Go to full page →

5—ఆవగింజను పోలియున్నది COLTel 52

ఆధారం : మత్తయి 13:31,32 మార్కు 4:30-32, లూకా 13:18,19

క్రీస్తు బోధన విన్న జనమూహంలో అనేకమంది పరిసయ్యులున్నారు. ఆయన శ్రోతల్లో బహు కొద్ది మంది మాత్రమే ఆయన్ని మెస్సీయగా అంగీకరించారని వారు గ్రహించారు. ఈ సామన్య బోధకుడు ఇశ్రాయేలుని విశ్వాసులుగా ఎలా చేయగలుగుతాడు? అని వారు తమను తాము ప్రశ్నించుకున్నారు. ధనం, అధికారం లేదా ప్రతిష్ట లేకుండా నూతన రాజ్యాన్ని ఆయన ఎలా స్థాపిస్తాడు? వారి ఆలోచనల్ని చదివిన క్రీస్తు ఇలా సమాధానం ఇచ్చాడు. COLTel 52.1

“దేవుని రాజ్యాన్ని దేనికి పోల్చుదాం? లేక దాన్ని దేనితో సరిపోల్చుదాం?” (ఆర్.వి) దాన్ని పోలింది లోక ప్రభుత్వాల్లో ఏది లేదు. ఏ ప్రజా సమాజం ఆయనకు ఒక చిహ్నాన్ని ఇవ్వలేకపోయింది. ఆయన ఇలా అన్నాడు. “ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటలో చిన్నదే అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత పెద్ద చెట్టగును. “విత్తనంలో దేవుడు పెట్టిన జీవన సూత్రం అమలు వలన విత్తంలోని సూక్ష్మజీవి పెరగుతుంది. దాని వృద్ధి ఏ మానవ శక్తి మీద ఆధారపడి ఉండదు. క్రీస్తు రాజ్యం విషయంలోను అలాగే. అది ఒక నూతన సృష్టి. దాని పెరుగుదల సూత్రాలు లోక రాజ్యపాలకుల సూత్రాలకు విరుద్ధం. భూలోక రాజ్యాలు భౌతిక బలప్రయోగం ద్వారా కొనసాగుతాయి. అవి తమ ప్రాబల్యాన్ని యుద్ధం ద్వారా నిలుపుకుంటాయి. కాని నూతన రాజ్య సంస్థాపకుడు సమాధానాదిపతి. పరిశుద్దాత్మ లోక రాజ్యాల్ని భయంకర అడవి మృగాల సంకేతం కింద వర్ణిస్తున్నాడు. అయితే క్రీస్తు “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొట్టెపిల్ల”. యోహా 1:29 తన ప్రభుత్వ పాలనా ప్రణాళికలో మనస్సాక్షిని ఒత్తిడి చేసే బల ప్రయోగం లేదు. దేవుని రాజ్యాం లోక రాజ్యాల రీతిగా స్థాపితమౌతుందని యూదులు ఎదురుచూసారు. నీతిని పెంపొందించటానికి వారు బాహ్య పద్దతుల్ని అవలంభించారు. వాటికి ప్రణాళికలు కార్యచరణ పద్ధతులు రూపొందిం చారు. కాని క్రీస్తు ఒక సూత్రాన్ని పొందుపర్చారు. సత్యాన్ని నీతిని అలవర్చుట ద్వారా ఆయన తప్పును పాపాన్ని నిర్విర్యం చేస్తాడు. COLTel 52.2

