(1872) 3T 164,165 CDTel 10.1
19. ఆరోగ్యం కాపాడుకోటానికి ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా దుస్తులు ధరించాలి అన్న విషయాల పై జ్ఞానం సంపాదించటం అవసరం. ఆరోగ్య చట్టాల ఉల్లంఘన మూలంగా వ్యాధి కలుగుతుంది. అది ప్రకృతి చట్టాన్ని అతిక్రమించటంవల్ల కలిగే ఫలితం. దేవుని పట్ల, మన పట్ల, తోటి మానవుల పట్ల మన ప్రథమ కర్తవ్యం దేవుని చట్టాలికి విధేయులమవ్వటం. దేవుని చట్టాల్లో ఆరోగ్య చట్టాలు ఒక భాగం. మనం జబ్బు పడితే మిత్రులపై భారం మోపుతాం. వారిని అలసిపోయేటట్లు చేస్తాం. మన కుటుంబం పట్ల, మన ఇరుగుపొరుగు వారి పట్ల మనం నెరవేర్చాల్సిన విధుల్ని నెరవేర్చటానికి అసమర్థులమౌతాం. ప్రకృతి చట్టాన్ని అతిక్రమించి నందుకు ఫలితంగా అకాల మరణం సంభవించినప్పుడు ఇతరులకు దుఃఖాన్ని బాధను మిగుల్చుతాం. నివసించటంలో మన పొరుగున ఉన్న వారికి ఉపకరించాల్సి ఉన్న మనం వారికి అది లేకుండా చేస్తాం. మన కుటుంబాలకు మనం అందించగల సుఖసౌఖ్యాల్ని, సహాయాన్ని వారికి లేకుండా చేస్తాం. తన మహిమను ప్రచుపర్చాల్సిందిగా దేవుడు మనల్ని కోరుతున్న సేవ చెయ్యకుండా ఆయన్ని దోచుకుంటాం. ఇలా మనం దైవధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్న వారం కామా? CDTel 10.2
దేవుడు దయ, కృప కనికరాలు కలవాడు. పాప క్రియలవల్ల తమ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నవారికి వెలుగు వచ్చినప్పుడు, వారు తమ పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపపడి పాప క్షమాపణ కోరినప్పుడు, ఆయన వారు సమర్పించే పేద అర్పణను అంగీకరించి వారిని చేర్చుకుంటాడు. ఆహా, బాధలో ఉన్న, పశ్చాతాపముతో నిండి క్షమాపణ వేడుకొంటున్న పాపి తన దురభ్యాసాలు, వ్యసనాలవల్ల పాడు చేసుకోగా మిగిలిన అతడి జీవితాన్ని తోసి పుచ్చని కరుణ, వాత్సల్యం ఎలాంటిది? కృప గల ప్రభువు ఈ ఆత్మల్ని రక్షిస్తాడు. అయితే పవిత్రమైన, పరిశుద్ధమైన దేవునికి సమర్పించటానికి ఎంత న్యూనమైన, దయనీయమైన అర్పణ! చెడు అలవాట్లు, పాపకార్యాలవల్ల ఉత్తమ మానసిక శక్తులు పక్షవాతంతో స్తంభించిపోయాయి. ఆశలు, ఆశయాలు వక్రించాయి. ఆత్మ శరీరం వికృత రూపం ధరించాయి. CDTel 10.3