Go to full page →

33—గృహ ప్రభావాలు MHTel 334

పిల్లలకు గృహ లోకమంతటిలోనూ మిక్కిలి ఆకర్షనీయమైన స్తలం తల్లి సముఖం అత్యుతన్న ఆకర్షణ కావాలి. పిల్లల్ని సున్నితమైన ప్రేమతో నిండిన స్వభావాలు. వారిని సులువగా సంతోపర్చవచ్చు. సులువుగా దు:ఖపర్చవచ్చు. సావధానమైన క్రమశిక్షణతో ప్రేమ గలమాటలు పనులతో తల్లులు వారి హృదయాలను తమ హృదయాలతో ముడిపెట్టుకోవచ్చు. MHTel 334.1

చిన్న పిల్లలు స్నేహాన్ని ప్రేమిస్తారు. వారిక ఒంటరితనం ఎక్కువ ఇష్టముండదు. సానుభూతి సున్నితమైన ప్రేమ కోసం వారు తహతహలాడతారు. తమకు ఇష్టమయ్యిది తల్లికి కూడా ఇష్టమని భావిస్తారు. కనుక వారు తమ చిన్న చిన్న సంతోషాలు దు:ఖాలతో తల్లి వద్దకు వెళ్ళటం సహజం. తనకు చిన్న విషయాలుగా కనిపించినా వారికి ఎంతో ప్రాముఖ్యమైన విషయాల్ని నిర్లక్ష్యంగా చూడటం ద్వారా మృదువైన వారి హృదయాల్ని తల్లి గాయపర్చకూడదు. ఆమె సానుభూతి ఆమోదం వారికి ఎంతో విలువగలవి. అంగీకారాన్ని సూచించే ఒక్క చూపు ఉద్రేకపర్చే ఒక్క మాట లేక మెచ్చుకోలు వారి హృదయాల్లో సూర్యకాంతిలా ఉండి వారిని దినమంతా ఆనందముతో నింపుతుంది. MHTel 334.2

తమ గోల వల్ల తనకు చికాకు పుట్టించకుండేందుకు లేక ఇది కావాలి అది కావాలి అనే తమ కోరికల వల్ల తనను శ్రమ పెట్టకుండేందుకు తన దగ్గర నుంచి పిల్లల్ని పంపికెయ్యటంకన్నా తల్లి వారి మనసుల్ని చేతుల్ని పనిలో ఉంచేందుకు వారికి ఏదో వినోదం లేక తేలికపాటి పని ఏర్పాటు చేయ్యటం మంచిది,. MHTel 334.3

వారి మనోభవాల్లోకి ప్రవేశించి వారి వినోదాన్ని పనుల్ని నిర్దేశించంటం ద్వారా తల్లి తన పిల్ల విశ్వాసాన్ని సంపాదించి వారి దురభ్యసాల్ని స్వార్ధాన్ని ఉద్వేగాల్ని సమర్ధంగా సరిదిద్దగలుగుతుంది. సరియైన సమయంలో పలికిన హెచ్చరిక లేకమందలింపు ఎంతో విలువను సంతరించుకుంటుంది. ఓర్పు కలిగిన, అప్రమత్తమైన ప్రేమ ద్వారా పిల్లల మనసుల్ని సరియైన దిశలో నడిపించి వారిలో అందమైన ఆకర్షణీయమైన లక్షణాలతో కూడిన ప్రవర్తనను వృద్ధిపరస్తుంది. తమ బిడ్డల్ని ఒకరిపై ఆధారపడేవారి గాను స్వార్ధ చింతనలో నిమగ్నమయ్యేవిధంగాను తయారు చెయ్యకుండా తల్లులు జాగ్రత్తగా ఉండాలి. తామే ప్రధానమన్నట్లు ప్రతీది తమ చుట్టునే తిరగాలన్నట్లు భావించేటట్లు వారిని నడిపించకండి. కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లల్ని ఉల్లాసపర్చటానికి ఎక్కువ సమయం దృష్టి పెడుతుంటారు. కాని తమను తాము ఉల్లాసపర్చుకోవటానికి తమ తెలివిని నైపున్యాన్ని వినియోగించటానికి పిల్లల్ని తర్బీతు చెయ్యాలి. MHTel 334.4

ఇలా వారు చాలా సామాన్యమైన వినోదాలతో తృప్తి పడటానిక నేర్చుకుంటారు. తమ చిన్న ఆశాభంగాలు కష్టాన్ని ధైర్యంగా భరించటం వారికి నేర్పించాలి. ప్రతీ చిన్న నొప్పికి దెబ్బకు దృష్టిని ఆకర్షించేబదులు చిన్న చిన్న చికాకులను అసౌకర్యాలను లెక్క చేయకుండా సాగిపోవాలని వారికి నేర్పించండి. పిల్లల ఇతరుల విషయంలో ఎలా పరిగణన కలిగి ఉండాలో వారికి సూచించ టానికి అధ్యయనం చెయ్యండి. MHTel 335.1

కాని పిల్లల్ని అశ్రద్ధ చెయ్యకండి. అనేక చింతల భారంతో సతమతమౌతూ కొన్నిసార్లు తమ చిన్నారులకు ఉపదేశమివ్వటానికి ప్రేమ సానుభూతి చూపించటానికి తమకు సమయం లేదని అభిప్రాయ పడతుంటారు. పిల్లల్ని తమ సొంతతల్లితండ్రుల్లో తమ సొంత గృహంలో సానుభూతికి తమ కోరికను తృప్తి పర్చేదాన్ని కనుగోకపోతే వారు తమ మనసుకు ప్రవర్తనకు ప్రమాదం కలిగించే చోట్ల ఇతర వనరుల్ని వెదుకుతారని తల్లితండ్రులు గుర్తుంచుకోవాలి. MHTel 335.2

సమయం ఆలోచన కొరవడి నందు వల్ల అనేకమంది తల్లులు తమ వేళ్లు పనిచేస్తుండగా తమ కళ్ళు ఆలసిపోతుండగా, అలంకరణకు ఉ ద్దేశించిన పనిలో, ఆహాంకారాన్ని దుబారాను ఆ చిన్నిరి హృదయాల్లో ప్రోత్సహించే పనిలో శ్రద్ధగా నిమగ్నమై, తమ పిల్లలకు అమాయకమైన వినోదం అనుమతించరు. ఆ పిల్లలు ఎదిగి పురుషులు స్త్రీలు అవుతున్న ప్పుడు అహంకారంలోను నైతిక దౌర్బాగ్యంలోను ఈ పాఠాలు ఫలాలు పలిస్తాయి. తల్లి తన పిల్లల తప్పిదాల విషయంలో దు:ఖిస్తుంది. గాని తాను కోస్తున్న పంట తాను నాటిని విత్తనం పండిన పంటేనని గుర్తించదు. MHTel 335.3

కొందరు తల్లులు తమ పిల్లలందరినీ ఒకే విధంగా చూడరు. కొన్నిసార్లు వారిని గారం పెట్టి హాని చేస్తారు. మళ్ళీ తమ చిన్నారి హృదయాలకు ఎంతో ఆనాందాన్నిచ్చే ఓ అమాక సంతృప్తిని నిరకరిస్తారు. ఇందులో వారు క్రీస్తును అనుకరించరు. ఆయన చిన్న పిల్లల్ని ప్రేమించాడు. వారి మనోగతాలను అవగాహన చేసుకొని తమ వినోదాల్లో శ్రమల్లోను వారికి సానుభూతి చూపించరు. MHTel 336.1