Go to full page →

విత్తేవాడు - విత్తనం COLTel 14

మహన్నత వ్యవసాయకుడైన ప్రభువు పరలోక రాజ్య విషయాల్ని తన ప్రజల నిమిత్తం తాను చేసే పరిచర్యను ఉపమానం ద్వారా ఉదహ రిస్తున్నాడు. పొలంలో విత్తనాలు చల్లేవాడిలా ఆయన పరలోక సత్య విత్తనాల్ని వెదజల్లటానికి వచ్చాడు. ఆయన ఉపమాన బోధనే వితనం. దానితోనే ఆయన తన ప్రశస్తమైన కృపాసత్యాల్ని నాటాడు. విత్తువాడు ఉపమా నాన్ని దాని సామాన్యత కారణంగా ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు. భూమిలో నాటే స్వాభావిక విత్తనం నుంచి సువార్త విత్తనానికి మన మనసుల్ని నిడపించాలని క్రీస్తు కోరుకుంటున్నాడు. ఈ విత్తనం చల్లటం వల్ల మానవుడు దేవునికి విధేయుడై నివసిస్తాడు. COLTel 14.1

యేసుని చూడటానికి ఆయన మాటలు వినటానికి కొంతమంది గలిలయ సముద్రం పక్క సమావేశమయ్యారు. ఆ సమూహంలో వ్యాధిగ్రస్తులున్నారు. వారు చాపల మీద పడుకొని ఆయనకు మనవులుగా సమర్పించుకోవటానికి వేచి ఉన్నారు. పాప మానవుల బాధలు వ్యాధుల్ని స్వస్తపర్చటమన్నది ఆయనకు దేవుడిచ్చిన హక్కు. ఇప్పుడాయన వ్యాధిని మందలించి తన చుట్టూ జీవాన్ని ఆరోగ్యాన్ని శాంతి సమాధానాన్ని వెదజల్లాడు. వస్తున్న ప్రజల సంఖ్య అధికమవ్వడంతో ప్రజలు క్రీస్తు దగ్గరగా తోసుకుంటూ వచ్చారు. అక్కడ ఇక నిలబడే స్థలం కూడా లేదు. అప్పుడు చేపలు పట్టే పడవల్లో ఉన్న జాలరులతో ఒక మాట చెప్పి తనను పిలిచి అద్దరికి తీసుకువెళ్ళటానికి వేచి వున్న పడవలో ఎక్కి ఒడ్డు నుంచి కొంచెం దూరం పడవను నీటిలోకి లాగాల్సిందిగా తన శిష్యుల్ని ఆదేశించి తీరం పై ఉన్న ప్రజలతో ఆ పడవలో నిలబడి మాట్లాడటం మొదలు పెట్టాడు. COLTel 14.2

సముద్రం పక్క సుందరమైన గెన్నేసరతు మైదానంఉ ంది. దానికి కొంత దూరంలో కొండలున్నాయి. ఆ కొండల పక్కన ఆ మైదానంలోను విత్తేవారు కోసేవారు పనిచేస్తున్నారు. ఒకడు విత్తుతున్నాడు. ఒకడు మొదటి పంటను కోస్తున్నాడు. ఆ దృశ్యాన్ని వీక్షిస్తు క్రీస్తు అన్నాడు. COLTel 14.3

“ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉద యించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి సూరంతులగాను, ఒకటి అరువందంతులగాను ఒకటి ముప్పందంతలుగాను ఫలించెను. COLTel 15.1

