Go to full page →

4—గురుగులు COLTel 47

ఆధారం : మత్తయి 13:24-30, 37-43

ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను ఏమనగా “పరలోక రాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన మనుష్యుని ఒక పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకులు పెరిగి, గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను”. COLTel 47.1

“పొలము లోకము” అన్నాడు క్రీస్తు. అయితే ఇది లోకంలో ఉన్న క్రీస్తు సంఘాన్ని సూచింస్తుందని మనం గ్రహించాలి,. ఈ ఉపమానం దేవుని రాజ్యానికి మానవ రక్షణను గూర్చిన ఆయన సేవకూ సంబంధించిన వర్ణన. ఈ పనిని సంఘం నిర్వహిస్తుంది. నిజమే పరిశుద్దాత్మ సర్వలోకంలోకి వెళ్ళి ప్రతీచోట మానవ హృదయాల్ని కదిలిస్తున్నాడు. అయితే దేవుని కోట్లలో కూర్చబడటానికి మనం పెరిగి పరిపక్వం చెందల్సింది సంఘంలోనే. COLTel 47.2

“మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు.... మంచి విత్తనములు రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు”. మంచి విత్తనం దైవ వాక్యం వలన జన్మించిన వారిని సూచిస్తున్నది. గురుగులు తప్పుడు సిద్ధాంతాల ఫలం, తప్పుడు సిద్ధాంతాల స్వరూపం అయిన ఒక తరగతి ప్రజల్ని సూచిస్తున్నాయి. “వాటిని విత్తిన శత్రువు అపవాది” దేవుడు గాని ఆయన దూతలు గాని గురుగులు ఉత్పత్తి చేసే విత్తనాన్ని ఎన్నడూ నాటలేదు. దేవునికి మనుషుడికి శత్రువైన సాతానే ఎల్లప్పుడు గురుగులు విత్తుతాడు. COLTel 47.3

తూర్పుదేశాల్లో మనుషులు తమ శత్రువు పై కక్ష తీర్చుకోవటానికి కొత్తగా విత్తనాలు నాటుకున్న పొలాల్లో విషపూరితమైన కలుపు విత్తనాల్ని నాటేవారు. అవి పెరిగేటప్పుడు గోధుమ మొక్కల వలె ఉండేవి. గోధుమలతో కలసి మొలవటంతో కలుపు మొక్కలు పంటకు విఘాతం కలిగించి వ్యవసాయ దారుడికి శ్రమను నష్టాన్ని కలిగించేవి. అలాగే క్రీస్తు పట్ల తన శత్రుత్వం వల్ల రాజ్య సంబంధుల విత్తనాల మధ్య సాతాను తన విషపూరిత విత్తనాల్ని వెదలజల్లుతాడు. తన విత్తనాల పంటను దైవ కుమారునికి ఆపాదిస్తాడు. క్రీస్తు ప్రవర్తనను కలిగి ఉండకుండా క్రీస్తు నామాన్ని ధరించిన వారిని సంఘ ములోకి తేవటం ద్వారా దుష్టుడైన సాతాను దేవునికి అగౌరవం కలిగించి రక్షణ కృషికి అపార్ధం చెప్పి ఆత్మల్ని నాశనం చెయ్యటానికి ప్రయత్నిస్తాడు. COLTel 47.4

క్రీస్తు సేవకులు అబద్ద విశ్వాసులు. నిజమైన విశ్వాసులు సంఘములో కలసి ఉండటం చూసి, ఆవేదన చెందుతున్నారు. సంఘాని హేళన చెయ్యటానికి ఏదో చెయ్యాలని ఆత్రంగా ఉన్నారు. గృహ యాజమానుడి సేవకుల్లా గురుగుల్ని వేళ్ళతో పీకి పారెయ్యటానికి వారు సిద్ధంగా ఉంటా రు కాని వారినుద్దేశించి క్రీస్తు “వద్దు” గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెరకకుండగా, వాటితో కూడా గోధుమలను పెళ్ళగింతురు. కోత కాలము వరకు రెంటిని కలపి యెదుగనియ్యుడి”. అని వారికి చెప్పాడు. COLTel 48.1

