Go to full page →

ఆరోగ్య సంస్కరణ ఉపదేశానికి నేర్పు అవసరం CDTel 91

ఉత్తరం 37,1901 CDTel 91.4

148. మన పనిని సరళమైన సామాన్యమైన మార్గాల్లో నిర్వహించటానికి మనం మానవ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదో గుర్తించాల్సి వుంటుంది. లోకంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్నవారి కోసం దేవుడు ఏర్పాట్లు చేశాడు. దేవుని జతపనివారు కావాలని ఆశించేవారు ఆయన క్షతోటలో ఆరోగ్యసంస్కరణను ఎలా బోధిస్తున్నారో జాగ్రత్తగా పరిగణించాల్సి ఉన్నారు. ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు అన్న విషయాల్ని నిర్దిష్టంగా చెప్పటంలో ఆచితూచి అడుగులు వెయ్యాలి. దేవుడు రక్షించదలచిన జన సమూహాలికి దైవ కృపావర్తమానాన్ని దయతో అందించటంలో మానవ సాధనం దివ్య సహాయకునితో ఏకమవ్వాలి. CDTel 91.5

సందర్భానికి 324 చూడండి] CDTel 92.1

మాంసం, పాలు, గుడ్లు విషయంలో కొత్త దేశాల్లోను, పేదరికం ఉన్న జిల్లాల్లోను ప్రత్యేక శ్రద్ధ అవసరం-324] CDTel 92.2

(1909) 9T 159 CDTel 92.3

149. ఆహారం విషయంలో ఓ ఖచ్చితమైన మార్గాన్ని మేము సూచించటం లేదు. కాని పండ్లు, ధాన్యాలు, కాయలు, గింజలు పుష్కలంగా లభించే దేశాల్లో మాంసాహారం దైవ ప్రజలకు సరిఅయిన ఆహారం కాదని మాత్రం చెబుతున్నాం. CDTel 92.4

150. సంవత్సరంలో ఎక్కువ భాగం తాజా పండ్లు దొరికే దేశాల్లో నివసించేవారు ఆ పండ్లలో తమకున్న గొప్ప మేలును గుర్తించాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. మనం అప్పటికప్పుడు చెట్టున కోసిన తాజా పండ్లమీద ఎంత ఎక్కువగా ఆధారపడితే వాటివలన కలిగే మేలు అంత ఎక్కువగా ఉంటుంది. CDTel 92.5

[సందర్భానికి 397 చూడండి] CDTel 92.6