Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    11వ అధ్యాయం - ప్రార్ధనాధిక్యత

    ప్రకృతి ద్వారా, ప్రత్యక్షత ద్వారా, తన కృపాకార్యాలద్వారా, తన ఆత్మ ప్రభావం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఇవి మాత్రమే సరిపోవు. మనం మన హృదయభారాన్ని ఆయనకు వెలుబుచ్చుకోవాలి. ఆధ్యాత్మిక శక్తికోసం మనంమన పరలోక జనకునితో ఆత్మీయత పెంచుకోవాలి. మన మనసు ఆయనకు ఆకర్షితం కావచ్చు. ఆయన పనులు, కృపలు, దీవెనల్ని మనం మననం చేసుకోవచ్చు. ఇది నిజంగా ఆయనతో ఆత్మీయత కలిగివుండడంకాదు. ఆయనతో సాన్నిహిత్యం కలిగివుండడానికి మన జీవితం గురించి ఆయనతో చెప్పుకోవడానికి మనకేదో ఉండాలి.SCTel 71.1

    హృదయం తెరచి ఒక స్నేహితునితో మాట్లాడేటట్లు దేవునితో మాట్లాడడమే ప్రార్ధన. మన స్థితి ఏమిటో దేవునికి తెలియపర్చడం అగత్యమనికాదు. ఆయనను స్వీకరించడానికి ఇది అవసరం. ప్రార్ధన దేవునిని మనవద్దకు తీసుకురాదుకాని మనల్ని ఆయన వద్దకు తీసుకువెళ్తుంది.SCTel 71.2

    యేసు ఈ లోకంలో నివశించీపుడు తన శిష్య బృందానికి ప్రార్ధించటం నేర్పించాడు. తమ అనుదినావసరాలు ఏమిటో దేవునికి విన్నవించుకుంటూ తమ చింతలన్నీ ఆయనకు విడిచిపెట్టవలసిందిగా వారికి సూచించాడు. తమ మనవుల్ని దేవుడు ఆలకిస్తాడంటూ వారికి యేసు ఇచ్చిన హామీ మనకు కూడా వర్తిస్తుంది.SCTel 71.3

    మానవుల మధ్య నివశించిన కాలంలో యేసు తరచు ప్రార్ధన చేసాడు. మన అవసరాలు, బలహీనతలు వంటివే తనవీనని మన రక్షకుడు బయలు పర్చాడు. విధి నిర్వహణలోను, శ్రమలోను ధైర్యంగా ముందుకు సాగడానికి గాను తండ్రి వద్దనుంచి నూత శక్తికోసం ఇందుమూలముగా యేసు ఒక విజ్ఞాపకుడూ, దరకస్తుదారుడు అయ్యాడు. అన్ని విషయాల్లోను ఆయనే మనకు ఆదర్శం. మన బలహీనతలో ఆయన మన సోదరుడు, సమస్త విషయాలలోను మన వలే శోధింపబడెను’‘ కాని పాపరహితుడెన్ల ఆయన స్వభావం దృష్టి నుంచి మరలిపోయింది. పాపలోకంలో ఆయన కష్టాలు, ఆత్మ వేదన అను భవించాడు. తన తండ్రితో సహవాసం ఆయనకు ఆదరణ, ఆనందం లభించాయి. దైవ కుమారుడు లోక రక్షకుడే ప్రార్ధన అవశ్యకతను గుర్తిస్తే దుర్భల పాపమానవుల మెన్ల మనం ఎడతెగని ప్రార్ధన అవసరాన్ని మరింతగా గుర్తించాల్సివున్నాం!SCTel 71.4

