Go to full page →

సేవకు శిక్షణ MHTel 340

క్రైస్తవ తల్లితండ్రులు అధ్యాపకులు ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచు కోవాలి. మన పిల్లలు ఏసేవా విభాంగంలో సేవ చెయ్యగలరో మనకు తెలియదు. వారు తమ జీవితాలను కుటుంబ పరిధిలో గడపవచ్చు. జీవిత సామన్యవృత్తులలో పని చెయ్యవచ్చు. లేక అన్య దేశాలకు సువార్త బోధకులుగా వెళ్ళవచ్చు. అందరు దేవునికి మిషనెరీలుగా లోకానికి కృపా మిషనెనరీలుగా పిలుపు పొందుతున్నారు. MHTel 340.2

పిల్లలను యువతను తమ ప్రతిభ, శక్తి ధైర్యం, బలహీనలతో దేవుడు ప్రేమిస్తాడు. వారిని దైవిక సాధనాలకు అనుగుణంగా తీసుకురావాలని ఆయన అభిలాషిస్తున్నాడు. స్వార్ధరహిత సేవలో క్రీస్తు పక్క నిలబడటానికి తోడ్పడే విద్యను వారు ఆర్జించాలి. MHTel 340.3

తన మొదటి శిష్యులను గురించి అన్నట్లు తన చివరి దినాల బిడ్డలందరిని గురించి ఆయనన్నాడు. “నీవు నన్ను లోకమును పంపిన ప్రకారము, నేనును వారికి లోకమునకు పంపితిని” (యోహాను 17:18) దేవునికి ప్రతినిధులుగా ఉండటానికి ఆయన ఆత్మను బయలుపర్చటానికి, ఆయన ప్రవర్తనను ప్రదర్శించటానికి, ఆయన సేవ చెయ్యటానికి. MHTel 340.4

మన బిడ్డలు దారులు ఇడిపోయే చోట నిలబడినట్లు లోకంలో ఉంటారనవచ్చు. దేవుడు విమోచించిన వారికి నిర్దేశించిన మార్గం నుంచి పక్కకు మళ్ళించే స్వార్ధపూరిత, శారీరక వాంఛల తృప్తిని కోరే, లౌకిక వినోదాలు వారిని ఆహ్వానిస్తున్నాయి. తమ జీవితాలు దీవెనగా ఉంటాయో లేక శాపంగా ఉంటాయో వారు చేసుకునే ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. పొంగి పొరలే శక్తితో నిండి, అంతవరకు ఉపయుక్తం కాని తమ సామార్థ్యాలను ఉపయోగించటానికి తొందరపడుతున్న పరుగులు తీస్తున్న వీరి జీవితాలు వెలికి వచ్చే మార్గంఅవసరం. మంచి చెయ్యటానికో, చెడు చెయ్యటానికో వారు చురుకుగా స్పందిస్తారు. MHTel 340.5

దేవుని వాక్యం క్రియాశీలతను అణిచివెయ్యదు. సరియైన మార్గంలో నడిపిస్తుంది. యువత తక్కువ ఆశించాలని దేవుడు కోరటంలేదు. మనిషిని వాస్తవంగా విజేతను చేసే ప్రకృతి శక్తులు గల మనుషుల మధ్య పేరు ప్రతిష్టలు గలవాణ్ణి చేసే, ప్రవర్తన ఉన్నతమైన మేలు చెయ్యటానికి కోరిక, అజేయమైన చిత్తం, శ్రమతో కూడిన సాధన, అలుపెరగని పట్టుదల వీటిని నిరుత్సాహపర్చకూడదు. భూమికన్నా ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో స్వార్ధ ఐహిక ఆసక్తులకన్నా అంత ఉన్నతమైన లక్ష్యాలను సాధించటానికి దేవుని కృప ద్వారా యువతను నడిపించాలి. MHTel 341.1

తల్లితండ్రులు గాను క్రైస్తవులు గాను మన పిల్లలకు సరియైన దిశా నిర్దేవం చెయ్యటం మన బాధ్యత. క్రీస్తు చేసిన పరిచర్య వంటి సేవ చెయ్యటానికి వారిని జాగ్రత్తగా విజ్ఞతతో, సున్నితంగా నడిపంచాలి. మన పిల్లల్ని ఆయన సేవకు పెంచటానికి దేవునితో మనకు పవిత్ర నిబంధన ఉంది. సేవా జీవితాన్ని ఎంపిక చేసుకోవటానికి వారిని నడిపించి ప్రభావాలను వారి చుట్టు ఉంచటం, దానికి అసవరమైన శిక్షణను ఇష్టం మన ప్రథమ కర్తవ్యం MHTel 341.2

