Go to full page →

తప్పిపోయిన గొర్రె COLTel 146

ఈ సమయంలో క్రీస్తు తన శ్రోతలకు లేఖ వాక్కుల్ని జ్ఞాపకం చెయ్యలేదు. తమ సొంత అనుభవం ఇచ్చే సాక్ష్యాన్ని నమ్మాల్సిందిగా విజ్ఞప్తి చేసాడు. యోర్దాను నదికి తూర్పున ఉన్న విశాలమైన మైదానాలు మందలకు సమృద్ధిగా మేత సమకూర్చాయి. అనేకమైన తప్పిపోయిన గొర్రెల్ని ఇరుకుదారుల్లో, అడవులతో నిండిన కొండల మీద వెదకి వాటిని తిరిగి తీసుకురావలి... యేసు చుట్టు మూగి ఉన్న జనసమూహంలో గొర్రెల కాపురలు, గొర్రెల మందలు పశువు మందలపై పెట్టుబడి పెట్టినవారు ఉన్నారు. ఆయన ఉదాహరణ అందరిన ఆకట్టుకోగలిగింది. “మీలో ఏ మనుష్యునికనైనను నూరు గొర్రెల కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు తొంబది దొమ్మిదింటిని అడవిలో విడిచి పెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదకవెళ్ళడా”? COLTel 146.2

మీరు తృణీకరిస్తున్న ఈ ఆత్మలు దేవుని సొత్తు అన్నాడు. యేసు. సృష్టి మూలంగాను విమోచన మూలంగాను వారు ఆయనవారు. ఆయన దృష్టిలో వారికి ఎంత విలువ ఉంది. కాపరి తన గొర్రెలన్నింటిని ప్రేమించి ఒక్కటి తప్పిపోతే మనశ్శాంతి లేకుండా ఎలా ఉంటాడో అలాగే తృణీకారానికి గురి అయిన ప్రతి ఆత్మను దేవుడు మరెంతో ఉన్నతంగా ప్రేమిస్తాడు. ఆయన వెల్లడిస్తున్న ప్రేమను మనుష్యులు ఉపేక్షించవచ్చు. ఆయన్ని విడచి దూరంగా వెళ్ళిపోవచ్చు. మరో యాజమాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆయన ఇలా అంటున్నాడు “తమ గొట్టెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొట్టెలను వెదకి, చీకటిగల మబ్బు దినమందు ఎక్కడెక్కడ అవి చెదరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని ” రప్పిస్తాను. యెహె 34:12 COLTel 147.1

ఉపమానంలో కొరగాని ఒక్క పీల గొర్రెను వెదకటానికి కాపరి వెళ్ళాడు. అలాగే నశింంచిన ఆత్మ ఒక్కటే ఉన్నా., ఆ ఒక్క ఆత్మకోసం క్రీస్తు మరణించి ఉండేవాడు. COLTel 147.2

మందలో నుండి తప్పిపోయిన గొర్రె అతి నిస్సహాయ ప్రాణి. కాపరి దాన్ని వెదకి పట్టుకోవాలి. ఎందుకంటే తిరిగి రావటానికి దానికి దారి తెలియదు. దేవుని విడిచి దూరంగా వెళ్లిపోయిన ఆత్మ పరిస్థితి అలాగే ఉంటుంది. తప్పిపోయిన గొర్రెలా అతడు నిన్సహయుకుడు. దివ్య ప్రేమ రక్షించచకపోతే అతడు తిరిగి దేవుని వద్దకు రాలేడు. COLTel 147.3

