Go to full page →

నేల - దారి పక్క COLTel 23

విత్తువాడి ఉపమానం విత్తనం చల్లిన నేల మొక్క పెరుగుదల పై ప్రధానంగా ఎలాంటి ప్రభావం చూపిస్తున్నది అన్నదాన్ని గురించి ప్రస్తావిస్తున్నది. నా సేవను గూర్చి మీరు విమర్శించడం క్షేమం కాదు లేక అది మీ ఆలోచనలకు అనుకూలంగా లేనందున నిరాశ చెందటం మంచిది కాదు. అంటూ క్రీస్తు ఈ ఉపమానం ద్వారా తన శ్రోతలతో చెబుతున్నాడు. నా వర్తమానాన్ని మీరు ఎలా పరిగణిస్తున్నారన్నదే ప్రధానమైన అంశం. దాన్ని మీరు అంగీకరించడం లేదా నిరాకరించడం అన్నదాని మీదనే మీ నిత్య భవిష్యత్తు ఆధారపడి ఉంది అన్నాడు. దారి పక్క పడ్డ విత్తనాన్ని వివరిస్తూ ఆయన అన్నాడు. “ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని యెత్తికొనిపోవును. త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడే”. COLTel 23.2

త్రోవ పక్క నాటిన విత్తనం శ్రద్ధలేని శ్రోత హృదయంలో పడ్డ దైవ వాక్యాన్ని సూచిస్తున్నది. ఆ హృదయం మనుష్యులూ, పశువులు నడవటం వల్ల గట్టిగా కరకుగా తయారైన దారిలా, లోక ప్రయాణికుల రాకపోకలకు వినోదాలు పాపాలికి రహదారిగా ఉంటుంది. స్వార్ధాశక్తులు పాపకార్యాల్లో తలమునకై ఉన్న ఆత్మ “పాపము వలన కలుగు భ్రమచేత... కఠినపరచ” బడుతుంది. హెబ్రీ 3:13 ఆధ్యాత్మిక శక్తులు స్తంభించిపోతాయి. మనుష్యులు వాక్యం వింటారే గాని దాన్ని గ్రహించలేరు. అది తమకు వర్తిస్తుందని తెలుసుకోలేరు. తమకు ఏది అవసరమో గుర్తించలేరు. తమ ముందున్న ప్రమాదాన్ని చూడలేరు. వారు క్రీస్తు ప్రేమను గుర్తించరు. ఆయన కృపావర్తమానాన్ని విని అది తమకు సంబంధించిన విషయంగా దులపరించుకొని వెళ్ళిపోతారు. COLTel 24.1