బహిరంగ పాపంలో కొనసాగే వారిని సంఘం నుంచి వేరు చెయ్యాలని క్రీస్తు స్పష్టంగా బోధించాడు. గాని ప్రవర్తనపై ఉద్దేశాలపై తీర్పు వెల్లడించే పనిని ఆయన మనకప్పగించలేదు. మన స్వభావం ఎలాంటిదో ఆయనకు బాగా తెలుసు. కనుక ఆ పని మనకు అప్పగించలేదు. అబద్ద క్రైస్తవులుగా భావించి కొందరిని సంఘం నుంచి పెరికి వెయ్యటానికి పూనుకుంటే మనం తప్పు చేస్తున్నామన్నది నిజం క్రీస్తు తన చెంతకు ఎవర్ని ఆకర్షిస్తున్నాడో వారిని మనం నిరీక్షణ లేని పాపులుగా పరిగణించటం తరుచుగా జరుగుతుంటుంది. మన అంసపూర్ణ జ్ఞానం ప్రకారం మనం వీరితో వ్యవహరిస్తే అది బహుశా వారి చివరి నీరీక్షణకు తుడిచివేస్తుంది. తాము క్రైస్తవులమని భావించే అనేకులు చివరికి అనర్హులుగా మిగులుతారు. ఎవర్ని తమ ఇరుగు పొరుగువారు అనర్హులుగా భావిస్తారో వారిలో అనేక మంది పరలోకంలో ఉంటారు. మనుషుడు తనకు కనిపించే దాన్ని బట్టి తీర్పు తీర్చుతాడు. కాని దేవుడు హృదయాన్ని బట్టి తీర్పు తీర్చుతాడు. కోత సమయం వరకు గోధుమలు గురుగులు కలసి పెరగాల్సి ఉంది. కోత ప్రారంభమంతో కృప కాలం అంతమవుతుంది. COLTel 48.2

రక్షకుని మాటల్లో ఇంకొక పాఠముంది అది సహనం ప్రేమను గూర్చిన పాఠం గురుగులు వేళ్ళు మంచి మొక్కల వేళ్ళతో అల్లిబిల్లిగా అల్లుకు పోయినట్లే, సంఘములోని దొంగ భక్తులికి యదార్ధ విశ్వాసులతో బంధాలు అనుబంధాలు ఉండవచ్చు. విశ్వాసం నటించే వీరి ప్రవర్తన పూర్తిగా వెల్లడి కాలేదు. వారిని సంఘం నుండి పెరికివేస్తే ఇది జరిగి ఉండకపోతే స్థిర విశ్వాసులుగా ఉండి ఉండేవారు తొట్రిల్లవచ్చు. COLTel 49.1

ఈ ఉపమానం బోధించే పాఠం మానవులతోను దేవదూతలతోను దేవుడు వ్యవహరించే తీరును ఉదాహరిస్తుంది. సాతాను మోసగాడు, అతడు పరలోకంలో పాపం చేసినప్పుడు నమ్మకంగా నిలిచిన దూతలు సయితం అతడి ప్రవర్తన పూర్తిగా గ్రహించలేకపోయారు. దేవుడు సాతానుని వెంటనే నాశనం చెయ్యకపోవడానికి కారణం ఇదే. ఆయన ఈ పనే చేసి ఉంటే పరిశుద్ధ దూతలు దేవుని న్యాయశీలము ప్రేమను గ్రహించేవారు కాదు. దేవుని మంచితనం దయాళుత్వం గురించిన సందేహం చెడ్డ విత్తనంలా పరిణమించి పాపం దు:ఖం అనే చేదు ఫలాలు ఫలించేది. కనుక పాపానికి కర్త అయిన సాతానుని దేవుడు నాశనం చెయ్యకుండా అతడు తన ప్రవర్తనను పూర్తిగా వెల్లడిపర్చుకోవటానికి విడిచి పెట్టాడు. పాప పర్యవసానంగా దీర్ఘయుగల పొడవున జరుగుతున్న చెడు దుష్టత్వల్ని దు:ఖంతో బాధతో నిండిన హృదయంతో దేవుడు చూస్తు ఉన్నాడు. వంచకుడైన సాతాను తప్పుడు ప్రచారం వల్ల మోసపోవటానికి ఎవర్ని విడిచి పెట్టకుండా ఉండేందుకు దేవుడు కల్వరి అనే మిక్కిలి విలువైన వరాన్ని అనుగ్రహించాడు. ఎందుచేతనంటే ప్రశస్తమైన గోధుమ మొక్కల్ని పెరికి వేయకుండా గురుగుల్ని పెరికి వెయ్యటం అసాధ్యం. ఇహ పరలోకాల ప్రభువు సాతాను పట్ల చూపిస్తున్నట్లుగా మనం మన సాటి మానవుల పట్ల సహనం చూపించకుండా ఉండగలము? COLTel 49.2