తన గొర్రెల్లో ఒకటి తప్పిపోయినట్లు కనుగొన్న కాపరి, ఒకచోట క్షేమంగా ఉన్న గొర్రెల వంక ఉదాసీనంగా చూస్తు “నాకు ఇంకా తొంబయి తొమ్మిది గొర్రెలున్నాయి. తప్పిపోయిన దాని కోసం వెదకటం ప్రయాసతో కూడిన పని. అది తిరగివస్తే లోపలకి రానిస్తాను” అనుకోడు. గొర్రె తప్పిపోయిన వెంటనే కాపరికి దు:ఖం ఆందోళన కలుగుతాయి. మందను పదే పదే లెక్క పెట్టుకుంటాడు. ఒక్క గొర్రె తప్పిపోయినట్లు నిర్దిష్టంగా తెలిసినప్పుడు అతడు గుర్రు పెట్టి నిద్రపోడు, తొభై తొమ్మిదింటిని మందలోనే ఉంచి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెని వెదకుతూ వెళ్తాడు. రాత్రి ఎంత చీకటిగా ఉంటే, తుఫానులో రాత్రి ఎంత భీకరంగా ఉంటే, మార్గం ఎంత ప్రమాకరంగా ఉంటే కాపరి ఆందోళన అంత తీవ్రమై అంత పట్టుదలతో వెదకుతాడు. తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెనూ కనుగొనటానికి ప్రతీ చర్య తీసుకుంటాడు. COLTel 147.4

దూరంలో దాని మొదటి పీల అరుపు వినిపించినపడు ఎంత ఉపశమనం పొందుతాడు! ఆ శబ్దాన్ని అనుసరించి ఎత్తయిన కొండలు ఎక్కుతాడు. ఏటవాలుగా ఎత్తుగా ఉన్న కొండ శిఖరాలు సొంతప్రాణం లెక్కచెయ్యకుండా ఎక్కుతాడు. గొర్రె ఆరుపు మరింత పీలగా వినిపస్తుండగా వెదకుతున్న కాపరి అది చనిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తాడు. తుదకు అతడి కృషి ఫలిస్తుంది. తప్పిపోయిన గొర్రె దొరకుతుంది. తనకు బాధ శ్రమ కలిగించినందుకు దాన్ని తిట్టడు, కొట్టడు, దాన్ని ఇంటికి నడిపించనైనా నడిపించడు. వణుకుతున్న ఆ గొర్రెని సంతోషంగా భుజాలపై పెట్టుకొని మోస్తాడు. దానికి దెబ్బలుగాని గాయాలు తగిలే వేడి పుట్టించి దాని ప్రాణం నిలిపేందుకు దాన్ని తన రొమ్ముకి హత్తుకుంటాడు. తన ప్రయాస వ్యర్ధం కాలేదన్న ఆనందంతో దాన్ని మోసుకువచ్చి మందలో చేర్చుతాడు. COLTel 148.1

విచారంతో నిండిన కాపరి 000గొర్రె లేకుండా తిరగి వచ్చిన చిత్రాన్ని మన ఊహకు ఆయన సమర్పించుటలేదు. అందుకు సంతోషం, ఈ ఉపమానం పరాజయం గురించి మాట్లాడటం లేదు. పునరుద్దరణ విజయాన్ని అందులోని ఆనందాన్ని గూర్చి మాట్లాడున్నది. దేవుని మందలో నుండి తప్పిపోయిన ఒక్క గొర్రెను కూడా మర్చిపోవటం, సహాయ హస్తం అందించకుండా ఒక్క ఆత్మను విడిచి పెట్టటం జరగదని దేవుడు ఇక్కడ హమీ ఇస్తున్నాడు. రక్షణ పొందటానికి తన్ను తాను సమర్పించుకునే ప్రతీవారిని దుర్నీతి గుంటలో నుండి పాపపు ముళ్ళ పొదలో నుండి క్రీస్తు రక్షిస్తాడు. COLTel 148.2

ఆధైర్యపడ్డవారలారా, మీరు దుర్మార్గంగా నివసించినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ అతిక్రమాల్ని క్షమించడేమోనని, తన సన్నిధిలోకి మిమ్మల్ని రానివ్వడేమోనని తలంచకండి. దేవుడే ముందుకు వస్తున్నాడు. కాపరి కరుణా హృదయంతో ఆయన తప్పిపోయిన దాన్ని వెదకటానికి తొంబయి తొమ్మిదింటిని అరణ్యంలో విడిచి పెట్టాడు. దెబ్బలు తగిలి గాయపడి మరణించటానికి సిద్ధంగా ఉన్న ఆత్మను ఆయన ప్రేమతో కౌగలించుకొని మందలోకి క్షేమంగా మోసుకువెళ్తాడు. COLTel 148.3

