Go to full page →

వేడి యీస్ట్ బ్రెడ్ CDTel 328

బ్రెడ్ తేలికగా తియ్యగా ఉండాలి. పుల్లదనం ఏమాత్రం ఉండకూడదు. ముక్కలు చిన్నగా ఉండి సాధ్యమైనంత మట్టుకు యీస్టు క్రిములు నాశనమయ్యేందుకు బాగా బేక్ అవ్వాలి. వేడిగా ఉన్నప్పుడు లేక కొత్తగా ఉన్నప్పుడు పొంగిన బ్రెడ్ ఏదైనా జీర్ణమవ్వటం కష్టమౌతుంది. అది భోజన బల్లమిద కనబడ కూడదు. ఈ నిబంధన పులియని బ్రెడ్ కి వర్తించదు. యీస్ట్ గాని పులిపిండిగాని లేకుండా గోధుమ పిండితో చేసిన రోలు) ఎక్కువ వేడిగల అవలో బేక్ చేస్తే అవి ఆరోగ్యదాయకంగాను, రుచిగాను ఉంటాయి. CDTel 328.1