Go to full page →

స్వభావంపై పడే అనుచిత ఆహార ప్రభావం CDTel 124

ఉత్తరం 274, 1908 CDTel 124.1

205. అనుచితాహారం వల్ల అనే కులు తమ చిత్త వృత్తిని పాడుచేసుకుంటారు. మన అధ్యయనాల్ని మనం ఎంత పరిపూర్ణంగా తయారుచేసుకుంటామో అంత శ్రద్ధగా ఆరోగ్యసంస్కరణ పాఠాల్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ దిశలో మనం నేర్చుకునే అలవాట్లు భవిష్యత్తులోని నిత్యజీవితానికి ప్రవర్తనల్ని నిర్మించుకోటానికి సహాయపడతాయి. ఒక వ్యక్తి తన కడుపును దుర్వినియోగపర్చుకోటం ద్వారా తన ఆధ్యాత్మికానుభవాన్ని పాడుచేసుకోటం సాధ్యం. CDTel 124.2