క్రీస్తు కర్తవ్యాన్ని ఆనాటి ప్రజలు అవగాహన చేసుకోలేదు. ఆయన రాక తీరు వారి ఎదురు చూసిన దానికి అనుగుణంగా లేదు. యూదు వ్యవస్థ అంతటికీ యేసు ప్రభువే పునాది. ఆ వ్యవస్థ తాలూకు బ్రహ్మాండమైన సేవలు దేవుడు నియమించినవే ఏర్పాటైన కాలం వచ్చినప్పుడు, ఈ ఆచారాలు ఎవరిని సూచిస్తున్నాయో ఆప్రభువు వస్తాడని బోధించటానికి అవి ఏర్పాటయ్యాయి. అయితే యూదులు ఆ ఆచారాల్ని ఆచరణల్ని గౌరవించి ఉన్నతపర్చివాటి మూలాల్ని విస్మరించారు. మనుషులు కల్పించిన సంప్రదాయాలు సూక్తులు నిబంధనలు దేవుడు ఉద్దేశించిన పాఠాల్ని మనుషుల దృష్టి నుండి మరుగుపర్చాయి. వారు యదార్ధమైన మతాన్ని అవగాహన చేసుకొని ఆచరించటానికి ఈ సూక్తులు సంప్రదాయాలు ప్రతిబంధకాలయ్యాయి. క్రీస్తు రూపంలో వాస్తవం వచ్చినప్పుడు ఆ చాయా రూపకాలు సూచిస్తున్న నిజమైన వ్యక్తి ఆయనేనని వారు గుర్తించలేదు. ఆది సూచిస్తున్న వాస్తవ వ్యక్తిని విసర్జించి ఛాయా రూపకాలన్ని వ్యర్ధమైన ఆచారాల్ని పట్టుకొని వేలాడారు. దేవుని కుమారుడు వచ్చాడు. కాని వారు ఒకగుర్తు కావాలని కోరారు. “పరలోక రాజ్యము సమీపించియున్నది. మారుమనస్సు పొందుడి” అన్న వర్తమానానికి జవాబుగా ఒక సూచన కావాలని డిమాండు చేసారు.మత్త 3:2 వారు రక్షకుని బదులు సూచనల్ని డిమాండు చేసారు. గనుక యేసు సువార్త వారికి అటంకబండగా మారింది. లోక రాజ్యాల శిధిలాల పై తన సామ్రాజ్యాన్ని స్థాపించటానికి తనకు గల హక్కును మహాత్కార్యాల ద్వారా మెస్సీయా నిరూపించుకోవాలని వారు కనిపెట్టారు.వారి ఈ కోరికకు విత్తువాని ఉపమానం ద్వారా రక్షకుడు సమా ధానం చెప్పాడు. దేవుని రాజ్య సంస్థాపన ఆయుధాల వినియోగం ద్వారానో బలాత్కరపు చొరబాట్ల ద్వారానో కాక మనుషుల హృదయాల్లో ఓ నూతన నియమం నెలకొల్పడం ద్వారా మాత్రమే జరుగుతుందని విశదం చేసాడు. COLTel 15.2

“మంచి విత్తనము విత్తువాడు మనుష్యుకుమారుడు.” మత్త 13:37 యేసు రాజుగా రాలేదు. విత్తువాడిగా వచ్చాడు. రాజ్యాల్ని కూలగొట్టటానికి రాలేదు. విత్తనాల్ని వెదజల్లటానికి వచ్చాడు. తన అనుచరుల ముందు లోక సంబంధమైన విజయాలు జాతీయ ప్రభావం గురిగా ఉంచేందుకు రాలేదు. కాని ఓర్పుతో కూడిన శ్రమ అనంతరం, నష్టాలు ఆశాభంగాలు నడుమ పంటను కోసి సమకూర్చటానికి వచ్చాడు. COLTel 16.1

క్రీస్తు ఉపమాన భావాన్ని పరిసయ్యులుగ్రహించారు. కాని అది బోధించే పాఠం వారికి ఇష్టం లేదు. అది బోధపడనట్లు నటించారు. అక్కడి జన సమూహానికి ఆ నూతన బోధకుడి ఉద్దేశం మరింత మర్మపూరితమ య్యింది. ఆయన మాటలు వారి మనసుల్ని చలింపజేసాయి. అయినా అవి వారి ఆశల్ని భంగపర్చాయి. ఆ ఉపమానాన్ని శిష్యులు సయితం గ్రహించలేకపోయారు.అయితే అది వారి ఆసక్తిని మేల్కొల్పింది.వారు యేసు వద్దకు రహస్యంగా వచ్చి దాని భావన్ని వివరించమని వేడుకున్నారు. COLTel 16.2

