Go to full page →

ఆదర్శ సంఘ వ్యవస్థీకరణ ChSTel 83

సువార్త సత్య ప్రబోధకులు క్రీస్తుకి విశ్వాసుల్ని సంపాదించాల్సిన ప్రతీ స్థలంలో సంఘాల్ని వ్యవస్థీకరించటంలో యెరూషలేము సంఘ వ్యవస్థీకరణ ఆదర్శం కావలసింది.... అనంతరం తొలినాళ్ల సుంఘ చరిత్రలో, లోకంలో అనేక భాగాల్లో అనేక విశ్వాసుల గుంపులు సంఘాలుగా ఏర్పడ్డప్పుడు, క్రమం, సామరస్యంతో కూడిన కార్యాచరణ కొనసాగేందుకు సంఘ వ్యవస్థీకరణ మరింత సంపూర్ణంగా తీర్చిదిద్దబడింది. ప్రతీ సభ్యుడు తన పాత్రను చక్కగా నిర్వహించాల్సిందిగా హెచ్చరించబడ్డాడు. ప్రతీ వ్యక్తి తనకు దేవుడిచ్చిన వరాల్ని వివేకవంతంగా వినియోగించాల్సి ఉంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పులు 91.92. ChSTel 83.2