    మనపై తన దీవేనల్నీని కుమ్మరించడానికి మన పరమ తండ్రి వేచివున్నాడు. తన అపార ప్రేమ ఊట నుంచి సమృద్ధిగా తాగడం అన్న ఆధిక్యత మనకు కులుగుతుంది. మనం ఇంత తక్కువగా ప్రార్ధించటం ఎంత ఆశ్చర్యం! అతి దీనులేన్ల తన బిడ్డల యధార్ధ ప్రార్ధన వినడానికి దేవుడు ఇష్టంగాను, సంసిద్ధంగాను ఉన్నాడు. అయినా మన అవసరాన్ని దేవునికి విన్నవించు కోవడానికి మనం సంశయిస్తున్నాం. దేవుని అపారమైన ప్రేమా హృదయం శోధనకు గురి అయిన మనుషుల పట్ల ప్రేమ గలిగి వారి కోరిన దానికి తలంచినదానికి మించి అనుగ్రహించడానికి సింద్దంగా ఉండగా, వారి విశ్వాసం కొరవడి, వారి ప్రార్ధన అంతంత మాత్రంగానేవుంటే, వారికి సాయం చేయడానికి దేవ దూతలు ఏమనుకుంటారు? దేవుని ముందు వంగి నమస్కరించటం దేవ దూతలకెంతో ఆనందం. ఆయనకు దగ్గరగా ఉండడానికి ఆశిస్తారు. ఆయనతో సాంగత్యం అరుదైన ఆనందంగా భావిస్తారు. అయినా ఆయన ఆసరా అత్యంత అగత్యమైన మనుషులు ఆయన ఆత్మ శాంతి లేకుండా, ఆయన సన్నిధి సహవాసం లేకుండా పయనించటంలో తృప్తి చెందునట్లు కనిపిస్తుంది.SCTel 72.1

    ప్రార్ధనను అశ్రద్ధ చేసేవారిని దుష్టుడి అంధకారం ఆవరిస్తుంది. సాతాను శోధనలు వారిని పాపంలోకి నడిపిస్తాయి. ఇదంతా వారు దేవుడు ఏర్పాటు చేసిన ప్రార్ధనావకాశాల్ని వినియోగించుకుపోవడంవల్లే సంభవిస్తుంది. దేవుని ధనాగారం తెరిచేందుకు ప్రార్ధన విశ్వాసం చేతిలో తాళపు చెవి అయినప్పుడు దేవుని కుమారులు కుమార్తెలు ప్రార్ధించడానికి ఎందుకు వెనుకాడాలి? ఈ ధనాగారంలో అపారమైన నిధులున్నాయి. మెలుకువగా ఉండి, ఎడతెగకుండాపోయే అపాయముంది. శోధనను ప్రతిఘటించేందుకుగాను విశ్వాసం, విజ్ఞాపనలద్వారా మనం కృపను శక్తిని పొందకుండా అడ్డుతగిలేందుకు సాతాను కృపాసన మార్గానికి ఆటంకం కల్పించడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. దేవుడు మన ప్రార్ధనలు ఆలకించి వాటికి ప్రతిస్పందించాడికి కొన్ని షరతులున్నాయి. వీటిలో మొదటిది ఆయన సహాయం అవసరమని మనం గుర్తించటం. ఆయన ఈ వాగ్దానం చేసాడు. “నేను దప్పిగల వాని మీద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను” (యెష44:3) నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, దేవుని అమితంగా ప్రేమించేవారు నిశ్చయముగా తృప్తి పొందుతారు. ఆత్మ ప్రభావం ప్రసరించేందుకుగాను హృదయాన్ని తెరచి ఉంచాలి. ఇది జరగకపోతే దైవ దీవెనల్ని అందుకోలేం.SCTel 72.2

    మనగొప్ప అవసరమే మన పక్షంగా వినిపించే అనర్గళ వాదన. మనకు ఈ కార్యాలు చేయడానికి మనం ప్రభువును ఆర్జించాలి. “అడుగుడి మీ కియ్యబడును” తన సొంత కుమారుని అనుగ్రహించుటకువెనుక దీయక మన అందరికొరకుఆయనను అప్పగించిన వాడు ఆయనతోపాటు సమస్తముమనకెందుకు అనుగ్రహింపడు?” (మత్తయి7:7, రోమా 8:32) అంటున్నాడు యేసు.SCTel 73.1

    మనం మన హృదయాల్లో పాపాన్ని లక్ష్యంచేస్తే, తెలిసిన పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ప్రభువు మన ప్రార్ధన ఆలకించడు. పశ్చాత్తాపంతో విరిగి నలిగిన ఆత్మ ఆయనకు ఎల్లప్పుడూ అంగీకృతమే. మనం తెలిసిన పాపాలన్నింటినీ సరిజేసుకున్నప్పుడు దేవుడు మన మనవుల్ని ఆలకిస్తాడని నమ్మవచ్చు. మన అర్హతవల్ల దేవుని అంగీకారాన్ని పొందలేము. యేసు యోగ్యతే మనల్ని రక్షిస్తుంది; ఆయన రక్తం మనల్ని శుద్ధిపర్చుతుంది. ఆయన అంగీకారం పొందడానికి ఏర్పాటెన్ల షరతులు పాటించటం మన వంతు పని.SCTel 73.2