సంఘంలో అనర్హలైన సభ్యులున్నారు. గనుక లోకం క్రైస్తవ మతాన్ని శంకించడం సరికాడు. ఈ దొంగ విశ్వాసులు కారణంగా క్రైస్తవుల నిరాశ చెందటం కూడా సరికాదు. ఈ విషయమై ఆది సంఘం ఎలా వ్యవహరించింది? అననీయ సప్పిరాలు శిస్యులలో చేరారు. సీమోను మోగసు బాప్తిస్మం పొందారు.. పౌలుని విడిచి పెట్టిన తోమా విశ్వాసిగా పరిగణన పొందినవాడే. ఇస్కరియోతు యూదా ఆపొస్తలుల్లో ఒకడు. ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకోవటనికి రక్షకుడు ఇష్టపడడు.. మానవుల వక్ర స్వభావం విషయంలో ఆయన దీర్ఘశాంతిన్ని చూపించటానికి యూదాతో ఆయన ఆనుభవం దాఖలు చేయబడింది. మనం కూడా ఆ పక్రియ స్వభావం విషయంలో సహనం వహించాలని ప్రభువు కోరుతున్నాడు. సంఘములో దొంగ విశ్వాసులు లోకాంతం వరకూ ఉంటూనే ఉంటారని ప్రభువు అంటున్నాడు. COLTel 49.3

క్రీస్తు చేసిన హెచ్చరికను లెక్క చేయకుండా గురుగుల్ని పెరికివెయ్య టానికి మనుష్యులు ప్రయత్నిస్తున్నారు. దుర్మార్గులుగా పరిగణించబడ్డ వారిని శిక్షించటానికి సంఘం న్యాయస్థానాల్ని ఆశ్రయించడం కూడా జరుగుతున్నది. సంఘ సిద్ధాంతాలతో ఏకీభవించని వారిని ఖైదులో వేయటం, హింసించి చపంటం జరుగుతున్నది. క్రీస్తు ఆమోదంతో వ్యవహ రిస్తున్నామని చెబుతున్న మనుషుల ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది. లోకాన్ని తన ఆధప్యతం కిందకు తెచ్చుకోవటానికి ఇది సాతాను అవలంబించే పద్ధతి. సిద్ధాంత వ్యతిరేకులుగా తాను పరిగణించిన వారితో సంఘం ఈ తీరుగా వ్యవహరించడం వల్ల ప్రజలు దేవున్ని ఆపార్ధం చేసుకోవడం జరుగుతున్నది. COLTel 50.1

ఇతరులపై తీర్పు ఖండన కాదు గాని అణకువ, తన్ను తాను అతిగా నమ్ముకోక పోవడం ఈ ఉపమానం బోధిస్తున్న పాఠం. పొలంలో చల్లిన ప్రతీ విత్తనం మంచి గింజ కాదు. మనుష్యుల సంఘ సభ్యత్వం వారు క్రైస్తవులనటానికి రుజువు కాదు. COLTel 50.2

ఆకులు పచ్చగా ఉన్నప్పుడు గురుగు మొక్క గోధుమ మొక్క ఒకేలా కనిపిస్తాయి. అయితే పంట తెల్లగా ఉండి కోతకు సిద్ధంగా నిలిచినప్పుడు బరువైన వెన్నులతో వంగిన గోధు మొక్కతో వ్యర్ధమైన గురుగు మొక్కకు ఏ మాత్రం పోలిక ఉండదు. భక్తిపరులుగా నటించే మనుష్యులు నిజమైన విశ్వాసులతో కొంతకాలము ఏకము కావుచ్చు. క్రైస్తవ నటన అనేకుల్ని మోసపుచ్చటానికి ఉద్దేశించబడింది. అయితే లోకం పంట సమయంలో మంచి వారికి చెడ్డవారికి మధ్య పోలీక ఏమాత్రం ఉండదు. సంఘములో చేరినా క్రీస్తుతో ఏకంకాని వారు అప్పుడు బయటపడతారు. ఎండ వానల వల్ల లబ్ది పొందే నిమిత్తం గోధములతో కలసి పెరిగే తరుణం గురుగులికి కలుగుతుంది. కాని కోత సమయంలో “నీతి గలవవారెవరో మీరు తిరిగి కనుగొందురు”. మలా 3:8 పరలోక కుటుంబములో నివసించటానికి ఎవరు యోగ్యులో స్వయంగా క్రీస్తే నిర్ణయిస్తాడు. ప్రతీ వ్యక్తి కీ ఈ తన మాటలు క్రియల చొప్పున ఆయన తీర్పు తీర్చుతాడు. పేరు పెట్టుకున్నంత మాత్రాన లాభమేమి ఉండదు. నిత్య జీవార్హతను నిర్ధారించేది ప్రవర్తనే? COLTel 50.3

గురుగులు భవిష్యత్తులో ఒక సమయంలో గోధుమలవుతాయని రక్షకుడనటంలేదు. గోధుమలు గురుగులు కోత సమయం వరకు అనగా లోకాంతం వరకు కలసి పెరుగుతాయి. అప్పుడు గురుగుల్ని కాల్చివేయ టానికి గోధముల్ని దేవుని కొట్లలో కూర్చటానికి పోగు చేయటం జరగుతుంది. “అప్పుడు నీతమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు”. అప్పుడు “మనుష్యకుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి అటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును.” COLTel 51.1