Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    7వ అధ్యాయం - పరీక్షించబడ్డ శిష్యత్వం

    “కాగా ఎవడెన్లను క్రీస్తున్నందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను”SCTel 45.1

    ఒకడు వూరుకునస్సు పొందిన సమయం స్థలం ఖండితముగా చెప్పలేకపోవచ్చు. తత్సంబంధమైన పరిస్థితుల పరంపరను వివరించలేకపోవచ్చు. అలాగని అతడు అసలు మారు మనసు పొందలేకపోవడానికి ఇది రుజువుకూడ కాదు. నికోదేముతో క్రీస్తు ఇలా అన్నాడు; “గాలి తన కిష్టమైన్ల చోటను విసరును, నీవు దాని శబ్దమువిందువేగాని, అది ఎక్కడినుండి వచ్చునో, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగేయున్నాడు” (యోహాను 3:8) గాలి కంటికి కనిపించదు, అయినా దాని ఫలితాన్నీ స్పష్టంగా చూస్తాం, అనుభవిస్తాం. మానవ హృదయంలో పరిశుద్ధాత్మ పనికూడ అలాంటిదే. మానవ నేత్రానికి కనిపించని పునర్జనన శక్తి ఆత్మలో నూతన జీవానికి జన్మనిస్తుంది. దేవుని స్వరూపములో ఒక నూతన వ్యక్తిని సృజిస్తుంది. ఆత్మచేసేపని నిశబ్ధంగా పైకి కనిపించకుండా సాగిన తన క్రియలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పరిశుద్ధాత్మ పని వలన మనసు నూతనమైతే, జీవితమూ ఆ వాస్తవాన్ని చాటుతుంది. మన హృదయాల్ని మార్చుకోవడంలో గాని దేవునితో సామరస్యం సాధించడంలోను గానీ మనమేమీ చేయలేకపోయినా, మనల్ని మనం గాని, మన మంచి పనుల్ని గాని మనం నమ్ముకోకుండా నివశించాల్సిన, మన అంతరంగంలో దైవ కృప ఉన్నదో లేదో మన జీవితాలేబయలుపర్చుతాయి. ప్రవర్తనలో, అలవాట్లలో, వ్యాపకాల్లో మార్పు కనిపిస్తుంది.SCTel 45.2

    అప్పుడప్పుడూ చేసే మంచి పనుల వల్ల గాని చెడ్డపనుల వల్లగాని కాక అలవాటు ప్రకారం పలికే మాటలు చేసే క్రియల్ని బట్టి ప్రవర్తన వ్యక్తమౌతుంది.SCTel 46.1

    క్రీస్తు పునరుజ్జీవన శక్తి లేకుండా ప్రవర్తనలో బాహ్య నిర్దుష్టత ఉండవచ్చునన్నది నిజమే. పలుకుబడి కోసం, ప్రజాదరణకోసం కలిగే ఆకాంక్ష క్రమబద్ద జీవితాన్ని ఉత్పత్తి చేయవచ్చు. ఆత్మ గౌరవం మన దుష్టత్వాన్ని మరుగుపర్చవచ్చు. స్వార్ధ హృదయం ధర్మ కార్యాలెన్నో చేయవచ్చు. అయితే మనం ఎవరి పక్క ఉన్నామో నిర్ధారించడమెలా?SCTel 46.2

    మన హృదయాన్ని ఆకట్టుకుంటున్నదెవరు? మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? ఎవరి గురించి మాట్లాడడంమన కిష్టం? మన ప్రేమానురాగాలు, జవ సత్యాలు, ఎవరికోసం దాచి ఉంచుతున్నాం? మనం క్రీస్తువారమైతే మనం ఆయన్ని గురించి ఆలోచిస్తాము. ఆయన గురించి మధుర భావాలు వెల్లువెత్తుతాయి. మనతోపాటు మన సర్వస్వం ఆయనకు అంకితం చేస్తాం. అన్నీ విషయాల్లోను ఆయన రూపం కలిగి ఉండడానికి, ఆయన స్వభావాన్ని అనుకరించడానికి, ఆయన చిత్తాన్నీ జరిగించడానికి ఆయనను సంతోషపర్చడానికి ఆతృతగా ఉంటాం.SCTel 46.3