యేసు ఈ ఉపమానాన్ని చెబుతున్నప్పుడు ఆవ మొక్క అన్ని చోట్ల కనిపిస్తున్నది. గడ్డికి ధాన్యానికి పైగా లేచి, పైకి గాలిలోకి విస్తరిస్తున్న కొమ్మలతో కనిపిస్తున్నది. పిట్టలు కొమ్మ నుంచి కొమ్మకు ఎగురుతూ ఆకుల నడుమ దాగి పాటలు పాడాయి. అయినా ఈ పెద్ద మొక్క ఏ విత్తనం నుంచి మొలిచిందో అది విత్తనాలన్నిటిలోను అల్పమయింది. మొదట దాని నుండి మొలక వచ్చింది. అయితే అది బలంగా ఉండి, పెరిగి ఇప్పటి స్థితికి చేరే దాక వృద్ధి చెందింది. అలాగే క్రీస్తు రాజ్యం అదిలో సామాన్యంగా ప్రాధాన్యం లేని దానిగా కనిపించింది. లోక రాజ్యాలతో పోల్చినపుడు అది అన్నిటికన్నా అల్పమైన దానిగా కనిపించింది. తాను రాజునని చెప్పిన క్రీస్తుని ఈలోక రాజులు ఎగతాళి చేసారు. అయినా ఆయన అనుచరులకు అప్పగించబడ్డ మహత్తర సత్యాల్లో సువార్త రాజ్యం దివ్యజీవం కలిగి ఉంది. దాని పెరుగుదల ఎంత త్వరితంగా జరిగింది! దాని ప్రభావం ఎంత విస్తృతమైంది! క్రీస్తు ఈ ఉపమానం చెప్పినపుడు నూతన రాజ్య ప్రతినిధులుగా కొద్దిమంది గలిలయ జాలరుల పేదరికం,వారి అల్ప సంఖ్య కారణంగా వారిలో చేరకూడదని మనుష్యులికి పదే పదే విజ్ఞప్తి చేయ్యటం జరిగింది. అయితే ఆ ఆవగింజ పెరిగి లోకమంతట దాని కొమ్మల్ని విస్తరించాల్సి ఉంది. అప్పటి వరకు మానవుల హృదయాల్ని నింపిన లోక రాజ్యాల మహిమ నశించినపుడు, క్రీస్తు రాజ్యం బలీయమైన దీర్ఘకాలిక అధికారం గల రాజ్యంగా నిలిచి ఉంటుంది. COLTel 53.1

అలాగే హృదయంలో కృప చేసేవని ఆరంభంలో కొంచెంగా ఉంటుంది. ఓ మాట పలకటం జరుగుతుంది. ఓ కాంతి కిరణం ఆత్మలో ప్రకాశిస్తుంది. నూతన జీవితానికి నాంది పలికే ప్రభావం ప్రవర్తిస్తుంది. దాని ఫలితాలు ఎవరు కొలవలగరు? COLTel 53.2

