Go to full page →

41—ఇతరులతో సంబంధంలో MHTel 426

జీవితంలోని ప్రతీ సంఘము ఆత్మ నిగ్రహం, సంయమనం, సానుభూతి ఆచరణకు కోరుతుంది. మనస్తత్వం, ఆలవాట్లు, విద్య విషయంలో మన మధ్య చాలా బేధాలుండటంతో విషయాల్ని అవగాహన చేసుకోవటం ఒకే రీతిగా ఉండదు. మన తీర్పులు వేరుగా ఉంటాయి. సత్యాన్ని అవగాహన చేసుకోవటం, జీవితం నడవడి సందర్భముగా మన అభిప్రాయాలు అన్ని విషయల్లోను ఒకేలా ఉండవు. ఇద్దరి అనుభవం అన్ని వివరాల్లోను ఒకేలా ఉండదు ఒకరి శ్రమలు మరొకరికి శ్రమలు కావు. ఒకరికి తేలికగా ఉన్న విధులు వేరొకరికి అతి కష్టంగా, గాభరాగా ఉండవచ్చు. MHTel 426.1

మానవ స్వభావం బలహీనమైనది, ఆజ్ఞానమైంది, అపార్ధం చేసుకోవటానికి వీలున్నది కాబట్టి ప్రతీ వ్యక్తి ఇతరుల గురించి తన అంచనాలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల అనుభవం పై మన పనుల ప్రభావం గురించి మనకు తెలియదు. మనం చేసే పని పలికే మాట ప్రాముఖ్యమైనదిగా మనకు తోచకపోవచ్చు. కాని మన కళ్ళు తెరవబడితే, మంచికి గాని చెడుకు గాని అతి ప్రధానమైన ఫలితాలు వాటి మీద ఆధారపడినట్లు మనం చూస్తాం. MHTel 426.2