    క్రీస్తులో నూతన సృష్టి పొందినవారు “ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దూళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” అనే ఆత్మ ఫలాలు ఫలిస్తారు. “(గలతీ 5:22) వారు తమ పూర్వపు శరీరేచ్చల్ని అనుసరించి జీవించరు. కాని వారు దైవ కుమారునియందు విశ్వాసముంచి ఆయన అడుగు జాడల్ని వెంబడిస్తూ ఆయన ప్రవర్తనను ప్రతిబింబిస్తూ ఆయన పరిశుద్ధుడె ఉన్న రీతిగా తాము కూడ పరిశుద్ధంగా నివశిస్తారు. ఒకప్పుడు, తాము ద్వేషించిన వాటిని వారిప్పుడు ప్రేమిస్తారు. తాము ఒకప్పుడు ప్రేమించినవాటిని ఇప్పుడు ద్వేషిస్తారు. అహంకారులు, పొగరుబోతులు, దీనమనసులు, సాత్వికులు అవుతారు. డాంభికులు, గర్విష్టులు, కార్యశీలురు, వినయవంతులు అవుతారు. తాగుబోతులు అప్రమత్తులౌతారు. దుశ్శీలురు పవిత్రులవుతారు. వ్యర్ధలోకాచారులకు తెరదిగుతుంది. క్రైస్తవులు “వేలుపటి అలంకారము” గాక సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమును అక్షయాలం కారముగల... అంతరంగ స్వభావమును.. “(1 పేతురు 3:3,4) వెదుకుతారు.SCTel 46.4

    దిద్దుబాటు కలుగజేసి పాశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపానికి నిదర్శనం. పాపి తాను చేసిన వాగ్దానాన్ని పునరుద్ధరించినట్లైతే, తాను దొంగిలించినది తిరిగిస్తే, తన పాపాలు ఒప్పుకుంటే మరణంలో నుంచి జీవంలోకి దాటి వెళ్తానన్న నిశ్ఛయతను కలిగి ఉండవచ్చు.SCTel 46.5

    తప్పులు చేసే పాపాత్ములమైన మనం యేసు వద్దకు వచ్చి ఆయన క్షమాపణ కృపలో పాలీ భాగస్తులమెత్తే హృదయంనుంచి ప్రేమ ప్రవహిస్తుంది. యేసు మోసే కాడి సులువైంది. గనుక భారం తేలికగావుంటుంది. విధినిర్వహణ, త్యాగం, ఆనందాయకంగా ఉంటాయి. చీకటితో నిండిన మార్గం నీతి సూర్యుని కిరణాలతో తేజోవంతమౌతుంది.SCTel 47.1

    సుందరమైన క్రీస్తు శీలం ఆయన అనుచరుల్లో ప్రతిబింబిస్తుంది. దేవుని చిత్తం నెరవేర్చడం ఆయనకుఅమితానందాన్నిచ్చింది. దేవుని ప్రేమ, ఆయన మహిమకోసం ఉత్సాహం- ఇదే మన రక్షకుని జీవితాన్ని నియంత్రించిన శక్తి. ఆయన క్రియల్నిటినీ అందంగా ఉదాత్తంగా రూపుదిద్దింది. ప్రేమే. ప్రేమ దైవ సంబంధమైనది. క్రీస్తుకు సమర్పితంకాని హృదయంలో ప్రేమ పుట్టదు. యేసు పరిపాలించే హృదంలోనే ప్రేమ ఉత్పత్తి ఔతుంది. ఆయన ముందు మనల్ని ప్రేమించాడు. గనుక మనం ప్రేమిస్తున్నాం’‘ (1యోహాను 4:19,ఆర్.వి.) దైవ కృప నూతనం చేసిన హృదయంలో ప్రేమే కార్యాచరణ సూత్రం, అది ప్రవర్తనను మార్చుతుంది, ఉద్వేగాన్ని చక్కబర్చుతుంది, భావోద్రేకాన్ని అదుపు చేస్తుంది, శత్రుత్వాన్ని అణిచివేస్తుంది, అనురాగాన్ని ఉదాత్తం చేస్తుంది. హృదయంలో దాచుకున్న ఈ ప్రేమ జీవితాన్ని ఆనందమయం చేసి చుట్టుపట్ల ఉన్న వారిపై సత్ర్పభావాన్ని ప్రసరిస్తుంది.SCTel 47.2