    సఫల ప్రార్ధనలో మరో భాగం విశ్వాసం. ‘’దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను ఫలము దయచేయువాడనియు, నమ్మవలెనుగదా’‘ (హెబ్రి 11:6) తన శిష్యులతో యేసు ఇలా అన్నాడు, “ప్రార్ధనచేయునప్పుడుమీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అది మీకు కలుగును” (మార్కు 11:24). ఆయమ చెప్పిన మాట నమ్ముతున్నామా?SCTel 73.3

    ఆయన వాగ్దానం విశాలమైనది, పరిమితి లేనిది. వాగ్దానం చేసిన ప్రభువు నమ్మదగినవాడు. ప్రార్ధించేటపుడు మనం అడిగింది దొరకకపోయినా ప్రభువు వింటున్నాడని, మన ప్రార్ధన ఫలం అనుగ్రహిస్తాడని నమ్మాలి. మనం తప్పులు చేస్తాం. మనకు దూరదృష్టి ఉండదు. అందుచేత కొన్నిసార్లు మనకు మేలు చేయని వాటికోసం అడుగుతాము. అయితే ప్రేమగల మన పరలోకపు తండ్రి మనకు ఏది మంచిదో, అది ఇచ్చి, తద్వారా మన ప్రార్ధనకు జవాబు ఇస్తాడు. మనం దివ్య దృష్టిపొంది విషయాన్ని యథాతధంగా చూడగలిగితే దేవుడిచ్చిందే కోరదగిందని గుర్తిస్తాము.SCTel 73.4

    మన ప్రార్ధనలకు జవాబు రావడంలేదన్నట్లు కనిపించినపుడు వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకోనివుండాలి. ఎందుకంటే జవాబు దొరికేసమయం తప్పక వస్తుంది, మనకెంతో అవసరమైన్ల దీవెనను పొందుతాము. కాని మనం కోరిందే. మనం కోరి విధముగా వచ్చేదే ప్రార్ధనకు జవాబు అని అనుకోవడం మార్ఖత్వం. దేవుడు మహా జ్ఞాని; ఆయన తప్పుచేయడు. నీతిగా జీవించేవారికివ్వకుండా ఏమేలును అట్టిపెట్టుకోడు, కనుకనే మీప్రార్ధనకువెంటనే ఫలంకనిపించకపోయినా, ఆయననువిశ్వసించడానికి భయపడకూడదు. “అడుగుడిమీకియ్యబడును’‘ (మత్తయి7:7) అన్న ఆయన వాగ్దానాన్ని నమ్మండి.SCTel 74.1

    విశ్వాసం కలిగి ఉండడానికి ముందు, సందేహాలు, భయాలు, గుప్పిట్లో మనముంటే లేదా మనకు స్పష్టంగా కనిపించని సమస్యలన్నింటిని పరిష్కరించడానికి మనం ప్రయత్నిస్తే, మన చిక్కులు అధికమౌతాయి. మనం ఉన్న రీతిగానే, అనగా మన నిస్సహాయ, నిరాధార స్థితిలో దేవుని యొద్దకు వచ్చి విశ్వసిస్తూ, సర్వం ఎరిగిన ఆయనకు సృష్టిలోని సమస్తాన్ని చూసే ఆయనకు, సర్వాన్నితనమాటతోను, చిత్తంతోను పరిపాలించే ఆయనకు దీనంగా మన విన్నపాలు తెలియజేస్తే ఆయన మొర వింటాడు. తన వెలుగు మన హృదయాల్లో ప్రకాశింపజేస్తాడు. యధార్ధ ప్రార్ధన వల్ల అనంతుడెన్ల దేవునితో మనకు సంబంధం ఏర్పడుతుంది. ప్రేమతో కరుణాకటాక్షాలతో వంగి, రక్షకుడు మన ముఖంలోకి చూసాడనడానికి గొప్ప నిదర్శన మనకు లేకపోవచ్చు. కానీ ఇది నిజం. ఆయన స్పర్శని మనం గుర్తించలేకపోవచ్చు. కాని ప్రేమ కనికరాలుగల ఆయన హస్తం మనమీద ఉన్నది.SCTel 74.2