తోవ పక్కన పడ్డ విత్తనాన్ని ఎత్తుకుపోయేందుకు పిట్ట సిద్ధంగా ఉన్నట్లే ఆత్మలో నుండి దైవ సత్య వినాల్ని ఎత్తుకుపోవటానికి సాతాను సర్వసన్నద్దంగా ఉన్నాడు. దైవ వాక్యం యందు అజాగ్రత్తగా ఉన్నవారిని మేల్కొలిపి కఠిన హృదయాన్ని మొత్తబరుస్తుందని అతడు భయపడ్డాడు. సువార్త ప్రకటితమవుతున్న సభల్లో సాతాను అతడి దుష్టదూతలు ఉంటారు. దైవ వాక్యానికి హృదయాలు అనుకూలంగా స్పందించటానికి సాయ పడేందుకు పరలోక దూతలు ప్రయత్నిస్తుండగా, ఆ వాక్యాన్ని నిరర్ధకం చెయ్యటానికి అపవాది చురుకుగా పనిచేస్తాడు. తనలో పేరుకుపోయిన విద్వేషానికి వీలైన పట్టుదలతో అతడు దేవుని ఆత్మ పనికి అడ్డుకట్ట వెయ్యటానికి ప్రయత్నిస్తాడు. క్రీస్తు తన ప్రేమతో ఆత్మను ఆకర్షిస్తుండగా, రక్షకునికి స్పందిస్తున్న వ్యక్తి గమనాన్ని ఆయన పై నుంచి మళ్ళించటానికి సాతాను శ్రాయశక్తులా ప్రయత్నిస్తాడు. అతడు విమర్శలు లేక వ్యంగ్య వాఖ్యాలు సూచనలు సందేహాలు సంశయాలు అపనమ్మకాల్ని ప్రేరేపిస్తాడు. బోధకుడి భాషలేక అతడి వైఖరి శ్రోతలకు ఇష్టం లేకపోవచ్చు. శ్రోతలు ఈ లోపాల్ని ప్రస్తావిస్తారు. ఈ విధముగా వారికి ఆగత్యమైన దేవుడు వారికి పంపిన సత్యం వారిని ఆకర్షించదు. సాతానుకి సహాయకులుగా కోకొల్లలు. క్రైస్తవులుగా చెప్పుకునే అనేక మంది ఇతరుల హృదయాల్లో నుంచి సత్య విత్తనాలు ఎత్తుకుపోవటానికి సాతానుకి సహకరిస్తారు. వాక్య బోధను వినేవారిలో చాలామంది దాన్ని ఇంటి వద్ద తప్పు పట్టటానికి పూనుకుంటారు. COLTel 24.2

ఒక అధ్యాపకుడి మాటల్ని లేక రాజకీయ వ్యక్తి మాటల్ని తప్పు పట్టే తీరుగా వారు ప్రసంగాన్ని విమర్శించటానికి దిగుతారు. తమకు దేవుడు పంపిన వర్తమానంగా పరిగణంచి పొందాల్సిన విషయాన్ని వారు చులకన చెయ్యటం వక్రీకర వాఖ్యాలతో ఎగతాళి చెయ్యటం జరుగుతుంది. బోధకుడి ప్రవర్తనను, ఉద్దేశాన్ని, క్రియల్ని సాటి సంఘ సభ్యుల ప్రవర్తనను అడ్డు అదుపు లేకుండా చర్చిస్తారు. కఠిన తీర్పు వెలిబుచ్చుతారు. ఆవాకులు చవాకులు, నిందలు నిష్టూరాలు వెల్లువెత్తుతాయి. ఇదంతా విశ్వాసులు కాని వారు వింటుండగా జరుగుతుంది. తరుచూ ఈ విషయాలు తమ సొంత పిల్లలు వింటుండగా తల్లితండ్రులు అనే మాటలు. దైవ సేవకుల పట్ల గౌరవం, వారి వర్తమానం పట్ల భక్తి శ్రద్దలు ఈవిధముగా నాశనమౌతాయి. అనేకులు దైవ వాక్యాన్ని చులకనగా చూడటానికి ఇది దారి తీస్తుంది. COLTel 25.1

క్రైస్తవులుగా చెప్పుకునే వారి గృహాల్లో అనేకమంది యువజనులు నాస్తికులు కావటానికి ఇలా పాఠాలు నేర్చుకుంటున్నారు. తమ బిడ్డలు సువార్త విషయంలో ఎక్కువ ఆసక్తి ఎందుకు చూపించడంలేదని వారు సత్యాన్ని శంకించటానికి ఎందుకు వెనకాడడం లేదని తల్లితండ్రులు ప్రశ్నిస్తుంటారు. నైతికమైన మత పరమైన ప్రభావాలతో యువతను ఆకట్టుకోవడం కష్టసాధ్యమని అభిప్రాయ పడతారు. తమ పిల్లలు హృదయాల్ని కఠిన పర్చింది స్వయాన తమ ఆదర్శమేనని వారు గ్రహించరు. మంచి విత్తనం వేళ్ళు తన్నటానికి స్థలం లేకపోవడంతో ఆ విత్తనాన్ని సాతాను ఎత్తుకుపోతాడు. COLTel 25.2