(1905) M.H.332,333 CDTel 455.3
756. అస్వాభావిక ప్రేరేపకాల పట్ల పారంపర్యంగా ఆకలిగలవారి ముందు గాని అందుబాటులో గాని ద్రాక్షరసం, బీరు లేదా ఏపిల్ రసం ఉంచకూడదు. ఇది వారి ముందు నిత్యం శోధనగా నిలుస్తుంది. హానికరం కాని తియ్యని ఏపిల్ రసాన్ని అనేకులు విచ్చలవిడిగా కొంటారు. అయితే అది కొంత సేపు మాత్రమే తియ్యగా ఉంటుంది. ఆ తరువాత అది పులు పెక్కటం ప్రారంభమవుతుంది. అప్పుడు దానికి వచ్చే తీక్లమైన రుచి అనేక జిహ్వలకు ఎంతో నచ్చుతుంది. అది హానికరమైనదని లేదా పులిసిందని అంగీకరించటానికి వినియోగదారుడు ఇష్టపడడు. CDTel 455.4
సాధారణంగా తయారుచేసే తియ్యని ఏపిల్ రసం సహితం ఆరోగ్యానికి హానికరం. ప్రజలు తాము కొనే ఏపిల్ రసాన్ని సూక్ష్మదర్శిని సహాయంతో చూడగలిగితే దాన్ని తాగటానికి ఎంతో మంది ఇష్టపడరు. బజారులో అమ్మటానికి ఏపిల్ రసం తయారు చేసేవారు తాము ఉపయోగించే ఏపిల్ పండ్ల పరిస్థితి విషయంలో ఏమంత శ్రద్ధ వహించరు. కుళ్లిపురుగులు పట్టిన ఏపిల్ పండ్ల రసం వాడటం జరుగుతుంటుంది. విషభరితమైన, చెడిపోయిన ఏపిల్ పండ్లని వేరేరకంగా వినియోగించనివారు వాటి నుంచి తీసిన రసం తాగి అది ఓ విలాస పానీయమనుకుంటారు. అయితే గానుగ నుంచి తాజాగా వచ్చినప్పుడు సయితం ఈ చక్కని పానీయం వినియోగానికి పూర్తిగా అనర్హం. CDTel 456.1
ఘాటైన మద్యంలాగే ద్రాక్షరసం, బీరు, ఏపిల్ రసం మత్తుకలిగించటం వాస్తవం. ఈ పానీయాలు మరింత ఘాటైన పానీయం కోసం తృష్ణను సృష్టిస్తాయి. ఇలా సారా అలవాటు స్థిరపడుతుంది. మిత మద్యపానం మనుషులికి తాగుబోతులికి విద్యనేర్పే పాఠశాల. ఈ బలహీన ప్రేరేపకాలు చేసే హాని పైకి బాహాటంగా కనిపించదు. కానీ బాధితుడు ప్రమాదాన్ని గుర్తించకముందే అతడు తాగుబోతుతనానికి రాచబాటలో అడుగు పెడతాడు. CDTel 456.2