    మనం దేవుని కృపకోసం, దీవెనలకోసం, వచ్చినప్పుడు మన సొంత హృదయాల్లో ప్రేమ క్షమాశీలత ఉండాలి. “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మ ఋణములను క్షమించుము” (మత్తయి 6:12) అని ప్రార్ధన చేస్తూనే క్షమించని గుణం మనం ఎలా కలిగి ఉండగలం? క్షమించమంటూ మనంచేసే ప్రార్ధనల్ని దేవుడు వినాలంటే మనం కూడా అదే రీతిగా అదే మేరకు ఇతరుల్ని క్షమించాలి.SCTel 74.3

    విసుగకుండా ప్రార్ధించటం ఫలం పొందటానికి ఒక షరతు. విశ్వాసంలోను అనుభవంలో మనం పెరగాలంటే మనం ఎల్లప్పుడూ ప్రార్ధించాలి. ప్రార్ధన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దానియందు మెలుకువగా ఉండడానికి మనం “ప్రార్ధనయందు పట్టుదల గలిగి’‘ ఉండాలి. (కొలస్సి 4:2; రోమా 12:12) “స్వస్థబుద్ధి గలవారె ప్రార్ధన చేయుటకు మెలుకువగా ఉండుడి” (1 పేతురు4:7) అంటూ విశ్వాసులకు హితవు పలుకుతున్నాడు పేతురు. పౌలు ఇలా సూచిస్తున్నాడు, ” ప్రతీ విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీవిన్నపములుదేవునికి తెలియ జేయుడి’‘ (ఫిలిప్పి4:6). యూదా అంటున్నాడు, “ప్రియులారా, పరిశుద్దాత్మలో ప్రార్థన చేయుచూ, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొనియుండుడి” (యూదా 20:21). ఎడతెగకచేసే ప్రార్థన అంటే దేవునితో అవిచ్ఛిన్నత ఐక్యత. ఈ ఐక్యతవల్ల దేవుని వద్దనుంచి జీవం మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. పవిత్రత, పరిశుద్దత మన జీవితంనుంచి తిరిగి దేవుని వద్దకు ప్రవహిస్తాయి. విసుగక ప్రార్ధించటం అవసరం. దీనికి ఆటంకాలు ఏర్పడనీయకండి. మీ ఆత్మకు యేసుకు మధ్య సంబంధాల కొనసాగింపుకు కృషి చేయండి. ప్రార్థన ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నించండి. దేవునితో వాస్తవంగా కోరేవారు ప్రార్థన సమావేశంలో వుంటారు. విధి నిర్వహణలో నమ్మకంగా ఉంటారు. దేవుని వద్దనుంచి వస్తున్న సత్యాన్ని స్వీకరించడానికి కలిగే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటారు.SCTel 74.4

    మనం కుటుంబ పరిధిలో ప్రార్థన చేసుకోవాలి. అన్నిటికన్నా మఖ్యంగా రహస్య ప్రార్థనను అశ్రద్ధ చేయకూడదు. ఆత్మకు జీవం ఇదే. ప్రార్ధనను నిర్లక్ష్యం చేసిన ఆత్మ వర్ణిల్లడం అసాధ్యం. కుటుంబ లేదా బహిరంగప్రార్థనమాత్రమేచాలదు. దేవుని విమర్శనా త్మక దృష్టికి ఆత్మ ఏకాంతంలో తన్నుతాను సమర్పించుకోవాలి. ప్రార్థనను ఆలకించే దేవుడేరహస్యప్రార్థననువినవలసివున్నాడు. అలాంటి మనవుల్ని ఏ దురదచెవీ వినరాదు.SCTel 75.1

