Go to full page →

3. వైద్య మిషనెరీలు వారి సేవ MHTel 106

9—వైద్య మిషనెరీలు వారి సేవ MHTel 106

బోధించటం, స్వసవర్చటం MHTel 106

పన్నెండు మంది శిష్యుల్ని తమ మొదటి మిషనెరీ ప్రయాణం పై పంపినప్పుడు క్రీస్తు వారినిలా ఆదేశించాడు. “వెళ్ళుచు...... పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి. చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠురోగులను శుద్దులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.” మత్తయి 10:7,8 MHTel 106.1

అనంతరం తాను పంపిన డెబ్బయి మందితో ఆయనన్నాడు. “మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించునప్పుడు... రోగులను స్వస్థపరచుడి.. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి.” లూకా 10:8,9 క్రీస్తు సన్నిధి శక్తి వారితో ఉన్నవి. ‘ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి. ప్రభువా దయ్యములు కూడ నీ నామము వలన మాకు లోబడుచున్నవి” అన్నారు 17వ వచనం. MHTel 106.2

క్రీస్తు ఆరోహణమైన తర్వాత అదే పని కొనసాగింది. ఆయన సొంత పరిచర్య దృశ్యాలు పునరావృతమయ్యాయి. “యెరూషలేము చుట్టునుండు పట్టణముల జననులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరును స్వస్థత పొందిరి”. అ.55:16 MHTel 106.3

శిష్యులు “బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై” ఉన్నాడు. “ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు... ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు.. వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆపట్టణములో మిగుల సంతోషము కలిగెను. మార్కు 16:20,-8. MHTel 106.4