ఆవగింజ ఉపమానం క్రీస్తు రాజ్యాభివృద్ధిని ఉదాహరిస్తుంది. దాని పెరుగుదల ప్రతీ దశలోను ఉపమానంలో పేర్కొన్న అనుభవం పునరావృతమవుతుంది. ప్రతీ యుగంలోను ప్రతీ తరంలోను దేవుడు తన సంఘానికి ప్రత్యేక సత్యాన్ని ప్రత్యేక పరిచర్యను ఇస్తాడు. లోక జ్ఞానులకి మరుగైన సత్యాన్ని ఆయన చిన్న పిల్లల్లా నిష్కపటులు దీనులు అయిన విశ్వాసులకి బయలుపర్చుతాడు. ఆత్మార్పణకు పిలుపునిస్తున్నాడు. అది పోరాడవలసిన సమరాలు సాధించవలసిన విజయాలు ఉన్నాయి. ఆదిలో దాని ప్రభోధకులు బహు కొద్దిమంది లోకంలోని గొప్పవారు. లోకాన్ని ప్రేమించే సంఘం వారిని వ్యతిరేకించి ద్వేషిస్తుంది. యూద జాతి అహంకారాన్ని మత సామారశ్యం మందలించటానికి బాప్తిస్మమిచ్చే యోహాను ఒంటరిగా నిలిచి ఉండటం చూడండి. ఐరోపా ఖండంలో మొదటిగా సువార్త సందేశంతో ప్రవేశించిన ప్రబోధకుల్ని చూడండి. డేరాలు కుట్టే పౌలు సీలలు తమ మిత్రులతో పాటు ఫిలిప్పికి వెళ్ళే ఓడను త్రోయలో ఎక్కుతున్నప్పుడు వారి కర్తవ్యం ఎంత చీకటి మయంగా నిరీక్షణ శూన్యంగా కనిపించిది! కైసరుల కోటలో క్రీస్తుని బోధిస్తూ సంకెళ్ళలో ఉన్న “వృద్దుడైన పౌలు”ను వీక్షించండి. బానిసలు శ్రామికుల చిన్న చిన్న సమాజాలు రోమా సామ్రాజ్యపు అన్యమతంతో సంఘర్షణ పడటం వీక్షించండి. లోక జ్ఞానానికి మచ్చుతునక అయిన సంఘం దురంహాంకారాన్ని ప్రతిఘటిస్తూ నిలిచిన మార్టిన్ లూథర్ ని వీక్షించండి. చక్రవర్తికి పోపుకీ వ్యతిరేకంగా నిలిచి దైవ వాక్యాన్ని చేతిలో పట్టుకొని “ఇదిగో నా నిర్ణయం . ఇది తప్ప వేరే తీర్మానం చేసుకోలేను. దేవుడు నాకు సహాయం చేయనుగాక” అంటున్న అతణ్ణి చూడండి. మతఛాందసం, శరీరాశలు, అపనమ్మకం నడుమ జాన్ వెస్లీ క్రీస్తుని ఆయన నీతిని ప్రకటించడం వీక్షించండి. అన్య ప్రపంచ దు:ఖాలతో బరువెక్కిన హృదయంతో వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించే ఆధిక్యత కోసం విజ్ఞప్తి చేస్తున్న వ్యక్తిని వీక్షించండి. “యువకుడా, కూర్చో దేవుడు అన్యుల్ని మార్చాలనుకున్నప్పుడు ఆ కార్యాన్ని నీ సహయం నా సహాయం లేకుండానే ఆయన సాధిస్తాడు.” అంటూ మత గురువులు స్పందించటం వినండి. COLTel 54.1

ఈ తరంలోని గొప్ప గొప్ప మత నాయకులు, శతాబ్దాల క్రితం సత్య విత్తనాల్ని నాటిని బోధకులికి స్తోత్రగీతాలు పాడి స్మృతి చిహ్నాలు నిర్మిస్తున్నారు. నేడు అనేకులు ఈ పని నుండి తొలగిపోయి ఆ విత్తనం నుంచి మొలచిన మొక్కను అణగదొక్కటంలేదా? దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడు (తాను పంపిన బోధకుల రూపంలో క్రీస్తు) ఎక్కడ నుండి వచ్చెనో యెరుగము” (యెహా 9329) అన్న పాత నినాదం పునరావృతమౌతుంది. ఈ కాలానికి దేవుడు ఉద్దేశించిన ప్రత్యేక సత్యాలు తొలియుగాల్లో మత గురువుల వద్ద కాక విశ్వాసులైన స్త్రీలు పురుషులు వద్ద ఉన్నాయి. COLTel 54.2

“సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోక రీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువడలేదు గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపర్చుటకు లోకములో నుండు వెట్టి వారిని దేవుడు ఏర్పర్చుకొనియున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపర్చుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు”. (1 కొరి. 1:26-29), “మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానము ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని” దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. (1 కొరి 2:5) COLTel 55.1

ఆవగింజ ఉపమానం ఈ చివరి తరంలో ప్రధానమైన విజయవంతమైన రీతిగా నెరవేరనున్నది. ఈ చిన్న విత్తనం చెట్టు అవుతుంది. చివరి హెచ్చరిక కృపావర్తమానం “ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని” 1 ప్రక.14:6-14) “ఒక జనమును ఏర్పరచుకొనుటకు” (అ.కా 15:15, ప్రక. 18:1) వెళ్ళాల్సి ఉంది. అంతట ఈ భూమి ఆయన మహిమతో వెలిగిపోతుంది. COLTel 55.2