    రహస్య ప్రార్ధనలో ఆత్మ పరిసర ప్రభావాలకు, ఉద్రేకానికి లోను కాదు. నిశ్చలంగా, అయినా తీవ్రంగాఅదిదేవుని వెంబడిస్తుంది. రహస్యాలు ఎరిగినవాడు, హృదయంనుంచి వచ్చే ప్రార్థన వినే చెవిగలవాడు అయిన ప్రభువు నుంచి బయలు వేడలే ప్రభావం మధురమైంది, నిత్యంనిలిచే నిర్మల, సామాన్య విశ్వాసం ద్వారా ఆత్మ దేవునితో సహవాసం చేసి, సాతానుతో పోరాటంలో తన్ను బలోపేతం చేయడానికి దైవ కాంతి కిరణాల్ని సమీకరించుకొంటుంది. దేవుడే మన శక్తికి నిలయం.SCTel 75.2

    మీరు రహస్య మందిరములో ప్రార్ధించండి. మీ దైనందిన కార్య కలాపాలపై తిరిగేటప్పుడు మీ హృదయాన్ని దేవుని తట్టుతిప్పి ప్రార్ధించండి. హానోకు దేవునితో ఈవిధంగానే నడిచాడు. ఈ రహస్య ప్రార్థనలు దైవ కృపాసనం ముందు ప్రశస్తధూపంగా పరీమళిస్తాయి. ఇలా దేవునిమీద ధాన్యాన్ని నిలిపే వ్యక్తిని సాతాను ఆకర్షించలేడు.SCTel 75.3

    దేవునికి విన్నపాలు సమర్పించుకునేందుకు అనువుకాని సమయం కాని స్థలం గాని లేదు. ప్రార్థన వైఖరితో హృదయాన్ని దేవుని తట్టు త్రిప్పడానికి మనల్ని ఆటంక పర్చగలిగిందేదీ లేదు. జనులతో కిటకిటలాడే వీధిలో, వ్యాపార వ్వవహారాల మధ్యలో మన విన్నపాల్ని అర్తహషస్త రాజు ముందు నెహేమ్య తన మనవిని విన్నవించినట్లు మనం దేవునికి సమర్పించి ఆయన నడుపుదలను అభ్యర్ధించవచ్చు. మనం ఎక్కడుంటే అక్కడ రహస్య ప్రార్ధన స్థలాన్ని మన ఆత్మలో నివశించ వలసిందిగా యేసును ఆహ్వానించాలి.SCTel 75.4

    మనచుట్టూ ఉన్న వాతావరణం అవినీతితో కలుషితమెన్ల మనం ఆ కల్మషాన్ని పీల్చుకోనవసరంలేదు. పరలోక పరిశుద్ద వాతావరణంలో మనం నివశించవచ్చు. ప్రార్ధన ద్వారా ఆత్మను దేవుని సన్నిధిలో నడిపించి, తద్వారా చెడ్డ ఊహలకు, ఆలోచనలకు తలుపుమూసివేయవచ్చ. దేవునిదీవెనల్ని మద్దతును స్వీకరించడానికి సిద్దంగా ఉన్నవారు పరిశుద్ద వాతావరణములో నడుస్తూ దేవునితో నిత్యం సహవాసం చేస్తారు.SCTel 76.1

    యేసును గురించి ఇంకా స్పష్టమైన అభిప్రాయాలు, నిత్య వాస్తవాల విలువలను గూర్చి సంపూర్ణ అవగాహన మనకు అవసరం. పరిశుద్ధతలోని రమ్యత దైవ జనుల హృదయాల్ని నింపాల్సివుంది. ఇది జరగడానికి మనం పరలోక విషయాలు ఆవిష్కరణ కోసం వెదకాలి.SCTel 76.2

    మన ఆత్మ పరలోక వేపుకు ఆకర్షితం కావాలి. అప్పుడు పరలోక వాయువును కొంతమేరకు పీల్చుకోవడానికి దేవుడు మనకు అవకాశమిస్తాడు. మనం దేవునికి అతి సమీపంగా ఉండవచ్చు. అప్పుడు శ్రమలు కలిగితే పువ్వు సహజంగా సూర్యుడి దిశగా తిరిగేటట్లు మన ఆలోచనలు ఆయన తట్టు తిరుగుతాయి.SCTel 76.3

