Go to full page →

కొవ్వుపదార్థాలున్న తీపి వస్తువులు, కూరగాయలు CDTel 110

ఉత్తరం 142, 1900 CDTel 110.2

189. ఒకే భోజనంలో ఒకేసారి పుడ్డింగులు, కస్టడ్లు, కేకులు కూరగాయలు కడుపులో గడబిడ సృష్టిస్తాయి. CDTel 110.3

ఉత్తరం 312, 1908 CDTel 110.4

190. మీ ఆహారం తయారు చేసే పనికి మీ ఇంట్లో మంచి సహాయకురాలిని పెట్టుకోవాలి. CDTel 110.5

రాత్రిపూట పెద్దవాడైన---కి జబ్బు చేసింది, అనుభవశాలి అయిన ఓ వైద్యుడు మీతో అన్నాడు, మీ ఆహారాన్ని నేను గమనిస్తున్నాను. మీరు ఒకే భోజనంలో ఎన్నో రకాల వంటకాలు తింటున్నారు. ఒకే భోజనంలో పండ్లు, కూరగాయల్ని కలిపి తినటం వల్ల కడుపులో ఆమ్లం ఏర్పడుతుంది. ఫలితంగా రక్తం మలిన మౌతుంది. జీర్ణక్రియ సరిగా లేనందువల్ల మనసు నిర్మలంగా లేదు. “శరీరంలోని ప్రతీ అవయవంతో మర్యాదగా ప్రవర్తించాలని మీరు గ్రహించాలి. ఆహారం విషయంలో మీరు కార్యం నుంచి కారణం ఆలోచించి తెలుసుకోవాలి.” CDTel 110.6