క్రీస్తు కోరుకున్నది ఇదే వారి ఆశక్తిని మేల్కొలిపి వారికి మరింత ఉప దేశం ఇవ్వాలన్నది ఆయనుద్దేశ్యం. అందుకే వారికి ఆ ఉపమానాన్ని వివరించాడు. తనను చిత్తశుద్ధితో అన్వేషించేవారికి ఆయన తన వ్యాక్యాన్ని విశదం చేస్తాడు.ఎవరు పరిశుద్ధాత్మ వికాసానికి తమ హృదయం తెరుస్తారో వారు వాక్య భావం విషయంలో చీకటిలో కొట్టు మిట్టాడాల్సిన పని ఉ ండదు. “ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకొనిన యెడల ఆ బోధ దేవుని వలన కలనిదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును.”. యోహాను 7:17 సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని క్రీస్తు వద్దకు వచ్చే వారందరూ సత్యాన్ని తెలుసుకుంటారు. వారికి పరలోక రాజ్యమర్మాల్ని ఆయన వివరిస్తాడు. ఈ మర్మాలు సత్యాన్ని గ్రహించాలని ఆశించే హృదయానికి అవగాహన మవుతాయి. హృదయ మందిరంలో పరలోక వెలుగు ప్రకాశవంతగా కనిపించే కాంతిలా ఇతరులకి ప్రదర్శితమవుతుంది. COLTel 16.3

“విత్తువాడు విత్తటానికి బయలుదేరి వెళ్ళాడు” (ఆర్.వి.) తూర్పు దేశాల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల దౌర్జన్యం ప్రమాదం పొంచి ఉండటంతో ప్రజలు ప్రాకారాలు గల పట్టణాల్లో ప్రధానంగా నివసించేవారు. వ్యవసాయదారులు దినదినం తమ పనికి పట్టణాల వెలపలకి వెళ్ళడం జరిగేది. అలాగే పరలోక కర్షకుడైన క్రీస్తు విత్తటానికి బయలుదేరి వెళ్లాడు. ఆయన తన సురక్షిత, శాంతియుత గృహం విడిచి పెట్టాడు. లోకం ఉనికి లోకి రాక పూర్వం తండ్రితో కలసి తనకున్న మహిమను విడిచి పెట్టాడు. విశ్వపాలన సింహాసనం పై తన స్థానాన్ని విడిచి పెట్టాడు. బాధననుభవిస్తూ, శోధనకు గురి అవుతు ఆయన బయలుదేరి వెళ్ళాడు. నశించిన లోకం నిమిత్తం జీవం అనే విత్తనాన్ని కన్నీటితో విత్తటానికి తన రక్తంతో దాన్ని తడపటానికి బయలుదేరి వెళ్ళాడు. COLTel 17.1

ఆయనలాగే ఆయన సేవకులు విత్తటానికి వెళ్ళాలి. సత్యమనే విత్తనాన్ని విత్తటానికి ఆ బ్రాహాము పిలుపవబడ్డనప్పుడు “నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అన్న ఆ దేశం పొందాడు. “ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరి వెళ్ళేను.” COLTel 17.2