    మీ కోరికలు, మీ ఆనందాలు, మీ దుఖాలు మీ చింతలు, మీ భయాలు, దేవుని ముందుంచండి. ఆయన మోయలేని భారం ఉండదు. మీ తలవెంట్రుకలు లెక్కించగల ఆయనతనబిడ్డలవిషయములో శ్రద్ధచూపడా ?”ఆయనఎంత జాలి, కనికరము గలవాడని మీరు తెలిసికొనియున్నారు”(యాకోబు5:11). మనదుఃఖాలు ఆయనప్రేమాహృదయాన్నిచలింపజేస్తాయి. వాటిని మనం ప్రస్థావిస్తేఆయనకుదుఖం: కలుగుతుంది. మనసు ఆంధోళనకు గురయితే సమస్తాన్ని ఆయనవద్దకు తీసుకెళ్ళండి. ఆయన లోకాన్ని ఉనికిలో ఉంచుతాడు గనుక విశ్వ వ్యవహారాలన్నిటిని శాసించేవాడు ఆయనే గనుక ఆయన మోయలేని భారమేదీలేదు. మనశాంతికి సంబంధించిన ఏవిషయమునెవ్లా ఆయన గుర్తించలేనంత చిన్న విషయంకాదు. మన అనుభవములో ఆయన చదవలేనంత చీకటి అధ్యాయాలుండవు. ఆయన పరిష్కరించలేని సమస్య ఉండదు. మన పరమ జనకుడువరిశీలించకుండా లేక ఆయన తక్షణ ఆసక్తి చూపించకుండా ఆయన పిల్లల్లో మిక్కిలి అల్పుడికి ఏ చిక్కూ వాటిల్లదు. ఏ ఆంధోళనా ఆత్మనుక్షోభింప జేయదు. ఏ పెదవులకీ ఆనందం చేకూరదు. ఏ నోటినుంచీ యధార్ధ ప్రార్థన వెలవడదు. ‘’గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు” (కీర్త147:3) దేవునికి ప్రతీ ఆత్మలో ఉన్న సంబంధం బాంధవ్యాలు విలక్షణమైనవి. ఏమీ వెలితిలేనివీనూ, ఆయన ఆలనాపాలన పంచుకోవడానికి ఆయన ప్రియ కుమారుని అనుగ్రహించడానికి ఈ భూగోళంపై ఇంకొక వ్యక్తి లేడనిపించే సంబంధాలు ఇవి.SCTel 76.4

    “మీరు నా పేరిట అడుగుదురుగాని మీ విషయమెన్లను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. తండ్రితానే మిమ్మును ప్రేమించుచున్నాడు” “మీరు నాపేరిట తండ్రినీ ఏమీ అడుగుదురో అది ఆయన మీ కనుగ్రహించునట్లు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని” (యోహాను 16:26, 27:15,16) అంటున్నాడుయేసు. యేసు పేరిట ప్రార్థించడమంటే ప్రార్థన మొదటిలోను, చివరిలోను ఆపేరు పలకడం మాత్రమే కాదు, ఆయన వాగ్దానాలు విశ్వసిస్తూ ఆయన కృపపై ఆధారపడుతూ, ఆయన పనులు చేస్తూ మనం యేసు మనసుతోను ఆత్మతోను ప్రార్థన చేయడమని దీనిభావం.SCTel 77.1

    భక్తి కార్యాలు ఆచరించడానికి మనం విరాగులమూ సన్యాసులమూ కావాలని లోకాన్ని విడిచిపెట్టి అరణ్యలకు వెళ్ళిపోవాలని దేవుని అభిమతంకాదు. జీవితం క్రీస్తు జీవితంలా ఉండాలి. పర్వతానికి ప్రజలకు మధ్య దినమెల్లా ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయని వాడు అనతికాలంలోనే ప్రార్థించటం మానివేస్తాడు. లేదా అతని ప్రార్ధనలు చిలుక పలుకుల్లా ఒకే ఒరవడిలో ఉంటాయి. మనుషుల సాంఘిక జీవితంనుంచి, క్రైస్తవ విధి నిర్వహణ నుంచి సిలువనుభరించటంనుంచి దూరముగా వెళ్ళిపోతే, తమకోసం ఎంతో శ్రమించిన ప్రభువు కోసం వారు పనిచేయడం మానేస్తే వారికి ప్రార్ధించేందుకు విషయంగాని, భక్తి జీవితానికి ఉత్సాహంగాని ఉండవు. వారి ప్రార్ధనలు వ్యక్తిగతమె స్వార్థానికి అద్దం పడతాయి. వారు మానవాళి అవసరాల నిమిత్తం ప్రార్థించలేరు. క్రీస్తు రాజ్య ప్రగతికి కృషి చేయడం కోసం, శక్తి కోసం విజ్ఞాపన చేయరు..SCTel 77.2