    దేవుని బిడ్డలు - ముఖ్యంగా కొత్తగా యేసు కృపను అంగీకరించినవారు గమనించాల్సిన రెండు పొరపాట్లు ఉన్నాయి. మొదటిది- ఇంతకుముందే ప్రస్తావించాను. దేవునితో మంచి సంబంధం కలిగివుండేదుకు తమ సొంత క్రియలమీద ఆధారపడడం. ధర్మ శాస్త్రాన్ని కాపాడడం ద్వారా తన స్వక్రియలచే పరిశుద్ధుడవ్వడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి అసాధ్యమైన దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రీస్తు లేకుండా మనుషుడు చేయగలిగిన దంతా స్వార్థంతోను, పాపంతోను కలుషితమౌతుంది. విశ్వాసం ద్వారా క్రీస్తు కృపవలన మాత్రమే మనం పరిశుద్దులం కాగలము.SCTel 47.3

    పైదానికి విరుద్ధమైంది అపాయంలో దానికేమి తీసిపోయేది ఏంటంటే క్రీస్తునందలి విశ్వాసం మనుషుల్ని ధర్మశాస్త్ర విధుల నుంచి విముక్తుల్ని చేస్తుందనీ. విశ్వాసం ద్వారానే క్రీస్తు కృపలో మనం పాలిభాగస్థులమవుతాం గనుక మన విమోచనతో మన క్రియలకు ఎలాంటి సంబంధం లేదని నమ్మడం.SCTel 47.4

    విధేయత కేవలం బాహ్యచరణే కాదని, అది ప్రేమ పూర్వక సేవ అని ఇక్కడ గమనించాలి. దేవుని ధర్మశాస్త్రం ఆయన స్వభావానికి వివరణ. అది గొప్ప ప్రేమ సూత్రానికి అక్షరరూపం. అందువల్ల ఇహపరలోకాల్లో దైవ పరిపాలనకు అది పునాది. మన హృదయాలు దేవుని స్వరూపంలోకి నూతనంగా మార్పు చెందితే దేవుని ప్రేమ ఆత్మలో పాదుకొంటే మన జీవితంలో పెద్దధర్మశాస్త్రంక్రియాత్మకం కాదా? ప్రేమ నియమం మన హృదయాల్లో నిక్షిప్తమైవున్నప్పుడు మానవుడు తన సృష్టికర్త పోలికకు మార్పు చెంది నప్పుడు ఈ నూతన నిబంధన వాగ్దానం నెరవేరుతుంది. “నా ధర్మ విధులను వారీ హృదయమునందుంచివారిమన స్సుమీద వాటినివ్రాయుదును” (హెబ్రీ10:16) ధర్మ శాస్త్రాన్ని హృదయంలో రాస్తే, అది జీవితాన్ని రూపుదిద్దదా? విధేయత అంటే సేవాతత్పరత, ప్రభుభక్తితో నిండిన ప్రేమ. ఇది శిష్యాత్వానికి నిజమైన గురుతు. లేఖనం ఇలా అంటుంది- “మనం ఆయన ఆజ్ఞలు గెక్టోనుటయే దేవుని ప్రేమించుట’‘ ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గెక్టోననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.” (1యోహాను 5:3, 2:4). మానవుణ్ణి విధేయత నుంచి విడిపించడానికి బదులు, విశ్వాసం మాత్రమే మనల్ని కృపలో పాలిభాగస్తుల్ని చేస్తుంది. విధేయులమవ్వ డానికి ఇది మనకు తోడ్పడుతుంది.SCTel 47.5

