Go to full page →

బరువులు మోసేవారి పట్ల పరిగణన MHTel 426

చాలమంది అతి తక్కువ భారాలు వహిస్తారు. వారి హృదయాలకు నిజమైన వేదన తెలియదు. ఇతరుల నిమిత్తం వారి ఆందోళన ఆవేదన బహు తక్కువ. కనుక నిజాయితీగా భారాలు వహించే వ్యక్తి పనిని వారు అవగాహన చేసుకోలేరు. బిడ్డ తన తండ్రి శ్రద్ధను శ్రమను ఎంత అభినందిస్తాడో అంతకన్నా ఎక్కువ అతడిభారాల్ని వారు అభినందించలేరు. తండ్రి భయాలు ఆందోళనలు బిడ్డకు వింతగా ఉండవచ్చు. అతడికి అవి అనవసర విషయాలుగా కనిపించవచ్చు. కాని ఆ బిడ్డకు సంవత్సరాల అనుభవం వచ్చినపుడు జీవిత భారాల్ని తాను వహించాల్సి వచ్చినపుడు వెనక్కు తిరిగి తన తండ్రి జీవితాన్ని చూసి ఒకప్పుడు తనకు అగమ్యంగా ఉన్నదాన్ని అవగాహన చేసుకుంటాడు. చేదు అనుభవం అతడికి ఆజ్ఞనాన్నిచ్చింది. MHTel 426.3

బరువు బాధ్యతలు మోషే వారి పనిని అర్ధం చేసుకోవటం జరగటం లేదు. మరణం వారిని మరుగు చేసేవరకూ వారి శ్రమను అభినందించరు. వారు విడిచి పెట్టిన బాధ్యతల్ని ఇతరులు చేపట్టి సమస్యల్ని ఎదుర్కునప్పుడు వారి విశ్వాసం, ధైర్యం ఎలా పరీక్షించబడ్డాయో అప్పుడు అవగాహన చేసుకుంటారు. అప్పుడు ఖండించటానికి తాము వేగిరిపడ్డ పొరపాట్లు మరిచిపోతారు. అనుభవం వారికి సానుభూతి నేర్పుతుంది. మనుఘల్ని బాధ్యతాయుత స్థానాల్లో ఉంచటానికి దేవుడు అనుమతిస్తాడు. వారు తప్పులు చేసినప్పుడు వారిని సరిదిద్దటానికి లేదా తొలగించటానికి ఆయనకు శక్తి ఉంది. దేవునికి చెందిన తీర్పును చేతుల్లోకి తీసుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి “కీడు వలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము”. రోమా 12:21 MHTel 427.1

సౌలు పట్ల దావీదు ప్రవర్తన మనకో పాఠం నేర్పుతుంది. దేవుని ఆజ్ఞ ప్రకారం సౌలు ఇశ్రాయేలు రాజుగా ప్రకటించట్టాడు. అతడి అవిధేయత కారణంగా రాజ్యం అతడి నుండి తీసివేసినట్లు దేవుడు ప్రకటించాడు. అయినా సౌలు పట్ల దావీడు ప్రవర్తన ఎంత మర్యాదగా ఎంత సహనంతో కూడి ఉంది.! దావీదుని చంపటానికి తన ప్రయత్నాల్లో సౌలు అరణ్యంలోకి వచ్చి అంగరక్షకులు లేకుండా దావీదు అతడి సైనికులతో దాగి ఉన్న గుహలోకి ప్రవేశించాడు. “దావీదు జనులు -- ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది అతనికి నీవు చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతు నని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో చెప్పగా... యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయును. యెహోవా నామమును బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను”. మనకు రక్షకుని ఆదేశం ఇది: “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడరు మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును”. త్వరలో మీ జీవిత రికార్డు విమర్శకు దేవుని ముందుకు వస్తుందని జ్ఞాపకముంచుకోండి. ఆయన ఇలా అన్నాడని కూడా గుర్తుంచుకోండి “తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవైయున్నావు....తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయున చున్నావు కావా?”.1 సమూయేలు 24:4-6 మత్తయి 7:12; రోమా 2:1 MHTel 427.2