Go to full page →

పండ్లు, కూరగాయలు CDTel 109

(1905) M.H.299,300 CDTel 109.5

188. ఒకే భోజనంలో ఎక్కువ రకాల వంటకాలు తినకూడదు. ఇది అతి తిండికి దారి తీసి అజీర్తి కలిగిస్తుంది. CDTel 109.6

ఒకే భోజనంలో పండ్లు కూరగాయలు తినకూడదు. జీర్ణక్రియ బలహీనంగా వుంటే ఈ రెంటి ఉపయోగం తరచు కడుపులో అసౌకర్యం పుట్టిస్తుంది. అది మానసిక కృషికి అంతరాయం కలిగిస్తుంది. ఒకపూట భోజనంతో పండ్లు, రెండోపూట భోజనంతో కూరగాయలు తీసుకోటం మంచిది. CDTel 109.7

భోజనం ఒకే రకంగా ఉండ కూడదు. ఒకే రకంగా తయారుచేసిన ఒకే రకమైన వంటకాలు ప్రతి పూటా తినకూడదు. పూట పూటా తినే భోజనంలో మార్పు ఉంటే తినేవారు ఇష్టంగా తింటారు. అది శరీరానికి మెరుగైన పోషణను సమకూర్చుతుంది. CDTel 110.1