Go to full page →

పాఠశాల పని MHTel 345

పాఠశాల కృషి గృహ శిక్షణకు తోడు కావాలి. శారీరకంగా మానసి కంగా, ఆధ్యాత్మికంగా వ్యక్తి మొత్తం వృద్ధి చెందాలి. సేవా స్పూర్తిని త్యాగమూర్తిని నిత్యం దృష్టిలో ఉంచుకోవాలి. MHTel 345.5

ఏ ఇతర సాధనం కన్నా,. క్రీస్తు సేవ కోసం ప్రవర్తనను రూపుదిద్దటానికి, జీవితాన్ని నిస్వార్ధ సేవా మార్గాల్లో నడపటానికి అనుదినానుభవంలోని చిన్న చిన్న విషయాలకు శక్తి ఉన్నది. ఈ స్పూర్తిని మేల్కొల్పి దాన్ని సరియైన విధంగా నడిపించటం తల్లితండ్రులు ఉ పాధ్యాయల కర్తవ్యం. వారికి నియమించబడ్డ పనుల్లో ఇంతకన్నా ప్రాముఖ్యమైన పని ఇంకొకటి లేదు. పరిచర్యే స్పూర్తి పరలోకస్పూర్తి. దాన్ని వృద్ధిపర్చి ప్రోత్సహించటానికి జరిగే ప్రతీ ప్రయత్నంలో దేవదూతలు గ్త్సహకరిస్తారు. అట్టి విద్య దైవ వాక్యంపై ఆధారితం కావాలి. MHTel 345.6

దాని సూత్రాలు ఇక్కడే సంపూర్తిగా ఇవ్వబడ్డాయి. అధ్యయానినికి బోధనకు బైబిలు పునాది కావాలి. అత్యవసర జ్ఞానం దేవుని గూర్చిన జ్ఞానం ఆయన పంపిన క్రీస్తును గూర్చిన జ్ఞానం. MHTel 346.1

ప్రతి బిడ్డ యువకుడు ప్రతీ యువతి తనను గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి. అతడు దేవుడు తనకు ఇచ్చిన భౌతిక నివాసాన్ని అది ఏ నియమాల ప్రకారం ఆరోగ్యంగా ఉంచబడుతున్నదో వాటిని అవగాహన చేసుకోవాలి. సామన్య విద్యాశాఖల్లో అందరూ మంచి జ్ఞానం సంపా దించాలి. అనుదిన విధులను నిర్వర్తించటానికి తమను ప్రయోగాత్మాక సామర్ధ్యం గల పురుషులను స్త్రీలను చేసే పారిశ్రామిక శిక్షణ వారికి ఇవ్వాలి. దీనితో పాటు వివిధ మిషనెరీ సేవా శాఖల్లో ఆచరణాత్మక అనుభవం వారికి ఉండాలి. MHTel 346.2