Go to full page →

దిద్దుబాటుకి విజ్ఞప్తులు CDTel 124

(1905) M.H.508 CDTel 124.3

206. ఆహారం విషయంలో తప్పుడు అలవాట్లు ఎక్కడుంటే అక్కడ జాప్యం లేకుండా దిద్దుబాటు జరగాలి. అన్నకోశపు దుర్వినియోగం వల్ల అజీర్తి వ్యాధి వస్తే, అధిక శ్రమ కలిగిస్తున్న ప్రతీ భారాన్ని తొలగించటం ద్వారా జీవశక్తుల్లో మిగిలిఉన్న బలాన్ని పరిరక్షించటానికి ప్రయత్నం జరగాలి. సుదీర్ఘ దుర్వినియోగం దరిమిల అన్నకోశం ఆరోగ్యాన్ని పూర్తిగా పునరుద్ధరించటం సాధ్యపడదు. అయితే సరిఅయిన ఆహారక్రమం అదనపు బలహీనత సంభవించకుండా కాపాడవచ్చు. అనేకులు దాదాపు సంపూర్తిగా కోలుకుంటారు. ప్రతీ సందర్భానికి సరిపడే నిబంధనల్ని నిర్దేశించటం కష్టం. అయినా, ఆహారం విషయంలో సరిఅయిన నియమాల్ని పాటించటం ద్వారా గొప్ప దిద్దుబాటు చోటుచేసుకోవచ్చు. ఆకలి పుట్టించే రుచిగల ఆహారం తయారు చెయ్యటానికి గృహిణి నిత్యం శ్రమపడనవసరం ఉండదు. CDTel 124.4

మితాహార ఫలం మానసిక శక్తి, నైతిక బలం. ఉద్రేకాలకి కళ్లెం వెయ్యటంలో కూడా అది దోహదపడుతుంది. CDTel 125.1

(1905) M.H.295 CDTel 125.2

207. శరీర నిర్మాణానికి అవసరమైన పోషకాల్ని ఏ ఆహార పదార్థాలు సరఫరా చేస్తాయో వాటినే భోజనానికి ఎంపిక చేసుకోవాలి. ఈ ఎంపికలో రుచి ప్రమేయముండకూడదు. తప్పు అలవాట్ల వల్ల రుచి వక్రమౌతుంది. అది తరచు ఆరోగ్యానికి హాని కలిగించి బలం చేకూర్చే బదులు బలహీనతను కలిగిస్తుంది. సమాజం ఆచారాలు సంప్రదాయాలు మనకు సురక్షిత మార్గదర్శి కావు. ప్రతీచోటా ప్రబలుతున్న వ్యాధి, దుఃఖం చాలా మట్టుకు ఆహారం విషయంలో ప్రజల మధ్య కొనసాగుతున్న పొరపాట్ల పర్యవసానాలే. CDTel 125.3

(1909) 9T 160 CDTel 125.4

208. ఆరోగ్య జీవన నియమాల విషయంలో వివేకంగా ఉన్నపుడు మాత్రమే మనం అనుచిత ఆహారం వలన కలిగే హానిని గుర్తించటానికి మేల్కొంటాం. తమ పొరపాట్లని గ్రహించిన తర్వాత తమ అలవాట్లను మార్చుకునే ధైర్యం ఉన్నవారు సంస్కరణ ప్రక్రియకు పోరాటం, పట్టుదల అవసరమని తెలుసుకుంటారు. అయితే ఒకసారి సరిఅయిన రుచులు ఏర్పడ్డప్పుడు, క్రితంలో తాము నిరపాయంగా పరిగణించిన ఆహారం అజీర్తి వ్యాధికి ఇంకా ఇతర వ్యాధులికి నెమ్మదిగా, కాని ఖచ్చితంగా పునాది వేస్తాయని గ్రహిస్తారు. CDTel 125.5

(1909) 9T 156 CDTel 125.6

209. తన ప్రజలు నిత్యం ముందుకి సాగాలని దేవుడు కోరుతున్నాడు. మానసికాభివృద్ధికి, ఆత్మపరిశుద్ధతకు తిండి వాంఛ గొప్ప ప్రతిబంధకమని మనం తెలుసుకోటం అవసరం! ఆరోగ్యసంస్కరణ గురించి మనం ఏమి చెప్పుకుంటున్నా, మనలో చాలామందిమి అనుచితాహారం భుజిస్తున్నాం. అనుచిత తిండి శారీరక, మానసిక దుర్బలతకు అతి పెద్ద కారణం. బలహీనతకు అకాల మరణానికి అది పునాది వేస్తుంది. ఆత్మపవిత్రతను అన్వేషించే వ్యక్తి ఆహారవాంఛను నియంత్రించే శక్తి క్రీస్తులో ఉన్నదని గుర్తుంచుకోవాలి. CDTel 125.7

[అతి తిండి వ్యాధికి ఒక కారణం విభాగం VIII, “తిండి ప్రీతి అదుపు” చూడండి] CDTel 126.1

[మాంసాహారికి వ్యా ధితో సంబంధం-668,677,689,690,691, 692,713,722] CDTel 126.2

[టీ, కాఫీల వాడకం కలిగించే వ్యాధి - 734,736,737,741] CDTel 126.3