హెబ్రీ 11:8 అలాగే యెరూషలేములోని దేవాలయంలో ప్రార్థిస్తున్న అపోస్తడగు పౌలుకి “వెళ్ళుము, నేను దూరముగా అన్యజనముల యొద్దకు నిన్ను పంపుదును” అన్న వర్తమానం వచ్చింది అ.కా 22:21 అలాగే క్రీస్తుతో ఐక్యం కావటానికి పిలుపు పొందేవారు తమకున్న సమస్తాన్ని విడిచి పెట్టి ఆయన్ని వెంబడించాలి. పాత మైత్రీబంధాలన్ని తెగిపోవాలి. జీవితానికి సంబంధించిన ప్రణాళికలను స్వస్తి పలకాలి. ఐహిక ఆశల్ని ఆశాభావలిన్న ప్రభువుకి సమర్పించాలి. కఠిన శ్రమతో కన్నీటితో ఏకాంతంలో త్యాగనిరతితో విత్తనాన్ని విత్తాలి. COLTel 17.3

“విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు”. లోకంలో సత్యం విత్తటానికి క్రీస్తు వచ్చాడు. మానవడు పాపంలో పడ్డ నాటి నుండి సాతాను అసత్య విత్తనాల్ని విత్తుతున్నాడు. ఒక అసత్యం చెప్పడం ద్వారా అతడు మొదటగా మనుషుల పై అదుపు సంపాదించాడు. అలాగే లోకంలో దేవుని రాజ్యాం పడగొట్టి మనుషుల్ని తన అదుపులోకి తెచ్చుకోవటానికి అతడు ఇంకా ప్రయత్నిస్తునే ఉన్నాడు. విత్తేవాడిగా ఉన్నత లోకం నుంచి వచ్చిన క్రీస్తు సత్యమనే విత్తనాల్ని విత్తటానికి వచ్చాడు. దివ్య సభల్లో ఉన్నవాడు, నిత్యుడైన తండ్రి గూడారపు గర్భాలయంలో నివసించిన వాడు ఆయన ఆ ప్రభువు స్వచ్చమైన సత్య సూత్రాల్ని మనుషులికి అందించగలడు. అక్షయ బీజమై “శాశ్వతమగు జీవముగ ల దేవుని వాక్యము” ను మనుష్యులికి ఆయన అందిస్తాడు. 1 పేతు 1:23 ఏదెనులో పతనమైన జాతికి తాను చేసిన ఆ మొదటి వాగ్దానములో క్రీస్తు సువార్త విత్తనాన్ని విత్తుతున్నాడు. కాని విత్తువాని ఉపమానం మనుషుల మధ్య క్రీస్తు చేసిన వ్యక్తిగత పరిచర్యకు తద్వారా ఆయన స్థిరపర్చిన సేవకు వర్తిస్తుంది. COLTel 18.1

దైవ వాక్యమే విత్తనం. ప్రతీ విత్తనంలోను మొలకెత్తే నియమం నిక్షిప్తమై ఉంది. మొక్క జీవం విత్తనములోనే ఉంది. అలాగే దేవుని వాక్యంలో జీవముంది. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవితమైయున్నవి. యోహా 6:63 “నా మాట విని నన్ను, పంపినవాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు అంటున్నాడు క్రీస్తు. యోహా 5:24 ప్రతీ ఆలో, దైవ వాక్యంలోని ప్రతీ వాగ్దానంలో శక్తి ఉంది. ఆది దేవుని జీవం. ఆ జీవం ద్వారానే ప్రతి ఆజ్ఞ నెరవేర్పు పొందవచ్చు. ప్రతి వాగ్దానం పాఫల్యత పొందవచ్చు. వాక్యాన్ని విశ్వాసమూలంగా స్వీకరించే వ్యక్తి దేవుని జీవాన్ని గుణలక్షణాల్ని పొందుతాడు. COLTel 18.2

ప్రతి విత్తనం దాని దాని జాతి ప్రకారం ఫలాలు పలిస్తుంది. అందరిలోను విత్తనం నాటండి. అది మొలకెత్తి మొక్కలో తన జీవాన్ని పెంపొందింస్తుంది. విశ్వాసం ద్వారా వాక్యమనే అక్షయ బీజాన్ని ఆత్మలోకి స్వీకరించండి.దేవుని జీవితంవంటి జీవితాన్ని ఆయన గుణం వంటి గుణాన్ని అది ఉత్పత్తిచేస్తుంది. COLTel 18.3