    మన విధేయత వల్ల రక్షణ సంపాదించలేం. రక్షణ దేవుని ఉచిత వరం. దీన్ని విశ్వాసం ద్వారా పొందగలం. అయితే విధేయత విశ్వాస ఫలం. “పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పావమేమియులేదని మీకు తెలియును. ఆయనయందు నిలిచియుండు వాడెవడును పావముచేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగ లేదు” (1యోహాను 3:5,6). అసలు పరీక్ష ఇది. మనం క్రీస్తునందు నిలిచి ఉంటే, మనలో దేవ ప్రేమ ఉంటే, మన మనోగతాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు దేవ గ్రంధంలో విశదం చేయబడ్డట్లు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటాయి. “చిన్న పిల్లలార, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, ఆయన నీతిమంతుడైయున్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు” (1యోహాను 3:7). సీనాయి కొండపై ప్రకటించబడ్డ దేవ పరిశుద్ధ ధర్మశాస్త్రప్రమాణాన్ని బట్టి నీతి నిర్వచించబడుతున్నది.SCTel 48.1

    క్రీస్తును విశ్వసిస్తున్నామని చెప్పుకొంటూమనుషులుదేవునికి విధేయులు కానవసరం లేదని ప్రబోధించేవారి విశ్వాసం విశ్వాసం కానేకాదు. అది దురాభిమానం. “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు” “అలాగే విశ్వాసము క్రియలు లేని దెత్తే అది ఒంటిగా ఉండి మృతమెన్లదగును” (ఎఫెసీ2:8, యాకోబు2:17) లోకానికి రాకముందు యేసు తన్నుగూర్చి తాను ఇలా అన్నాడు: నేను నాతండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్నాను” (యోహాను15:10) లేఖనం ఇలా చెబుతుంది: “మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము... ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పు కొనువాడు ఆయన ఎలాగున నడుచుకొనెనో అలాగే తానునూ నడుచుకొని బద్దుడైయున్నాడు” (1యెహాను 2:3—6) “క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడల యందు నడుచు కొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను” (1 పేతురు 2:21).SCTel 48.2

    ఆదామవ్వలు పాపంలో పడడానికి ముందు నిత్యజీవం పొందడానికి పరదైసులో ఏ షరతు ఉన్నదో నేడు కూడ అదేషరతు ఉన్నది. అదేమంటే సంపూర్ణనీతి, దేవునీధర్మశాస్త్రానికి సంపూర్ణ విధేయత. ఇది మినహాయించి మరే షరతుపైనైనా నిత్యజీవం ఆధారపడి ఉంటే విశ్వం యావత్తు ఆనందానికి విఘాతం కలిగేది. పాపానికి రాజమార్గం ఏర్పడేది. పాప పర్యావసానంగా వచ్చే బాధలు, దుఃఖం నిత్యము కొనసాగేవి.SCTel 49.1

    పాపనికి ముందు ధర్మశాస్త్రాన్ని ఆచరించటం వల్ల నీతి ప్రవర్తనను సాధించటం ఆదాముకు సాధ్యపడేదే. కానీ, ఆదాము దీన్ని సాధించలేకపోయాడు. ఆదాము పాపము వల్ల మన స్వభావాలు దిగజారిపోయాయి. మనకే మనం నీతిమంతులం కాజాలము. మనం పాపులం, అపరిశుద్దులం గనుక పరిశుద్ధధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా ఆచరించలేం. దైవ శాస్త్ర షరతుల్ని నెరవేర్చడానికి సాంతగా మనకు నీతి లేదు. కనుక పరిష్కార మార్గమొకటి క్రీస్తు మనకు ఏర్పాటు చేసాడు. మనకు ఎదురయ్యే శ్రమలు శోధనల నడుమ క్రీస్తు ఈలోకంలో నివశించాడు. పాపరహితం జీవించాడు. మనకోసం మరణించాడు. ఇప్పుడు మన పాపాల్ని స్వీకరించి తన నీతిని మనకు అందిస్తున్నాడు. మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకుని ఆయనను మీ రక్షకునిగా స్వీకరించినట్లయితే మీరెంత పాపి అయినా ఆయనను బట్టి మీరు నీతిమంతులుగా పరిగణింపబడతారు. మీ ప్రవర్తన స్థానంలో క్రీస్తు ప్రవర్తన నిలుస్తుంది. అందువల్ల ఎన్నడూ పాపం చేయని వ్యక్తి వలే మిమ్మల్ని దేవుడు అంగీకరిస్తాడు.SCTel 49.2

