Go to full page →

విభాగం V—శరీర ధర్మశాస్త్రం, జీర్ణక్రియ CDTel 94

ప్రకృతి చట్టాల్ని గౌరవించటం వల్ల ప్రతిఫలం CDTel 95.1

ఉత్తరం 274,1908 CDTel 95.2

153. అన్నకోశాన్ని సవ్యంగా చూసుకునే విషయంలో తీసుకునే శ్రద్ధ ఫలితంగా భావ స్పష్టత, మానసిక బలం లభిస్తాయి. మీ జీర్ణమండల అవయవాలు అకాలంగా అరిగిపోయి మీమీద వ్యతిరేక సాక్ష్యం చెప్పవు. తినటంలో చదవటంలో పనిచెయ్యటంలో వివేకంగా వర్తించటం ద్వారా మనం దేవుడిచ్చిన తెలివిని అభినందిస్తున్నట్లు చూపించాల్సి ఉన్నాం. శ్వాస మధురంగా స్వచ్ఛంగా ఉండేటట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే పవిత్ర బాధ్యత మన మీద ఉంది. ఈ అంశం పై ఉచ్చరణ ఆచరణల ద్వారా ఇతరులికి స్పష్టమైన వెలుగు ప్రతిబింబించటం ద్వారా ఆరోగ్య సంస్కరణ పై దేవుడిచ్చిన వెలుగును మనం అభినందించాల్సి వుంది. CDTel 95.3