ఇశ్రాయేలులోని బోధకులు దేవుని వాక్య విత్తనాన్ని నాటటం లేదు. క్రీస్తు కాలంలోని బోధకులకూ, సత్యవాక్య బోధకుడుగా క్రీస్తు పరిచర్యకూ ఎంతో తేడా ఉంది. నాటి బోధకులు సంప్రదాయాల్ని మానవ సిద్ధాంతాలు ఊహాగానాల్ని బోధించారు. వాక్యం గురించి మనుషులు ఏమి బోధించి ఏమి రాశారో దాన్ని వారు దైవ వాక్యం స్థానంలో తరుచు ఉంచారు. వారి బోధకు ఆత్మను చైతన్యపర్చే శక్తి లేదు. క్రీస్తు బోధానంశం దేవుని వాక్యమే. ప్రశ్నించిన వారికి “అని వ్రాయబడి ఉన్నది”. ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? “నేవేమి చదువుచున్నావు?” అన్నదే ఆయన స్పష్టమైన సమాధానం. మిత్రుడి మూలంగా గాని విరోధి మూలంగా గాని ఆసక్తి రేకిత్తిన ప్రతీ తరుణంలోను ఆయన వాక్య విత్తనాన్ని నాటాడు. ఎవరు మార్గం, సత్యం, జీవం ఎవరు తానే సజీవ వాక్యమో ఆ ప్రభువే లేఖనాల్ని సూచిస్తూ “అవేనన్ను గూర్చిసాక్ష్యమిచ్చుచున్నవి” అన్నాడు.“హో షేయ సమస్త ప్రవక్తలునుమొదలుకొని లేఖనములన్నింటిలోను తన్ను గూర్చిన వచనముల భావము”ఆయన తన శిష్యులికి వివరించాడు. యోహా 5:39,లూకా 24:27 COLTel 19.1

క్రీస్తు సేవకులు ఇదే పరిచర్య చెయ్యాల్సి అన్నారు. పూర్వంలో లాగే ఇప్పుడు కూడా దైవ వాక్యంలో ని ప్రధాన సత్యాల్ని తోసిపుచ్చి మానవ సిద్దాంతాలు ఊహగానాల్ని నమ్మటం జరుగుతున్నది. సువార్త బోదకులుగా చెప్పుకుంటున్న అనేక మంది బైబిలు మొత్తాన్ని ఆవేశపూరిత దైవ వాక్యంగా అంగీకరించడం లేదు. ఒక జ్ఞాని ఒక భాగాన్ని నిరాకరిస్తాడు. ఇంకొక వ్యక్తి మరో భాగాన్ని ప్రశ్నిస్తాడు. తమ యోచనే వాక్యం కన్నా గొప్పదని వారి భావన.వారు బోధించే బోధ ఇలా తమ అధికారంపై ఆధారపడి ఉంటుంది. వాక్యంలోని దైవాధికారం నాశనమౌతుంది. ఇలా అపనమ్మకపు విత్తనాలు వెదజల్లడం జరిగింది. ప్రజలు ఏది నమ్మాలో తెలియని సందిగ్గావస్థలో పడ్డారు. మనసు స్వీకరించకూడని నమ్మకాలు చాలా ఉన్నాయి. క్రీస్తు దినాల్లో అనేక లేఖన భాగాలికి రబ్బీలు మర్మపూరితమైన ఆర్ధాలు చెప్పేవారు. స్పష్టమైన దైవ వాక్య బోధన తమ ఆచారాన్ని ఖండిస్తుంది. గనుక దాని ప్రభావాన్ని నాశనం చెయ్యటానికి రబ్బీలు ప్రయత్నించేవారు. ధర్మశాస్త్ర ఉల్లంఘనను పట్టించుకోకుండా పోనిచ్చేందుకు గాను వారు దైవ వాక్యాన్ని చీకటి కమ్మిన మర్మంగా తయారు చేసారు. నేడు కూడా ఇదే జరుగుతున్నది. తన దినాల్లోని ఈ దురాచారాల్ని క్రీస్తు మందలించాడు. దైవ వాక్యాన్ని అందరూ అవగాహన చేసుకోవాలని ఆయన బోధించాడు. ప్రశ్నించరాని అధికారంగా కలవిగా లేఖనాల్ని ఆయన సమర్పించాడు. మనం కూడా అదే చెయ్యాలి బైబిలుని నిత్య దేవుని వాక్యంగాను, సమస్త సంఘర్షణకూ అంతంగాను, విశ్వాసమంతటికి పునాదిగాను సమర్పించడం జరగాలి. COLTel 19.2