దేవుడు పాపిని ప్రేమించకముందు పాపి పశ్చాత్తాపపడటం అవసరమని యూదులు బోధించారు. పశ్చాత్తాపం దేవుని ప్రసన్నతను సంపాదించటానికి మనుషులు చేసే కృషి అన్నది వారి అభిప్రాయం. “ఇతడు పాపులను చేర్చు” కుంటున్నాడు. అంటూ పరిసయ్యులు ఆశ్చర్యం అగ్రహం వ్యక్తం చెయ్యటానికి దారి తీసింది ఈ అభిప్రాయమే. పశ్చాత్తాపపడ్డవారిని తప్ప మరెవర్నీ ఆయన చేర్చుకోకూడదన్నది వారి అభిప్రాయం. అయితే తప్పిపోయిన గొర్రె ఉపమానంలో, రక్షణ మనం దేవుణ్ణి వెదకటం ద్వారా కాక దేవుడు మనల్ని వెదకటం ద్వారా కలుగుతుందని క్రీస్తు బోధిస్తున్నాడు. “గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు. అందరును తోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి”. రోమా 3:11, 12 దేవుడు మనల్ని ప్రేమించాలని మనం పశ్చాత్తాపపడటం కాని మనం పశ్చాత్తాపపడే నిమిత్తం ఆయన తన ప్రేమను మనకు వెల్లడి చేస్తాడు. COLTel 149.1

తప్పిపోయిన గొర్రె తుదకు ఇంటికి వచ్చినప్పుడు, కాపరి తన కృతజ్ఞతను ఆనంద గీతాలతో వ్యక్తం చేసాడు. “మీరు నాతో కూడ సంతోషించుడి, తప్పిపోయిన నాగొట్టే దొరికినది” అని తన మిత్రులతోను పొరుగువారితోను చెప్పుతాడు. అలాగే సంచరించే వ్యక్తిని పరలోక కాపరి కనుగొన్నప్పుడు పరలోకం భూలోకం ఏకమై కృతజ్ఞత సంతోషానందాలు వ్యక్తం చెయ్యటం జరుగుతుంది. COLTel 149.2

“మారు మనస్సు అక్కరలేని తొంబడి తొమ్మిది మంది నీతిమంతులు విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును” పరిసయ్యు లారా, మిమ్మల్ని మీరు దేవునికి ప్రియులుగా తలపోసుకుంటున్నారు. మీ సొంత నీతి మీకు సరిపోతుందని భావిస్తున్నారు. మీకు పశ్చాత్తాపం అవసరం లేకపోతే, నా పరిచర్య మీకు కాదు. తమ పేదరికాన్ని పాప స్తితిని గుర్తిస్తున్న ఈ ఆత్మల్ని రక్షించటానికే నేను వచ్చాను. మీరు తృణీకరిస్తున్న ఈ నశించిన ఆత్మల పట్ల దేవదూతలకు ఆసక్తి ఉంది. వీరిలో ఒకరు నాతో కలిస్తే మీరు ఎగతాళి చేస్తారు. అయితే దేవదూతలు ఆనందిస్తారు. పరలోకం విజయగీతంతో మారుమోగుతుందని తెలుసుకోండి. COLTel 149.3

దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన ఒక వ్యక్తి నాశనం చెయ్యబడ్డప్పుడు పరంలోకం ఆనందిస్తుందన్న సామెత రబ్బీల మధ్య ఉండేది. నాశన కార్యం దేవునికి ఆశ్చర్యకరమైన కార్యం అని యేసు బోధించాడు. పరలోకమంతా చూసి ఆనందించే కార్యం ఏంటంటే దేవుడు సృజించిన ఆత్మల్లో దేవుని స్వరూపం పునరద్దరణ కావటం. COLTel 150.1

