Go to full page →

కళంకం లేని అర్పణ CDTel 9

(1800) C.T. B.H.15 17. CDTel 9.1

పూర్వం యూదుల బలి అర్పణ సేవలో ప్రతీ బలిపశువు నిష్కళంకమైనదై ఉండాలి. మన శరీరాన్ని పరిశుద్ధ దేవునికి అనుకూలం అయిన సజీవ యాగంగా సమర్పించుకోవాలని, అట్టి సేవ మనకు యుక్తమని వాక్యం చెబుతున్నది. మనం దేవుడు చేసిన మనుషులం. మానవుల్ని సృజించటంలో దేవుని అద్భుతకార్యాన్ని ధ్యానిస్తూ కీర్తన కారుడంటున్నాడు, “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.” శాస్త్రవిద్య గడించి సత్యసిద్ధాంత పరిచయమున్న వారు తమ సొంత శరీరాలకు సంబంధించిన చట్టాల్ని అవగాహన చేసుకునే వారు అనేకులున్నారు. దేవుడు మనకు మానసిక శక్తులు వరాలు ఇచ్చాడు. ఆయన కుమారులు, కుమార్తెలుగ వాటిని సద్వినియోగం చేసుకోటం మన విధి. చెడ్డ అలవాట్ల వల్ల లేదా వక్రమైన ఆహారపానీయాలవల్ల ఈ మానసిక లేదా శారీరక శక్తుల్ని బలహీన పర్చుకుంటే దేవుడ్ని ఘనపర్చాల్సిన రీతిగా మనం ఘనపర్చలేం. CDTel 9.2