బైబిలు శక్తిని దోచుకోవడం జరిగింది. దాని పర్యవసానం ఆధ్యాత్మిక జీవిత క్షీణతలో కనిపిస్తుంది.అంతరాత్మను మేలుకొలిపి ఆత్మకు ఉత్తే జాన్నిచ్చే దివ్య ప్రదర్శన నేడు అనేక ప్రసంగ వేదికలున్నంచి వినిపించే ప్రసంగాల్లో లేదు వినేవారు “ఆయన త్రోవలో మనతో మాటలాడుచూ లేఖనములను మనకు బోధపర్చుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండడము లేదా?” అనలేరు. లూకా 24:32 జీవం గల దేవుని కోసం దైవ ముఖాన్ని కోరుకుంటూ రోదిస్తున్నారు. అనేకమంది ఎంత వివేకమంతమైన సాత్విక సిద్దాంతాలైన లేక సాహితీ రచనలైనా అవి హృదయానికి తృప్తినియ్యలేవు. మానవ హామీలు, ఆవిష్కరణలు విలువలేనివి. ప్రజలతో దేవుని వాక్యాన్ని మాట్లాడనివ్వండి. సంప్రదాయాలు మానవ సిద్ధాంతాలు సూక్తులు మాత్రమే విన్నారని ఎవరి మాట ఆత్మను నిత్య జీవానికి నూతనం చెయ్యగలదో ఆ ప్రభువు మాట విననివ్వండి. COLTel 20.1

క్రీస్తుకి ఇష్టమైన అంశం తండ్రి కనికరం, ఆ పారమైన దైవ కృప. తండ్రి పరిశుద్ధ గుణాల్ని గురించి, ఆయన ధర్మశాస్త్రం గురించి ఆయన ఎక్కువ ప్రస్తావించాడు. తన్ను తాను మార్గంగా సత్యంగా జీవంగా ప్రజలకి సమర్పించుకున్నాడు. ఈ అంశాలే క్రీస్తు బోధకుల అంశాలు కానివ్వండి. క్రీస్తులో ఉన్నట్లే సత్యాన్ని సమర్పించండి. ధర్మశాస్త్ర విధుల్ని సువార్త విధుల్ని విశదం చెయ్యండి. ఆత్మ నిరసన త్యాగనిరతితో శోభిల్లిన క్రీస్తు జీవితం గురించి, ఆయన పరాభవం గురించి మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి ఆరోహణం గురించి, దేవుని న్యాయస్థానంలో వారి నిమిత్తం ఆయన చేస్తున్న విజ్ఞాపనను గురించి, “మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొనిపోవుదును”. అన్న ఆయన వాగ్దానం గురించి ప్రజలకి చెప్పండి, యోహా 14:3 COLTel 20.2

