Go to full page →

జీవం CDTel 9

[C.T.B.H.52,53] (1890) C.H.121 CDTel 9.3

18. జీవం పోయిన లేక జీవం పోతున్న యాగంగా కాక సజీవ యాగంగా శరీరాన్ని తనకు సమర్పించాలని దేవుడు కోరుతున్నాడు. పూర్వం హెబ్రీ ప్రజలు అర్పించాల్సి ఉన్న బలులు కళంకం లేనివి. మానవుడి అర్పణ వ్యాధితోను, భ్రష్టతతోనూ నిండివుంటే అది దేవునికి ఇంపుగా ఉంటుందా? మన శరీరం పరిశుద్ధాత్మకు ఆలయం అంటున్నాడాయన. తన ఆత్మకు యోగ్యమైన నివాసంగా ఉండేందుకు మనం ఆ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. అపోస్తలుడైన పౌలు మనకిస్తున్న సలహా ఇది, ” మీరు మీ సొత్తుకారు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి.” తాము దేవునికి సంపూర్ణమైన సేవ చేస్తూ కుటుంబంలోనూ, సమాజంలోనూ తమ విధిని నిర్వర్తించేందుకు అందరూ తమ దేహాన్ని ఉత్తమ ఆరోగ్యస్థితిలో జాగ్రత్తగా కాపాడుకోవల్సి ఉన్నారు. CDTel 9.4