Go to full page →

శారీరక శాస్త్ర అధ్యయనం MHTel 332

తల్లిండ్రులు తమ పిల్లకు చిన్నతనంలోనే శరీర శాస్త్రంలో ఆసక్తి పుట్టంచి దాని సామాన్య సూత్రాలను వారికి భోధించాలి. శారీరక, మానసిక ఆధ్యాత్మిక శక్తులను ఉత్తమంగా ఎలా కాపాడుకోవాలో తమ జీవితాలు పరస్పరం ఎలా దీవెన గాను దేవునిఇక మహిమకరంగాను ఉండగలవో వారికి నేర్పించండి. పాఠశాలల్లో భోధించే శాస్త్రాలకాన్న చిన్నారులకు ఈ జ్ఞానం ఎంతో విలువగలది. జీవితానికి ఆరోగ్యానికి సంబంధించిన జ్ఞాన 0 వారికి ఎంతో ప్రాముఖ్యమైనది. MHTel 332.1

తల్లితండ్రులు తమ బిడ్డల కోసం ఎక్కువగాను సమాజం కోసం తక్కువగాను జీవించాలి, ఆరోగ్యాంశాలను అధ్యయనం చేసి మీ జ్ఞానాన్ని ఆచరణీయంగా ఉపయోగించండి. కార్యం నుంచి కారణాన్ని ఆలోచించటం మీ పిల్లలకు నేర్పించండి. ఆరోగ్యాన్ని ఆంనదాన్ని కోరుకు న్నట్లయితే వారు ప్రకృతి చట్టాలకు విధేయులై జీవించాలని వారికి భోదించడి. మీరు ఆశించిన వేగవంతమైన వృద్ధిని మీరు చూడలేక పోయిన ప్పటికి అధైర్యపడవద్దు మీ పనిని ఓర్పుతో పట్టుదలతో కొనసాగించండి. MHTel 332.2

ఊయలలో ఉన్న నాటి నుంచే తమను తాము ఉపేక్షించుకోవటాన్ని, ఆత్మ నిగ్రహాన్ని మీ బిడ్డలకు నేర్పించండి. ప్రకృతి అందాల్ని అస్వాదించటం, తమ శారీరక మానసిక శక్తులన్నిటిని ప్రయోగాత్మకమైన పనిలో ఉపయో గించటం ద్వారా క్రమబద్ధంగా వినయోగించటం నేర్పించండి. మంచి శరీర తత్వాలు నీతి వర్తన, ఉల్లాసకరమైన స్వభావాలు, ఆనందకరమైన ప్రకృతి కలిగి ఉండేవిధంగా పిల్లల్ని పెంచండి. మనం ప్రస్తుత ఆనంద కోసమే జీవించకూడదని తుదకు మేలుగా పరిణమించేదాని కోసమే జీవించాలని దేవుడు కోరుతున్నాడని వారికి నేర్పించండి. శోధనకు లొంగటం బలహీనత దుర్మార్గత అని దాన్ని ప్రతిఘటించటం ఉత్తమం పురుషత్వం అని వారికి నేర్పించండి. ఈ పాఠాలు మంచి నేలను నాటిన విత్తనంలా మీ హృదయాలకు ఆనందాన్నిచ్చే పంటను పండుతాయి. MHTel 332.3

అన్నిటికన్నా ముఖ్యంగా తల్లితండ్రులు తమ బిడ్డల చుట్టూ ఆనందం, సౌజన్యం, ప్రేమ, వాతావరణాన్ని నింపాలి. ప్రేమ ఏ గృహంలో ఉంటుందో, అది చూపుల్లోను, మాటల్లోను, పనుల్లోను ఏ గృహంలో వ్యక్తమౌతుందో అక్కడ దేవ దూతలు తమ సన్నిధిని కనపర్చటానికి తహతహలాడతారు. MHTel 333.1

తల్లితండ్రులారా, మీ ప్రేమ సూర్య రశ్మిని,మీ సంతోషాన్ని, మీ ఉత్సాహ భరిత సంతృప్తిని మీ హృదయాల్లోకి ప్రవేశించనివ్వండి. ఆనంద దాయకమైన దాని ప్రభావం మీ గృహాన్ని ఆవరించనివ్వండి, దయ, సహన స్వభావాన్ని ప్రదర్శిచండి. దాన్నే మీ పిల్లల్లో ప్రోత్సహించి గృహ జీవితాన్ని ఆనందంతో నింపే సుగుణాలను వారిలో వృద్ధిపర్చండి. వాయు ప్రసరణ సూర్యరశ్మిశ కూరగాయల ప్రపంచానికి ఎలా మేలు చేస్తుందో అలాగే ఈ రకంగా సృష్టించబడే వాతావరణం మీ బిడ్డల ఆరోగ్యాన్ని మానసిక శారీరక శక్తిని వృద్ధి చేస్తుంది, MHTel 333.2

*****