తప్పుడు సిద్ధాంతాల్ని చర్చించే బదులు లేదా సువార్తను వ్యతిరేకించేవారిని ఎదుర్కొనే బదులు క్రీస్తు మాదిరిని అనుకరించండి. దేవుని ధనాగారం నుంచి తాజా సత్యాలు జీవితాల్ని వెలుగులో నింపనివ్వండి. “వాక్యమును ప్రకటించుము. “సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లు”ము “సమయమందును అ సమయమందును ప్రయాసపడుము”. “నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ? ఇదే యెహోవా వాక్కు “దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే... ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు”. 2 తిమోతి 4:2 యెష 32:20, యిర్మీ 23:28 సామె 30:5,6. COLTel 21.1

“విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు”. విద్యా కృషి అంతటికి మూల సూత్రం ఇక్కడ ఉన్నది. “విత్తనము దేవుని వాక్యము” నేటి అనేక పాఠశాలల్లో దైవ వాక్యాన్ని పక్కన పెట్టడం జరుగుతున్నది. ఇతర విషయాలు మనస్సును నింపుతున్నారు. విద్యా వ్యవస్థలో నాస్తిక గ్రంధకర్తల పుస్తకాల అధ్యయానికి పెద్దపీట వేయడం జరుగుతున్నది. పాఠ్యపుస్తకాల్లోని అంశాలతో నాస్తిక భావాల్ని అల్లటం జరుగుతున్నది. శాస్త్ర పరిశోధన తప్పుదారి పట్టిస్తున్నది. కారణమేమిటంటే ఆవిష్కరణల్ని శాస్త్ర పరిశోధన తప్పు దారి పట్టిస్తున్నది. కారణమేమిటంటే ఆవిష్కరణల్ని వక్రీకరించి అపార్ధం చెప్పడం జరుగుతున్నది. దేవుని వాక్యాన్ని శాస్త్ర బోధనలుగా భావించే విషయాలతో పోల్చడం జరుగుతున్నది. దాన్ని అనిశ్చితమైన దానిగా విశ్వసనీయతలేని దానిగా కనపడేటట్లు చేయడం జరుగుతున్నది. ఈ రకంగా చిన్నారుల మనసుల్లో సందేహ విత్తనాలు నాటటం జరుగుతున్నది. శోధన కాలంలో అవి మొలకలెత్తుతాయి. దేవుని వాక్యంపై నమ్మకం పోయినప్పుడు ఆత్మకు దిక్కు తోచదు, భద్రత ఉండదు. తమను దేవునికి నిత్య జీవానికి దూరం చేసే మార్గాల్లోకి యువత ఆకర్షితులవుతారు. COLTel 21.2

నేడు మన ప్రపంచంలో ప్రబలుతున్న దుష్టత్యము దుర్మార్గాలకు చాలా మట్టుకు కారణం ఇదే. దేవుని వాక్యాన్ని విసర్జించటం జరిగినప్పుడు స్వాభావిక హృదయపు దురావేశాన్ని ఆదుపు చేయటానికి వాక్యానికున్న శక్తిని నిరాకరించడం జరగుతుంది. మనుషులు శరీర క్రియలు విత్తి ఆ శరీర క్రియల దుష్పలితాల పంటను కోస్తారు. COLTel 21.3

మాసిక దౌర్భల్యానికి అసమర్ధతకు గొప్ప హేతువు కూడా ఇక్కడుంది. ఆత్మావేశం పొందని రచయితల రచనల్ని చదవటానికి దైవ వాక్యాన్ని తోసి పుచ్చటంలో మనసు వృద్ధి చెందకుండా నిలిచిపోతుంది. నిత్య సత్య గంభీర విశాల సూత్రాలతో దానికి సంబంధం కొరవడుతుంది. ఏ విషయాలతో తనకు పరిచయముంటుందో వాటిని గ్రహించటానికి అవగాహన తన్ను తాను మలుచుకుంటుంది. పరిమితమైన విషయాల పై ఇలా శ్రద్ధ పెట్టడంలో మనసు బలహీనమౌతుంది. దాని శక్తి క్షీణిస్తుంది. తదనంతరము ఇక పెరిగే శక్తిని అది కోల్పోతుంది. COLTel 22.1