పాపంలో దూరంగా వెళ్ళిన ఒక వ్యక్తి దేవుని వద్దకు తిరిగి రావటానికి ప్రయత్నించినప్పుడు అతడు విమర్శలు, అపనమ్మకాల్ని ఎదుర్కుంటాడు. అతడి పశ్చాత్తాపం నిజమైందా అని కొందరు అనుమానిస్తారు. లేక “అతడు స్థిరుడు కాడు అతడు చెప్పేది నమ్మలేం” అంటూ గుసగుసలాడుకుంటారు. ఈ మనుషులు చేసేది దేవుని పనికాదు. సహోదరులపై నిందలు మోపే అపవాది పని. వారి విమర్శల వల్ల అపవాది ఆ ఆత్మను నిరాశకు గురి చేసి నిరీక్షణకు దేవునికి మరింత దూరంగా తరిమివెయ్యాలన్నది అతడి నిరీక్షణ. నశించిన ఒక్క వ్యక్తి తిరిగి రావటం పై పరలోకంలో చోటుచేసుకునే ఆనందం గురించి పశ్చాత్తాపం పొందే పాపి తలపోయాలి. అతడు దేవుని ప్రేమలో నిలిచి ఆనందించాలి. పరిసయ్యులు తలపోయాలి. అతడు దేవుని ప్రేమలో నిలిచి ఆనందించాలి. పరిసయ్యుల ద్వేషం, అనుమానం విషయమై అతడు ఏమాత్రం నిరాశ చెందరాదు. COLTel 150.2

క్రీస్తు ఉపమానాల్ని సుంకరులికి పావులికి వర్తిస్తున్నట్లుగా రబ్బీలు అవగాహన చేసుకున్నారు. కాని దానికి ఇంకా విశాలమైన అర్ధం కూడా ఉంది. తప్పిపోయిన గొర్రె ద్వారా వ్యక్తిగత పాపినేకాదు. పాపం వల్ల భ్రష్టమై నాశనమైన మన ఒక్క లోకాన్ని కూడా క్రీస్తు సూచిస్తున్నాడు. దేవుడు పరిపాలించే విస్తారమైన లోకాల్లో మన లోకం ఒక అణువు మాత్రమే. అయినా పతనమైన ఈ చిన్న లోకం తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె మంద నుంచి తప్పిపోని తొంబయి తొమ్మిది గొర్రెల కన్నా విలువైనది. నశించిన ఈ ఒక్క లోకాన్ని రక్షించటానికి పరలోక ఆస్థాన ప్రియ సేనాపతి అయిన క్రీస్తు తన ఉన్నత స్థాయి మంచి తన్ను తాను తగ్గించుకొని తండ్రితో తనకున్న మహిమను పక్కన పెట్టాడు. తనను ప్రేమించే ఆ తొంబయి తొమ్మిది పాపరహిత లోకాన్ని విడిచి పెట్టి “మన యతిక్రమక్రియలను బట్టి... గాయపర్చబడ” టానికి మన దోషములను బట్టి నలుగగొట్ట” బడటానికి ఈ భూమికి వచ్చాడు. (యెష 53:5) తప్పిపోయిన గొర్రెను తిరిగి సంపాదించే ఆనందాన్ని పొందేందుకు దేవుడు తన కుమారునిలో తన్ను తాను లోకానికి సమర్పించుకున్నాడు. COLTel 150.3

“మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనో చూడుడి”. 1 యోహా 3:1 క్రీస్తు అంటున్నాడు. “నీవు నన్ను లోకమునకు పంపిన ప్రాకారము నేనును వారిని లోకమను పంపితిని” (యోహా 17:18) “సంఘము అను ఆయన శరరీము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన” వాటిని పూర్తి చెయ్యటానికి కొలొ 1:24 క్రీస్తు రక్షించిన ప్రతీ ఆత్మ తప్పిపోయిన వారిని రక్షించటానికి క్రీస్తు పేరిట పని చేయాలి. ఇశ్రాయేలులో ఈ పరిచర్యను నిర్లక్ష్యం చెయ్యటం జరిగింది., నేడు క్రీస్తు అనుచరులమని చెప్పుకుంటున్నవారూ దీన్ని నిర్లక్ష్యం చెయ్యటం లేదా? COLTel 151.1

