Go to full page →

భాగం IV - వివిధ దేశాల్లో ఆహారం CDTel 90

రుతువుకు శీతోష్ణస్థితికి తగిన ఆహారం CDTel 90

ఉత్తరం 14,1901 CDTel 90.3

143. ఉపయోగించే ఆహారపదార్థాలు శీతోష్ణస్థితికి అనుకూలంగా ఉండాలి. ఒకదేశానికి సరిపడే ఆహారపదార్థాలు మరొక దేశానికి సరిపడవు. CDTel 90.4

(1905) M. H.296,297 CDTel 90.5

144. ఆరోగ్యదాయకమైన ఆహార పదార్థాలన్నీ అన్ని పరిస్థితుల్లోనూ మన అవసరాలకు సరిపడవు. ఆహారం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. మన ఆహారం మనం ఏ రుతువులో, ఏ శీతోష్ణస్థితిలో, ఏ వృత్తి చేస్తూ ఉన్నామో వాటికి తగినట్టుగా ఉండాలి. ఓ రుతువులో లేదా ఓ శీతోష్ణస్థితిలో సరిపడే ఆహారం ఇంకొకదానికి సరిపడదు. కనుక వేర్వేరు వృత్తుల్వోని వ్యక్తులికి సరిపడే ఆహారం వివిధరకాలుగా ఉంటుంది. కఠిన శారీరక శ్రమ చేసేవారికి మేలు చేసే ఆహారం అఫీసుల్లో కూర్చుని పనిచేసేవారికి లేదా మెదడుతో తీవ్రంగా పనిచేసేవారికి సరిపడదు. దేవుడు మనకు అనేక రకాల ఆరోగ్యదాయకమైన ఆహారం ఇస్తున్నాడు. ప్రతి వ్యక్తి పురస్కరించుకుని తన అవసరాలకు తగిన ఆహారాన్ని తన అనుభవాన్ని ఎంపిక చేసుకోవాలి. CDTel 90.6