క్రైస్తవాన్ని స్వీకరించటం ద్వారా సభ్యుడయ్యే ప్రతీ వ్యక్తికీ ఓ విధిని నియమించాలి. క్రైస్తవ పోరాటంలో ఏ పాత్ర పోషించటానికైనా లేక ఏమి చెయ్యటానికైనా సిద్ధంగా ఉండాలి. టెస్టిమొనీస్, సం.7, పు. 30. ChSTel 83.3
దేవుడు కోరేవి అనేక సంస్థలు కావు, పెద్ద భవనాలు కావు లేక గొప్ప ప్రదర్శన కాదు. కాని దేవుడు ఎన్నుకున్న, ప్రశస్తమైన, తన స్వకీయజనం కలిసికట్టుగా తీసుకునే చర్య. ప్రతీ వ్యక్తి తన స్థలంలో తన స్థానంలో నిలిచి, దేవుని ఆత్మకు అనుగుణంగా తలంచటం, మాట్లాడటం, ప్రవర్తించటం చెయ్యాలి. అప్పుడు పని పూర్తి అవుతుంది. అప్పుడు అది సౌష్ఠవాన్ని సంపూర్ణతను సంతరించుకుంటుంది. టెస్టిమొనీస్, సం.6, పు. 293. ఓ సైన్యం శక్తి సైనికుల సమర్థతనుబట్టి నిర్ణయించటం జరుగుతుంది. చురకుగా సేవ చేసేందుకు సైనికుల్ని తర్బీతు చెయ్యవలసిందని వివేకి అయిన జెనరల్ తన ఆఫీసర్లని ఉపదేశిస్తాడు. అందరిలోను నిపుణత వృద్ధిపర్చటానికి ప్రయత్నిస్తాడు. అతడు కేవలం తన ఆఫీసర్ల మీదే ఆధారపడితే జయప్రదమైన దండయాత్ర నిర్వహించలేడు. బాధ్యత చాలా మట్టుకు సామాన్య సైనికుల పై ఉంటుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 116. ChSTel 83.4
రక్షకుడు సువార్త సేవకుల్ని పిలుస్తున్నాడు. ఎవరు స్పందిస్తారు? సైన్యంలో ప్రవేశించే వారందరూ జెనరళ్ళు, కెప్టెన్లు, సార్జెంట్లు లేక కార్పొరళ్లు అవ్వలేరు. అందరికీ నాయకులకున్న బాధ్యతలుండవు. ఇతర రకాల కఠిన సేవకూడా చేయాల్సి ఉంటుంది. కొందరు కందకాలు తవ్వాలి, రక్షణ నిర్మాణాలు నిర్మించాలి. కొందరు కావలివారుగా సేవచెయ్యాలి. కొందరు వర్తమానాలు తీసుకువెళ్లాలి. ఆఫీసర్లు బహు కొద్దిమందే ఉంటే ఓ సైన్యం ఏర్పడటానికి చాలా మంది సామాన్య సైనికులు అవసరం. అయినా దాని జయం ప్రతీ సైనికుడి విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కడి పిరికితనం లేదా విశ్వాస ఘాతుకం సైన్యమంతటికీ ప్రమాదం కలిగిస్తుంది. గాస్పుల్ వర్కర్స్, పులు 84,85. ChSTel 84.1