Go to full page →

దేవుని మార్గదర్శకత్వానికి హామీ CDTel 92

(1902) 7T 124, 125 CDTel 92.7

151. పండ్లు, ధాన్యాలు, కూరగాయలు కలిపి పోషణనిచ్చే, వ్యాధిని నివారించే ఆహారాన్ని తయారు చేసుకోటం ప్రపంచంలో అన్ని భాగాల్లోని ప్రజలకు ప్రభువు నేర్పిస్తాడు. ఇప్పుడు మార్కెట్లను నింపుతున్న ఆరోగ్య ఆహారాలికి రెసిపీలు ఎరుగనివారు, తెలివిగా వ్యవహరిస్తూ, భూఫలాల్ని పరిశోధిస్తుంటే ఈ భూమి ఉత్పత్తుల వినియోగం పై ప్రభువు వెలుగునిస్తాడు. ఏమి చెయ్యాలో ప్రభువు వారికి చూపిస్తాడు. లోకంలో ఓ భాగంలో ఉన్న తన ప్రజలకు నిపుణతను అవగాహనను ఇచ్చే ప్రభువు లోకంలో ఇతర భాగాల్లో ఉన్న తన ప్రజలకు కూడా నిపుణతను అవగాహనను ఇస్తాడు. ప్రతీ దేశానికి సంబంధించిన ఆహారపదార్థాలు ఏ దేశాలకు సరిపడాయో ఆ దేశాల్లో ఉపయోగించటానికి అనువుగా తయారు చెయ్యాలన్నది దేవుని సంకల్పం. ఇశ్రాయేలు ప్రజల్ని పోషించటానికి దేవుడు మన్నా ఇచ్చిన రీతిగా ఇప్పుడు వివిధ స్థలాల్లో ఉన్న తన ప్రజలకి మాంసాహారానికి బదులు ఈ దేశాల ఉత్పత్తుల్ని ఉపయోగించుకుని ఆహారం తయారు చేసుకోటానికి నిపుణతను వివేకాన్ని ఇస్తాడు. CDTel 92.8

(1902) 7T 133 CDTel 93.1

152. ప్రతీ స్థలంలోను స్త్రీలేంటి పురుషులేంటి తమ ప్రాంతంలో లభించే స్వాభావిక ఉత్పత్తులనుంచి ఆరోగ్యకరమైన ఆహారం ఆహారపదార్థాలు తయారు చేయటంలో తమ ప్రతిభను వృద్ధిపర్చు కోవాలన్నది దేవుని సంకల్పం. దేవుని ఆత్మ మార్గదర్శకత్వంలో తమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తూ దేవునిపై ఆధారపడితే, స్వాభావిక ఉత్పత్తుల్ని ఆరోగ్యదాయకమైన ఆహారంగా తయారుచేసుకోటం ఎలాగో వారు నేర్చుకుంటారు. ఈ విధంగా వారు మాంసాహారం స్థానాన్ని ఆక్రమించగల ఆహారాన్ని తయారు చేసుకుని తినటం పేదవారికి నేర్పించవచ్చు. ఇలా నేర్చుకున్నవారు తిరిగి మరికొందరికి నేర్పవచ్చు. అంకిత భావం, ఉత్సాహంతో అలాంటిది ఎప్పుడూ కొనసాగుతుంది. ఈ పని ఇంతకుముందే జరిగి వుంటే నేడు అనేకమంది సత్యంలో ఉండేవారు. ఉపదేశించగలిగే వారు ఇంకా ఎక్కువమంది ఉండేవారు. మన విధి ఏమిటో తెలుసుకుని దాన్ని నిర్వర్తిద్దాం. దేవుడు మనకు అప్పగించిన పనిని ఇతరులు చెయ్యటానికి కని పెడ్తూ మనం నిస్సహాయులుగా మిగిలిపోకూడదు. CDTel 93.2

[401, 407 కూడా చూడండి] CDTel 93.3