నాకు తెలిసిన కుటుంబాలన్నింటిలోను మీ కుటుంబానికి అవసరమైనంతగా మరే కుటుంబానికి ఆరోగ్య సంస్కరణ అవసరం లేదు. మీరు నొప్పులు బాధలతో మూలుగుతారు. అవి ఎలా వచ్చాయో మీకు బోధపడదు. శ్రమ అనుభవించటమే మీ వంతు అని, అది దైవ నిర్ణయమని భావించి దాన్ని, చక్కగా అంగీకరిస్తారు. మీ ప్రస్తుత అనారోగ్యస్థితిలోకి నడవటానికి మీ జీవితకాలంలో మీరు వేసిన అడుగుల్ని మీరు కళ్ళు తెరచి చూడగలిగితే, మీ ముందున్న వాస్తవిక పరిస్థితిని గుర్తించలేని మీ గుడ్డితనానికి విస్మయం చెందుతారు. మీరు అస్వాభావిక ఆహార వాంఛల్ని పెంచుకున్నారు. అందుకే మీరు మీ రుచిని తప్పుగా ఉపయోగించకుండా ఉంటే మీరు పొంది ఉండే ఆనందం, తృప్తిలో సగం ఆనందాన్ని తృప్తిని మీ ఆహారం మీకివ్వటం లేదు. మీది వక్రమైన స్వభావం. దాని పర్యవసానాల్ని మీరు అనుభవిస్తున్నారు. అది భాధాకరం. CDTel 122.3