆరోగ్య ఆహారం తయారీలో సామాన్యత -399,400,401,402,403, 404,405,407,410] CDTel 84.6