Go to full page →

శరీరంపై అపరిమితమైన తిండి ఫలితాలు CDTel 95

(1870) 2T 364 CDTel 95.4

154. అమితమైన తిండి అన్నకోశం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అది దుర్బలమౌతుంది. జీర్ణమండల అవయవాలు బలహీనమౌతాయి. వ్యాధి దానితోపాటు దాని కీడులన్నీ వస్తాయి. ముందు వ్యాధికి గురి అయివుంటే అది మనుషుల్ని మరింత బలహీనపర్చి తమ జీవితకాలమంతా శక్తిహీనుల్ని చేస్తుంది. వారు తమ కడుపుల్ని ఏ ఆహారంతో నింపుకుంటారో దాన్ని జీర్ణించుకోటానికి శరీరంలోని ప్రధాన శక్తుల చర్య అవసరమౌతుంది. CDTel 95.5

ఉత్తరం 73a,1896 CDTel 95.6

155. ఈ అమితత్వం తరచు తలనొప్పి, అజీర్తి, శూల రూపంలో కనిపిస్తుంది. అన్నకోశం మీద పెద్ద భారం పడటంతో అది తట్టుకోలేక పోతుంది. పీడన భావం ఏర్పడుతుంది. తలలో గందరగోళం ఏర్పడుతుంది. కడుపు తిరుగుబాటు చేస్తుంది. అయితే అమిత తిండి వెనుక ఈ ఫలితాలు ఎల్లప్పుడూ సంభవించవు. కొన్ని సందర్భాల్లో కడుపు స్తంభించిపోతుంది. బాధ తెలియదు. జీర్ణమండల అవయవాలు తమ ప్రధాన శక్తిని కోల్పోతాయి. మానవ యంత్రాంగం పునాది క్రమేపి బలహీనమై బతుకు భారమౌతుంది. CDTel 95.7

ఉత్తరం 142, 1900 CDTel 96.1

156. మీరు మితాహారం పాటించాలని నా హితవు. యుక్తాయుక్త జ్ఞానం గల కావలివారిగా మీరు మీ కడుపు ద్వారాన్ని కావలి కాయాలి. మీ ఆరోగ్యానికి ప్రాణానికి శత్రువైన ఏ పదార్థాన్ని మీ పెదాలు వాటి లోనికి పోనివ్వకండి. ఆరోగ్య సంస్కరణ పై తానిచ్చిన వెలుగుకు విధేయులై ఉండటానికి దేవుడు మిమమల్ని బాధ్యుల్ని చేస్తాడు. తలకు అధిక రక్త ప్రసరణను అధిగమించాలి. జీవాధార ప్రవాహం శరీరంలోని అన్ని అవయవాలకు చేరేందుకు కాళ్ళు చేతుల్లో పెద్ద రక్తనాళాలున్నాయి. మీ కడుపులో మీరు రగిలించే అగ్ని మీ మెదడును వేడెక్కిన కొలిమి చేస్తుంది. మితంగా తినండి. ఎక్కువ మసాలాపోపు అవసరం ఉండని సామాన్య ఆహారం తినండి. మీ పాశవిక ఉద్రేకాల్ని ఆకలితో మాడ్చాలిగాని బుజ్జగించి పోషించకూడదు. మెదడులో రక్తప్రసరణ రద్దీ పాశవిక ప్రవృత్తుల్ని బలపర్చి ఆధ్యాత్మిక శక్తుల్ని బలహీనపర్చుతుంది. CDTel 96.2

మీకు తక్కువ శారీరకాహారం ఎక్కువ ఆధ్యాత్మికాహారం ఎక్కువ జీవాహారం అవసరం. మీ ఆహారం ఎంత సామాన్యంగా ఉంటే మీకు అంత మంచిది. CDTel 96.3