    ఇంతకన్నా గొప్ప సంగతేమిటంటే, క్రీస్తు మీ హృదయాన్ని మార్చుతాడు. విశ్వాస మూలంగా ఆయన మీ హృదయంలో నివశిస్తాడు. విశ్వాసం ద్వారా ఈ సంబంధాన్ని మీరు కొనసాగించాల్సివున్నారు. మీచిత్తాన్ని నిత్యముఆయనకు సమర్పించాల్సి వున్నారు.SCTel 49.3

    ఇది మీరు చేసినంతకాలము మీరు ఇచ్చయించడానికి ఆయన చిత్రాన్ని అనుసరించి పనులు చేయడానికి మీకు తోడ్పాటునిస్తాడు. ‘’నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితమునన్ను ప్రేమించి, నాకొరకు తన్నుతానుఅప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను’‘ (గలతీ2:20) కనుక తన శిష్యులతో యేసు ఈ మాటలంటున్నాడు” మీ తండ్రి, ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడేగాని మాటలాడువారు మీరుకారు’‘ (మత్తయి 10:20) ఇంతకీ క్రీస్తు మీలో పని చేస్తుండడంతో మీరు అదే స్వభావాన్ని కనబర్చుతారు. అవే మంచి కార్యాలు అనగా నీతి కార్యాలు చేస్తారు. కాబట్టి మనం అతిశయించడానికి మనలో ఏమీలేదు. మనల్ని మనం హెచ్చించుకోవడానికి హేతువులేదు. మనకు అపాదీతమయ్యే క్రీస్తునీతి మనలోను, మన ద్వారాను ఆయన ఆత్స చేస్తున్న పనే మన నిరీక్షణకు ఏకైక హేతువు.SCTel 50.1

    విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోవలసిన తేడా ఒకటుంది. విశ్వాసంకాని ఒక రకమైన నమ్మకం ఒకటుంది. దేవుని ఉనికి. ఆయన శక్తి, ఆయన సత్యవాక్కు ఇవి సాతాను, అతని అనుచరగణం సయితం కాదనలేని వాస్తవాలు. దయ్యములును నమ్మి వణుకుచున్నవి” (యాకోబు 2:19) అని బైబిలు చెబుతున్నది.SCTel 50.2

    అయితే ఇదివిశ్వాసంకాదు. దేవుడంటే, విశ్వాసంమాత్రమేగాక, ఆయన చిత్రానికి సమర్పించుకోవడం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే హృదయం ఆయనకు అంకిత మౌతుందో, అనురాగాలు ఆయనపై నిలిచి ఉంటాయో, అక్కడ విశ్వాసం ఉంటుంది. అది ప్రేమకు స్పందించి ఆత్మను పరిశుద్ధం చేసే విశ్వాసం. ఈ విశ్వాసం వల్ల హృదయం దేవుని స్వరూపాన్ని నూతనంగా పొందుతుంది. నూతనత్వం పొందని హృదయం దైవ ధర్మ శాస్త్రానికి లోబడడంగాని దావీదుతో గళంకలిపి ‘’నీధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దీనమంతా దానిని ధ్యానించుచున్నాను” (కీర్తనలు 119:97) అనడంగాని చేయలేదు. ఈ శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచుకొను’‘ (రోమా 8:1) మనయందు ధర్మ శాస్త్రనుసారమైన నీతి నెరవేర్చబడుతున్నది.SCTel 50.3

