Go to full page →

విశాలమైన పునాది MHTel 343

శాస్త్రాలన్నిటిలోను అత్యున్నతమైనది. ఆత్మల రక్షణ శాస్త్రం. మానవులు చెయ్యగల అత్యున్నత సేవ మనుషులను పాపజీవితం నుంచి పరిశుద్ధ జీవితం జీవించటానికే రక్షించే సేవ. ఈ కార్యాన్ని సాధించటానికి ఓ విశాలమైన పునాది వెయ్యాలి. ఓ విస్తృత విద్య అవసరం.. తల్లితండ్రుల నుంచి ఉపాధ్యాయుల నుంచి శాసోపదేశాన్ని మాత్రమే కోరని వ్యిద అవసరం. మేథ సంస్కృతికన్నా ఇంకా ఏదో కొంత అవసరం. శరీరం, మనసు, హృదయం సమానంగా వృద్ధి చెందకపోతే విద్య సంపూర్తి కాదు. ప్రవర్తన సంపూర్ణ, సమున్నత, అభివృద్ధికి దానికి సరియైన క్రమశిక్షణ అవసరం. మానసిక శక్తులన్నీ వృద్ధి చెందాలి. వాటిని సరిగా తర్బీతు చెయ్యాలి. దేవునికి సమర్ధమైన పనివారిగా మనల్ని తయారు చేసే ప్రతీ శక్తినీ వృద్ధిపర్చి వినియోగించటం మన విధి. MHTel 343.3

వాస్తవిక విద్య పూర్తి వ్యక్తిని అంతర్భాగం చేస్తుంది. అది ఓ వ్యక్తికి తన ప్రయోజనాన్ని నేర్పిస్తుంది. మెదడు, ఎముక, కండరం, శరీరం మనసు, హృదయాలను ఉత్తమ రీతిగా ఉపయోగించటానికి అది మనల్ని సమర్దుల్ని చేస్తుంది. ఉన్నత శక్తులైన మానసిక శక్తులు శరీర రాజ్యాన్ని పరిపాలించాలి. స్వాభావిక రుచులు ఉద్రేకాలు మనస్సాక్షి అదుపులోను ఆధ్యాత్మిక అనురాగాల అదుపులోను ఉండాలి. క్రీస్తు మానవ జాతికి శిరస్సు. తన సేవలో మనల్ని ఉన్నతమైన పరిశద్దుమైన, పవిత్రమైన మార్గాల్లో నడిపించటం ఆయమన సంకల్పం. తన కృప ఆశ్చర్యకార్యం ద్వారా మనం ఆయనలో సంపూర్ణలమౌతాం, MHTel 343.4

క్రీస్తు తన విద్యను గృహంలోనే అభ్యసించాడు. తల్లి ఆయన మొదటి మానవ ఉపాధ్యాయురాలు. ఆమె పదాల ఉంచి ప్రవక్తల గ్రంథపు చుట్టల నుంచి ఆయన పరలోక విషయాలను నేర్చుకున్నాడు. ఆయన శ్రామికుడి గృహంలో నివసించాడు. కుటుంబ భారాల్ని పంచుకోవటంలో ఆయన తన పాత్రను నమ్మకంగాను ఆనందంగాను నిర్వహించాడు. పరలోక సేనాధిపతిగా ఉన్న ఆయన సేవకుడుగా ఉండానికి ప్రేమ విధేయతలు గల కుమారుడుగా ఉండటానికి సమ్మతంగా ఉన్నాడు. ఓ వృత్తి పని నేర్చుకొని యోసేపు వడ్రంగి కర్మశాలలో తన సొంత చేతులతో పనిచేసాడు. సామన్య శ్రామికుడి దుస్తుల్లో ఆ చిన్న పట్టణ వీదుల్లో నడుస్తూ తన సామాన్య పనికి వెళ్లటం పని నుండి తిరిగి రావటం చేసాడు. MHTel 344.1

ఆ యుగ ప్రజలతో విషయాల విలువ బయట హంగును బట్టి ఉండేది. మతం అధికారం క్షీణించిన కొద్ది ఆడంబరం పెరిగింది. ఆ కాలంలోని విద్యావేత్తులు హంగు ఆడబంరం వలన గౌరవం సంపాదంచ టానికి చూసారు. దీనంతటిని క్రీస్తు జీవితం భిన్నంగా ఉన్నది. ఎంతో అవసరమని మనుషులు పరిగణించిన విషయాల్ని అస్సలు విలువ లేనివని క్రీస్తు జీవితం చూపించింది. చిన్న విషయాలను పెద్దవి చేసి పెద్ద వాటిని చులకన చేసే ఆ కాలపు పాఠశాలల్ని ఆయన ఎంపిక చేసుకోలేదు. ఆయన విద్య దేవుడు నియమించిన వనరులనుంచి ప్రయోజనకరమైన పని నుంచి లేఖన ఆధ్యయనం ఉంచి ప్రకృతి నుంచి పని చెయ్యటానికి ఇష్టపడే హస్తం నుంచి చూసే కన్నునుంచి గ్రహించే హృదయం నుంచి దేవుని పాఠ్య పుస్తకమైన జీవితానుభవం నుంచి వచ్చింది. MHTel 344.2

“బాలుడు జానముతో నిండు (కొనుచు ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయన మీద నుండెను” లూకా 2:40 MHTel 345.1

గృహమే బిడ్డకు మొదటి పాఠశాల, ఇక్కడే సేవా జీవితానికి పునాది వెయ్యాలి. దాని సూత్రాలను కేవలం సిద్దాంత పరంగా బోధించకూడదు. జీవిత శిక్షణ అంతటినీ అది రూపుదిద్దాలి. MHTel 345.2

“అద్వితీయ సత్యదేవునైన నిన్నును, నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము”. యోహాను 17:3. MHTel 345.3

చిన్న వయస్సులోనే సహాయక హస్తాన్ని చాపే పాఠం బిడ్డకు నేర్పించాలి. బలం, ఆలోచనా శక్తి సరిగా వృద్ధి పొందని వెంటనే అతడికి గృహంలో విధులను నియమించాలి. తండ్రికి తల్లికి సహాయం చెయ్యటానికి ప్రోత్సహించాలి. తనను తాను ఉపేక్షించుకోవటం, తనను తాను అదుపు చేసుకోవటం, తన సంతోష సౌఖ్యలకన్నా ఇతరుల సంతోష సౌఖ్యాల్ని ముందుంచటం, సోదరులను సోదరీలను, కలిసి ఆడుకునే పిల్లలను సంతోష పెట్టటానికి తరుణాల కోసం కనిపెట్టటం, వృద్ధులకు, రోగులకు, దిక్కులేని వారికి దయ చూపించటానికి అతణ్ణి ప్రోత్సహించాలి. పరిచర్య స్పూర్తి ఎంత ఎక్కువ సంపూర్తిగా గృహంలో విస్తరిస్తుందో పిల్లల జీవితంలో అది ఎక్కువ సంపూర్తిగా వృద్ధి చెందుతుంది. ఇతరుల మేలు కోసం సేవలోను త్యాగంలోను ఆనందించటం వారు నేర్చుకుంటారు. MHTel 345.4