పాఠక మహాశయా సంచారం చేస్తున్న వారిలో ఎంతమందిని వెదకి తిరిగిమందలోకి మీరు చేర్చారు? పనికిరాని వారిగా, ఆకర్షణలేని వారిగా కనిపించేవారి నుండి మీరు పక్కకు తొలగేటప్పుడు క్రీస్తు ఏ ఆత్మల కోసం వెదకతున్నాడో వారిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తిస్తున్నారా? మీరు వారి నుండి తొలగిపోతున్న సమయంలోనే మీ దయ వారికి అత్యంత అవసరమై ఉండవచ్చు. ప్రతీ ఆరాధన సమావేశంలో విశ్రాంతిని శాంతిని ఆకాంక్షిస్తూ ఆత్మలు ఉంటాయి. వారు అజాగ్రత్తగా నివసిస్తున్నట్లుగా కనిపించవచ్చు. కాని పరిశుద్దాత్మ ప్రభావాన్ని గుర్తించనివారు కారు. అందులో అనేకుల్ని క్రీస్తు విశ్వాసులుగా చెయ్యవచ్చు. COLTel 151.2

తప్పిపోయిన సంచరిస్తున్న గొర్రెని తిరిగి మందలోకి తీసుకురాకపోతే అది నశించే వరకు సంచరిస్తూనే ఉంటుంది. రక్షించటానికి చాపిన హస్తం లేనందు వల్ల అనేక ఆత్మలు నాశనమవ్వవచ్చు. అపరాధాలు చేస్తున్న వీరు కఠినులుగా, ఆసక్తి లేనివారిలా కనిపించవచ్చు. కాని ఇతరులకన్న అవకాశాలే వారికీ ఉంటే, వారి ఆత్మలు మరింత ఉదాత్తంగా, ఉన్నతంగా తయారై ప్రయోజకనకరమైన సేవకు తగిన సమర్ధతలువృద్ధిపర్చుకుంటారు. దారి తప్పి తరుగుతున్న వీరిపై దేవదూతలు కనికరం చూపుతారు. మానవుల కళ్ళు హృదయాలు దయా కనికరాలకి మూతపడుతుంటే దేవదూతలు కంట తడి పెడ్తారు. COLTel 151.3

శోధనకు గురిఔతున్న వారి పట్ల, తప్పులు చేసే వారిపట్ల సానుభూతి కరువైకుండా ఉంటే ఎంత బాగుండును! క్రీస్తు స్పూర్తి తక్కువగా, ఎంతో తక్కువగా ఉంటే ఎంత బాగుండును! COLTel 152.1

క్రీస్తు చెప్పిన ఉపమానం తమకు మందలింపుగా పరిసయ్యులు అవగాహన చేసుకున్నారు. తన పని విషయంలో వారి విమర్శను అంగీకరించే బదులు సుంకురుల్ని పాపుల్ని నిర్లక్ష్యం చేస్తున్నందుకు వారికి విమర్శించాడు. ఈ పని ఆయన బహిరంగంగా చెయ్యలేదు. అలా చేస్తే వారి మనస్సులు ఆయనకు మూతపడి ఉండేవి. కాని దేవుడు వారు చెయ్యాలని కోరిన పనిని, వారు చెయ్యకుండా ఉన్న పనిని ఆయన ఉదాహరణ మరియు ముందు చేపట్టింది. ఇశ్రాయేలు నాయకులు నిజమైన కాపరులై ఉంటే, వారు కాపరి పనిని చేసేవారు. క్రీస్తు ప్రేమను కృపను చూపించేవారు. ఆయన సేవలో ఆయనతో కలసి పనిచేసేవారు. ఇది చెయ్యటానికి వారు నిరాకరించడం తాము ప్రచారం చేసుకుంటున్న తమ భక్తి నిజమైన భక్తి కాదని నిరూపించింది. అనేకులు క్రీస్తు గద్దింపును తోసిపుచ్చారు. అయినా ఆయన మాటలు కొందరిలో విశ్వాసం పుట్టించాయి. క్రీస్తు ఆరోహనమైన తరువాత మీదికి పరిశుద్దాత్మ దిగి వచ్చాడు. తప్పిపోయిన గొర్రె ఉపమానంలోసూచింని పనిని శిష్యులతో కలసి వీరు చేసారు. COLTel 152.2