Go to full page →

భాగం III - పాలు, వెన్న CDTel 367

బలవర్ధకమైన రుచికరమైన ఆహారంలో భాగం CDTel 367

[C.T.B.H.47] (1890) C.H.114,115 CDTel 367.7

601. వర్షం కాని ఆకలిని తృప్తి పర్చటానికి మానవుడికి దేవుడు సమృద్ధిగా వనరుల్ని సమకూర్చుతున్నాడు. భూమి ఉత్పత్తుల్ని అతడి ముందు విస్తరింపజేస్తున్నాడు. జిహ్వకి రుచిని, శరీర వ్యవస్థకి పౌష్టికతని అందించే వివిధ ఆహార పదార్థాల్ని సమృద్ధిగా సమకూర్చుతున్నాడు. వీటిని మనం స్వేచ్చగా తినవచ్చునని దయానిధి అయిన మన పరలోకపు తండ్రి చెబుతున్నాడు. మసాలాలు అన్ని రకాల కొవ్వునూనెలు ఏవీ వాడకుండా పండ్లు, గింజలు, కూరగాయల్ని పాలు లేదా వెన్నతో సామాన్యంగా తయారుచేస్తే అది మిక్కిలి ఆరోగ్యదాయకమైన ఆహారం. అవి శరీరానికి పౌష్టికతని, మనసుకి సహనశక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్రేకపర్చే ఏ ఆహారం వీటిని ఇవ్వలేదు. CDTel 367.8

(1909) 9T 162 CDTel 367.9

602. రుచిగాను బలవర్ధకంగాను ఉండేటట్లు ఆహారాన్ని తయారు చెయ్యాలి. శరీర వ్యవస్థకి అవసరమైన పోషకపదార్ధాల్ని అది దోచుకోకూడదు. నేను కొంచెం ఉప్పు ఎప్పుడూ ఉపయోగిస్తాను, ఎందుకంటే హాని చేసే బదులు అది రక్తానికి అత్యవసరం. కూరగాయల్ని కొంచెం పాలతోనో వెన్నతోనో అలాంటిది మరేదైనా దానితోనో తీసుకోవాలి.... CDTel 367.10

పాలు, గుడ్లు, బటర్ తీసుకోటం మానేసి వ్యవస్థకి సరియైన పోషణను అందించని కొందరు దాని ఫలితంగా బలహీనులై పని చెయ్యలేక పోతున్నారు. ఆరోగ్య సంస్కరణకి అపఖ్యాతి ఆపాదిస్తున్నారు...... CDTel 368.1

ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాల్లో కొన్నింటిని విసర్జించాల్సిన సమయం వస్తుంది. అయితే మనం అకాల తీవ్ర ఆంక్షల్ని విధించుకుని మన మీద మనం ఆందోళన చింత వేసుకోనవసరం లేదు. పరిస్థితులు దాన్ని సూచించే వరకు వేచి ఉండండి, దానికి దేవుడే మార్గం సిద్ధం చేస్తాడు. CDTel 368.2