Go to full page →

15—ఇతడు పాపులను చేర్చుకొకుంటున్నాడు COLTel 145

ఆధారం : లూకా 15: 1-10

“సుంకరులను పాపులను” క్రీస్తు చుట్టూ చేరుతుండగా రబ్బీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు. “ఆతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు” అన్నారు. . COLTel 145.1

ఈ ఆరోపణ ద్వారా క్రీస్తు పాపులతో జతకడున్నాడని, వారి దుష్టత్వాన్ని పట్టించుకోవటం లేదని రబ్బీలు వ్యగ్యంగా సూచించారు.క్రీస్తు విషయంలో రబ్బీలు నిరాశచెందారు. తనది ఎంత ఉన్నత ప్రవర్తన అంటున్న ఆయన తమతో ఎందుకు కలవటంలేదు? తమ బోధన పద్ధతుల్ని ఎందుకు అవలంభిచటంలేదు.? అంత ముక్కుసూటిగా వ్యవహరిస్తూ అన్ని తరగతుల మధ్య ఎందుకు పనిచేస్తున్నాడు? తాను నిజమైన ప్రవక్త అయితే ఆయన తమతో కలసి పనిచేస్తూ, సుంకరుల్ని పాపుల్ని లెక్కజెయ్యకుండా ఉండాలి అన్నారు. తాము ఎవరితో నిత్యం సంఘర్షణ పడున్నారో, అయినా ఎవరి పరిశుద్ధ జీవితంత తమను భయభీతితో నింపి ఖండిస్తున్నదో ఆయన సాంఘికంగా నీచస్థితిలో ఉన్న వీరిని సానుభూతితో కలవటం ఈ సమాజ సంరక్షకుని అగ్రహం పుట్టించింది. వారు ఆయన పద్ధతుల్ని ఆమోదించలేదు. తాము విద్యవంతులమని, సంస్కారం గలవారమని, గొప్ప మతాసక్తి ఉన్న వారమని పరిగణించుకున్నారు. అయితే క్రీస్తు జీవితం వారి స్వార్ధాన్ని బట్టబయలు చేసింది. రబ్బీల పట్ల ద్వేషం ప్రదర్శించేవారు, సమాజ మందిరంలో ఎన్నడూ కనిపించనివారు యేసు చుట్టు మూగటం కూడా వారికి కోపం పుట్టించింది. ఆ పరిశుద్ధ సముఖంలో శాస్త్రులు పరిసయ్యులు తాము అపారాధులమన్న భావన మాత్రమే పొందారు. అలాగైతే సుంకరులు పాపులు యేసుకు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? COLTel 145.2

“ఇతడు పాపులను చేర్చు”కుంటున్నాడు. అన్న తమ ద్వేషపూరిత ఆరోపణలోనే సమాధానం ఉన్నదని వారికి తెలియదు.ఆయన వద్దకు వచ్చిన ఆత్మలు తమకు సయితం పాపం నుంచి నిష్క్రతి ఉన్నదని ఆయన సముఖంలో భావించారు. పరిసయ్యుల నుంచి వారు పొందింది ద్వేషం తిరస్కారం మాత్రమే. కాని క్రీస్తు వారిని దేవునిపిల్లలుగాను, తండ్రి గృహం నుండి దూరమై వారైన తండ్రి హృదయం మర్చిపోని వారుగాను పరిగణించాడు. వారి దుస్తితి. పాపం, వారిపట్ల ఆయనికి మరింత జాలి పుట్టించాయి. వారు ఆయనకు ఎంత దూరమైతే వారి విమోచనను ఆయన అంత గాఢంగా వాంఛించి అంత గొప్ప త్యాగం చెయ్యటానికి నిశ్చయించు కున్నాడు. COLTel 145.3

ఏ గ్రంథపు చుట్టలకు తాము సంరక్షకులమని, వివరణ కర్తలమని వారు గర్వపడుతున్నారో వాటి నుంచి ఈ బోధకులు ఇదంతా నేర్చుకుని ఉండాలి. “తప్పిపోయిన గొట్టెవలె నేను త్రోవ విడిచి తిరిగితిని. నీ సేవకుని వెదకి పట్టుకొనుము” (కీర్త 119:176) అంటూ దావీదు ఘోరపాపంలో పడ్డ దావీదు రాయలేదా? మీకా పాపిపట్ల దేవుని ప్రేమను ఈ మాటల్లో వ్యక్తం చేయ్యలేదా, “తన స్వాస్థములో శేషించినవారి దోషమును పరిహరించు దేవుడనైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు'. మీకా 7:18 COLTel 146.1