ఇదంతా తప్పుడు విద్య. పరిశుద్ధ లేఖనాల్లో సమున్నత సత్యాలపై యువత మనసుల్ని కేంద్రీకరించటమే ప్రతీ ఉపాధ్యాయుడి కర్తవ్యం. ఈ జీవితానికి రానున్న నిత్య జీవితానికి అత్యవసరమైన విద్య ఇదే. COLTel 22.2

ఇది శాస్త్ర విజ్ఞానానికి అడ్డు తగులుతుందని గాని లేక విద్యా ప్రమాణాలన్ని దిగజార్చుతుందని గాని తలంచడం సరికాదు. దేవుని గూర్చిన జ్ఞానం ఆకాశమంత ఎత్తు విశ్వమంత విశాలం అయ్యింది. మన నిత్య జీవానికి సంబంధించిన సమున్నత అంశాల అధ్యయనమంత యోగ్యమైనది. పరిపుష్టమైనది. ఇంకేది లేదు. దేవుడిచ్చిన ఈ సత్యాల్ని యువత గ్రహించడం అవసరం. ఈ కృషిలో వారి మనసులు విశాలమౌతాయి. పట్టిష్టమౌతాయి. వాక్యాన్ని ఆచరణలో పెట్టే ప్రతి విద్యార్ధిని అది విశాల భావక్షేత్రంలోకి తీసుకువచ్చి అతడికి అక్షయ జ్ఞాన నిధిని సమకూర్చుతుంది. COLTel 22.3

లేఖనాల్ని పరిశోధించడం ద్వారా సంపాదించాల్సి ఉన్న విద్య అంటే రక్షణ ప్రణాళిక గూర్చిన ప్రయోగాత్మక జ్ఞానం. అలాంటి విద్య ఆత్మలో దేవుని స్వరూపాన్ని పునరుద్ధరిస్తుంది. శోధనకు లొంగకుండా మనసును పటిష్టపర్చి లోకంలో తన కృపా పరిచర్యలో క్రీస్తు తోటి పనివాడిగా వ్యక్తిని సన్నద్ధపర్చుతుంది. పరలోక కుటుంబలో అతణ్ణి ఓ సభ్యుణ్ణి చేసి పరిశు దుల వారసత్వంలో భాగం పంచుకోవటానికి అతణ్ణి సిద్ధం చేస్తుంది. COLTel 22.4

అయితే పవిత్ర సత్య బోధకుడు అనుభవం ద్వారా తాను ఏమి ఎరుగునో దాన్ని మాత్రమే బోధించగలుగుతాడు. “విత్తువాడు తన విత్తనం విత్తాడు”. క్రీస్తు తానే సత్యం గనుక సత్యం బోధించాడు. ఆయన తలంపు ఆయన గుణం ఆయన జీవితానుభవం ఆయన బోధనలో భాగమయ్యాయి. ఆయన సేవకుల విషయంలో కూడా ఇదే జరగాలి. వాక్యం బోధించగోరే వారు వ్యక్తి గతానుభవం ద్వారా దాన్ని తమ సొంతం చేసుకోవాలి. క్రీస్తు తమకు వివేవక నీతి పరిశుద్ధత విమోచన కావటమంటే ఏంటో వారికి తెలియాలి. దైవ వ్యాక్యాన్ని ఇతరులికి అందిచంటంలో అనుకూంట “బహుశా” లాంటి పదాలు ఉపయోగించకూడదు. అపొస్తలుడైన పేతురుతో కలసి ఇలా ప్రకటించాలి. “చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు ఆని ఆయన మహాత్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపితిమి.” 2 పేతు 1:16 క్రీస్తు తాలూకు ప్రతీ బోధకుడు ప్రతీ ఉపా ధ్యాయుడు యెహానుతో కలసి, ” ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ జీవము గూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియపర్చుచున్నాము”. అని చెప్పగలగాలి, 1 యోహా 1:2 COLTel 23.1