“దేవుడు ... ఎంతో ప్రేమించెను.. ఆయన .. అనుగ్రహంచెను”. మనం నశించిపోకుండా నిత్య జీవం పొందేటట్లు “తన అద్వితీయ కుమారుని... అనుగ్రహించెను. “క్రీస్తు మిమ్మును ప్రేమించి... మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను”. మనలను ప్రేమిస్తే ప్రేమిస్తాం అన్నది కాదు. “పరిచారము చేయించుకొనుటకు రాలేదు... పరిచారుము చేయుటకు ” అన్న గొప్ప పాఠాన్ని మనం నేర్చుకొని బోధించాలి. యోహాను 3:16 ఎఫెసీ 5:2 మత్తయి 20:28 MHTel 341.3

తాము తమ సొత్తు కారని యువత మనసులో నాటింపజెయ్యాలి. వారు క్రీస్తుకు చెందినవారు. వారిని ఆయన తన రక్తంతో కొన్నాడు. తన ప్రేమను బట్టి తన వారిని చేసుకున్నాడు. తన శక్తి వలన వారిని కాపాడతున్నాడు గనుక వారు జీవించి ఉన్నారు. తన కోసం ఉ పయోగించటానికి, వృద్ధిపర్చటానికి తర్ఫీదు చెయ్యటానికి వారి సమయం, వారి శక్తి, వారి సామర్ధ్యాలు అయినవి. MHTel 342.1

దైవ సృష్టిలో దేవ దూతల తర్వాత దేవుని స్వరూపంలో సృజించబడ్డ మానవ కుటుంబీకులే ఉత్తములు. తమకు దేవుడు సాధ్యపర్చిన అంతటికి అనుగుణంగా వారు తయారవ్వాలని తమకు ఆయన ఇచ్చిన శక్తులతో వారు చెయ్యగలిగినదంతా చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. MHTel 342.2

జీవం మర్మపూరితం, పవిత్రం. అది జీవానికి మూలమైన దేవుని ప్రత్యక్షత. దాని అవకాశాలు ప్రశస్తమైనవి. వాటిని శ్రద్ధగా వృద్ధిపర్చుకోవలి. ఒక్కసారి పొగొట్టుకుంటే అవి మరెన్నడూ రావు,. MHTel 342.3

దాని గంభీర వాస్తవాలతో నిత్యత్వాన్ని దేవుడు మన ముందు ఉంచి, నిత్యమైన, అమరమైన అంశాల పై మనకు కొంత అవగాహనను ఇస్తున్నాడు. మన సమర్ధతలన్నిటిని శ్రద్ధగా వినియోగించి సాధించదగిన లక్ష్యాన్ని అనుసరిస్తూ మనం సురక్షితమైన నిశ్చితమైన మార్గంలో సాగేందుకు విలువైన, ఉన్నతమైన సత్యాన్ని మనకు సమర్పిస్తున్నాడు. MHTel 342.4

దేవుడు తానే చేసిన విత్తనంలోకి చూసి దానిలోపల ఉన్న అందమైన పుష్పాన్ని, పూపొదను లేక ఎత్తయిన, పెద్దకొమ్మలతో విస్తరించిన చెట్టును చూస్తాడు. అలాగే ప్రతీ మానవుడిలోని అవకాశాల్ని ఆయన చూస్తాడు. మనం ఓ సంకల్ప సిద్ధికి ఇక్కడ ఉన్నాం. మన జీవితాలకు దేవుడు ఓ ప్రణాళికను ఇచ్చాడు. మనం అత్యున్నత వృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. “మీరు లోక మర్యాదను ఆనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము చెందుడి”. రోమా 12:2 MHTel 342.5

పరిశుద్ధతలోను, సంతోషంలోను ప్రయోజకత్వంలోను మనం నిత్యం పెరాగాలని ఆయన కోరుతున్నాడు. అందరికి సమర్ధతలున్నాయి. వాటిని పవిత్రమైన వరాలుగాను దేవుడిచ్చిన వరాలుగాను పరిగణించి సరిగా వినియోగించాలి. యువత తమ ప్రతీ శక్తిని వృద్ధిపర్చుకోవాలని, ప్రతీ మానసిక శక్తినీ వినియోగించాలని ఆయన కోరుతున్నాడు. భావి జీవితానికి పరలోకంలో భాగ్యాన్ని కూర్చుకుంటూ మంచి జీవితం జీవించటానికి మంచి చెయ్యటానికి ఈ జీవితంలో ఉపయోగకరమైనదాన్ని విలువైనదాన్ని మనం ఆనందించాలని ఆయన కోరుతున్నాడు. MHTel 343.1

స్వార్ధరహితమైన, ఉన్నతమైన, ఉదాత్తమైన అన్ని విషయాల్లో వృద్ధి చెందాలన్నది వారి జీవితాశయం కావాలి. తాము తమ జీవితాలను తీర్చి దిద్దుకోవటానికి ఆదర్శంగా క్రీస్తును తీసుకోవాలి. తన జీవితంలో ఆయన ఆవలంభించిన పరిశుద్ధ ఆశయం తమ ఆశయం అనగా తాము ఈ లోకంలో జీవించటం ద్వారా దాన్ని మెరుగుపర్చటమన్న ఆశయం కావాలి. వారు ఈ పని చెయ్యటానికే పిలుపుపొందారు. MHTel 343.2