    క్షమాపూరితమైన క్రీస్తు ప్రేమను ఎరిగిన మీదట దేవుని బిడ్డలు కావాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ, తమ ప్రవర్తన అసంపూర్ణమైందని, తమ జీవితం తప్పులతో నిండినదైనదని గుర్తించేవారు తమ హృదయాల్ని పరిశుద్ధాత్మ నూతన పర్చడానికి శకించేవారున్నారు. అట్టివారు నిరాశచెంది వెనుదిరగవద్దని నా హితవు. మన పొరపాట్ల నిమిత్తం యేసు పాదాలపెపడి తరచు విలపించవలసివస్తుంది. అయినా మనం నిస్పృహ చెందకూడదు. విరోధి చేతిలో మనం ఓడిపోయినా దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆయన మనలను ఎంతమాత్రమూ విడువడు. క్రీస్తు దేవుని కుడి పార్శ్వాన నిలిచి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. యెహాను మనల్ని ఇలా ధైర్యపరుచున్నాడు: “మీరు పాపము చేయకుండుటకే ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడెన్లను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తర వాది తండ్రియొద్ద మనకున్నాడు. (1యోహాను 2:1) క్రీస్తు చెప్పిన ఈమాటలుమరువకండి. “తండ్రితోనే మిమ్మును ప్రేమించుచున్నాడు’‘ (యోహాను 16:27). తనసొంత పవిత్రత, పరిశుద్దత మీలో ప్రతిబింబించటం చూసేందుకుగాను మిమ్మల్ని తన చెంతకు పునరుద్ధించాలన్నది ఆయన ఆశ. మిమ్మల్ని మీరుఆయనకు సమర్పించుకుంటే, మీలోమంచిపనిప్రారంభించిన ఆప్రభువు దాన్ని యేసు క్రీస్తు దినం వరకూ కొనసాగిస్తాడు. ప్రగాఢ భక్తితో ప్రార్ధన చేయండి. మరెక్కువగా విశ్వసించండి. స్వశక్తిపై తక్కువ నమ్మికయుంచి, రక్షకుని శక్తిని ఇంకా ఎక్కువగా ఆశ్రయిద్దాం. అప్పుడు మన ముఖారోగ్య వికాసానికి నెలవైన ప్రభువును మనం కొనియాడదాం.SCTel 50.4

    ఏ హృదయమైతే తన పాపి స్థితిని గుర్తించదో ఆ హృదయంలో క్రీస్తు పట్ల గాఢమైన ప్రేమ చోటుచేసుకోజాలదు. క్రీస్తు కృపవల్ల పరివర్తన చెందిన ఆత్మ ఆయన పరిశుద్ధ శీలాన్ని అభినదిస్తుంది. కాగా మనం మన నైతిక వైకల్యాన్ని చూడకపోతే మనం క్రీస్తు సౌందర్యాన్ని, వైశిష్ట్యాన్ని వీక్షించలేదనడానికి ఆ వైఫల్యం ఒక స్పష్టమైన నిదర్శనం.SCTel 51.1

    మనలోని మంచిని మనం ఎంత తక్కువగా చూసి అంచనా వేసుకుంటే, మన రక్షకుని అపార పరిశుద్ధతను, సౌమ్యతను అంత ఎక్కువగా చూసి అంచనా వేస్తాం. మన పాప స్థితిని గూర్చిన అవగాహన మనల్ని క్షమించగల ప్రభువు వద్దకు నడుస్తుంది. ఆత్మ తన నిస్సహాయ స్థితిని గుర్తించి క్రీస్తు సహాయానికి చేయి చాచితే ఆయన తన స్వశక్తితో మనకు తన్నుతాను బయలు పర్చుకొంటాడు. మనకు ఆయన అవసరమన్న భావన మనల్ని ఆయన చెంతకు, ఆయన వాక్యంవద్దకు ఎంత తరచుగా నడిపిస్తే, ఆయన శీలాన్ని గూర్చి అంత ఉన్నతాభిప్రాయం మనకు ఏర్పడుతుంది. అంత సంపూర్ణంగా మనం ఆయన స్వరూపాన్ని ప్రతిబింబిస్తాం,SCTel 51.2