Go to full page →

విశ్వాస గృహం MHTel 166

“మనము సమయము దొరికిన కొలది అందరి యెడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి యెడల మేలు చేయుదము”. గలతీ 6:10 MHTel 166.2

తన సొంత సభ్యుల్లో లేమిననుభవిస్తున్న వారిని గూర్చి శ్రద్ధ తీసుకునే విధిని క్రీస్తు తన సంఘము పై పెట్టాడు. ప్రతీ సంఘంములోను పేదల్ని ఉంచటం ఆయన చిత్తం. వారు ఎల్లప్పుడు మన మధ్య ఉంటారు. వారిని గూర్చిన జాగ్రత్త సంఘ సభ్యుల వ్యక్తిగత బాధ్యత. MHTel 166.3

ఓ కుటుంబములోని సభ్యులు జబ్బుగా ఉన్నవారికి పరిచర్య చెయ్య టం. బలహీనలకు మద్దతు ఇవ్వటం, అజ్ఞానులకు బోధించటం, అనుభవం లేనవారికి శిక్షణ నివ్వటం చేస్తూ ఒకరికొకరు ఎలా తోడుగా ఉంటారో అలాగే “విశ్వాస గృహము” లేమిలో ఉన్నవారికి, నిస్సహాయులకు సహాయం చెయ్యలి. ఏ పరిస్థితి లోనూ వారిని విడిచి పెట్టకూడదు. MHTel 166.4

విధవరాండ్రు, అనాధలు దేవుని ప్రత్యేక శ్రద్ధ పొందేవారు “తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు’. MHTel 166.5

నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయైయున్నాడ సైన్యములకధిపతి యగు యెహోవా అని ఆయనకు పేరు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు “. MHTel 166.6

“ఆనాధలగు నీ పిల్లలన విడుపుము, నేను వారిని సంరక్షించెదను నీ విధవరాండ్రు నన్న ఆశ్రయింపవలెను. కీర్త 68:5 యెషయా 54:5 యిర్మీయా 49:11 MHTel 167.1

తన ప్రియులను విడిచి పెట్టాల్సిందిగా పిలుపు వచ్చినపుడు అనేక మంది తండ్రులు వారిని సంరక్షిస్తానన్న దేవుని వాగ్దానం పై విశ్వాసముంచి మరణించినారు. ప్రభువు ఓ అద్భుతం చేసి పరలోకం నుంచి మన్నాను. కాకోలాలతో ఆహారాన్ని పంపటం ద్వారా విధవరాండ్రను తండ్రి లేని వారిని సంరక్షించడు. మానవ హృదయం నుంచి స్వార్ధాన్ని తీసివేసి, క్రీస్తు ప్రేమవంటి ప్రేమా ప్రవాహాన్ని ప్రవహింపజెయ్యటమన్న అద్భుతం చేసి సంరక్షిస్తాడు. దు:ఖంలో ఉన్నవారిని, ప్రియులను పొగొట్టుకున్న వారిని ఓ ప్రశస్తమైన ధర్మనిధిగా తన అనుచరులకు అప్పగిస్తాడు. మన సానుభూతి పై వారికి బలమైన హక్కు ఉన్నది. MHTel 167.2

జీవిత సౌకర్యాలు, సుఖాలు ఉన్న గృహాల్లో, విస్తారమైన పంటతో నిండిన ధాన్యపు గాదులు కోట్లలో బంగారం వెండి భద్రంగా దాచే ఖజానాల్లో భద్రపర్చే గదుల్లో లేమిలో ఉన్నవారి పోషణ నిమిత్తం దేవుడు వనరులను ఏర్పాటు చేసాడు. తాను సమృద్ధిగా ఇచ్చిన వనరులకు మనం సరఫరా మార్గాలు కావాలని దేవుడు వాంఛిస్తున్నాడు. MHTel 167.3

“గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు. వారి గాయములు కట్టువాడు”. కీర్త 147:3 MHTel 167.4

తండ్రి లేని పిల్లలు గల విధవరాలైన తల్లి తన చిన్నారుల్ని తనతో ఉంచుకోవాటనికి, వారి అవసరాల్ని తీర్చటానికి తరుచు తన శక్తికి మంచి పనిచేస్తూ రెండు రెట్ల భారం మోస్తుంటుంది. వారి శిక్షణకు ఉపదేశానిక ఆమెకు ఎక్కువ సమయం ఉండదు. వారి జీవితాల్ని వికాసవంతం చేసే ప్రభావాల్ని వారి చుట్టూ ఉంచటానికి ఆమెకు అవకాశం ఉండదు. ఆమెకు ప్రోత్సాహం, సానుభూతి, నిశ్చితమైన సహాయం అవసరం. MHTel 167.5

తండ్రి ఆలన పాలన లేని ఈ పిల్లకు దాన్ని మనం మనకు సాధ్యమైనంత మేరకు సరఫరా చెయ్యాల్సిందిగా దేవుడు పిలుపునిస్తున్నాడు. వారికి దూరంగా నిలబడి వారి తప్పిదాల గురించి, వారు చేస్తున్న అల్లరి గురించి ఫిర్యాదులు చేసే బదులు, సాధ్యపడిన మార్గాలన్నిటిలో వారికి సహాయం చెయ్యండి. చింతలతో చితికి పోతున్న తల్లికి సహాయం చెయ్యటానికి ప్రయత్నించండి. ఆమె భారాన్ని తేలిక చెయ్యండి. MHTel 167.6

ఇంకా, తల్లితండ్రుల నడుపుదల, లోపర్చుకునే క్రైస్తవ గృహ ప్రభావం లేని పిల్లలే వేలాది మంది ఉన్నారు. క్రైస్తవులు ఈ నిస్సహాయ పిల్లలకు తమ హృదయాలు, గృహాలు తెరవాలి. వ్యక్తిగత విధిగా దేవుడు తమకు అప్పగించిన పనిని వారు ఓ ఉపాకార సంస్థకు బదలాయించటమో లేక లోకం దాతృత్వానికి విడిచి పెట్టటమో చెయ్యకూడదు. తమను చూసుకోవ టానికి పిల్లలకు బంధువులెవరూ లేకపోతే, ఈ దిక్కులేని వారికి సంఘ సభ్యులు గృహ వసతి కూర్చాలి. మనల్ని సృజించిన దేవుడు మనం కుటుంబాల సహవాసంలో పెరగాలని సంకల్పించాడు. బిడ్డ స్వభావం ప్రేమానురాగాలు గల క్రైస్తవ గృహంలో ఉత్తమంగా వృద్ధి చెందుతుంది. MHTel 168.1

సొంత పిల్లలు లేని అనేకులు ఇతరుల పిల్లల్ని పెంచటంలో మంచి సేవ చెయ్యగలరు. మూగ జంతువుల పట్ల అమిత ఆసక్తి కలిగి పెంపుడు జంతువల పై శ్రద్ధ పెట్టే బదులు, తాము ఎవరి ప్రవర్తనల్ని దేవుని ప్రవర్తన మాదిరిగా రూపుదిద్దుగలరో ఆ చిన్నబిడ్డల్లో వారు ఆసక్తి చూపించాలి. మానవ కుటుంబలోని నిర్వాసితులైన సభ్యులపై మీ ప్రేమను ఉంచండి. ప్రభువు పోషణలోను ఉపదేశంలోను మీరు ఈ పిల్లల్లో ఎంత మందిని పైకి తీసుకురాగలరో చూడండి.. ఇలా అనేక మంది తామే గొప్ప ఉ పకారం పొందుతారు. MHTel 168.2