    దేవ సేవలో ఒకరినొకరు బలపర్చుకునేందుకు, ఉద్రేకపర్చుకునేందుకు కలిసికట్టుగా కృషిచేసే ఆధిక్యతను అశ్రద్ధచేస్తే మనమే నష్టపోతాము. దైవ వాక్యంలోని సత్యాలు మన మనసుల్లో తమ స్పష్టతను, ప్రాముఖ్యతను కోల్పోతాము, శుద్ధీకరణకూర్చే ఆ సత్యాల ప్రభావంవల్ల మన హృదయాలు ఉత్తేజం పొంది స్పందించని కారణంగా మనం ఆధ్యాత్మికంగా క్షీణిస్తాం. క్రైస్తవులుగా మన సహవాసంలో పరస్పర సానుభూతి కొరవడినందువల్ల మనం బహుగా నష్టపోతము, ఇతరులతో సంబంధం లేకుండా తన మానాన తానుండే వ్యక్తి దేవుడు తనకిచ్చిన బాధ్యతను నిర్వర్తించడంలేదు. మన ప్రవర్తిలోని సాంఘిక లక్షణాల్ని ప్రోది చేయడంవల్ల మనకు సానుభూతి లభిస్తుంది. దైవ సేవలో మనకు బలంచేకూర్చే సాధనమవుతుంది.SCTel 77.3

    కైస్తవులు ఒకరినొకరితో స్నేహబంధాలు కలిసిమెలసి నివసిస్తూ దైవ ప్రేమను గూర్చి విమోచన సత్యాల్ని గురించి ముచ్చటించుకొంటూ ఉంటే, వ్యక్తిగతంగా వారి హృదయాలు ఉత్తేజం పొందుతాయి. ఇతరులకు ఉత్తేజం కలుగుతుందుకూడ. పరలోకమందున్న మన తండ్రి గురించి అనుదినమూ నేర్చుకుంటూ ఆయన కృపలో తాజా అనుభూతి పొందవచ్చు. అప్పుడు ఆయన ప్రేమను ప్రస్తావించగోరతాం. ఈ ప్రక్రియలో మన హృదయాలు ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని సంతరించుకుంటాయి. మనల్ని గురించి మనం తక్కువ, యేసుని గురించి ఎక్కువ ఆలోచించటం, మాట్లాడడం చేస్తే ఆయన సన్నిధి మనతో మరెక్కువగా ఉంటుంది.SCTel 78.1

    మన విషయంలో దేవునిశ్రద్దను గూర్చిన నిదర్శనం ఎంత తరచుగా కనిపిస్తే అంత తరచుగా మనం ఆయనను గూర్చి ఆలోచించినట్లయితే, ఆయన నిత్యమూమన ఆలోచనల్లోనేవుంటాడు. ఆయననుగూర్చి నిత్యము మాట్లాడతాము. ఆయనను నిత్యము శ్లాఘిస్తూనే వుంటాము. ఈలోక సంగతులు మాట్లాడుతుంటాము. ఎందుకంటే వాటిలో మనకు ఆసక్తి మెండు. స్నేహితుల్ని ప్రేమిస్తాముగనుక వారినిగురించి మాట్లాడతాము. మన సుఖ దుఃఖాలు వాళ్ళతోనే ముడిపడివుంటాయి. చెప్పాలంటే ఈ లోకంలో స్నేహితులకన్నా యేసుని ప్రేమించడానికి ఎంతో బలమైన హేతువుమనకున్నది.SCTel 78.2

    మన తలంపులన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానాన్నివ్వటం, ఆయన మంచి తనం గురించి, ఆయన శక్తిని గురించి మాట్లాడడం మనకు అతి స్వాభావిక విషయంకావాలి. దేవుడు మనకు అనుగ్రహించిన వరాలు ఆయన కోసం మనం ఏమీ త్యాగం చేయలేనంతగా మన అశక్తుల్ని ఆలోచనల్ని ఆకట్టుకోకూడదు. అవి ఆయనను మనకు నిత్యం జ్ఞాపకం చేస్తూ, ప్రేమా, కృతజ్ఞతానుబంధాలతో మనల్ని ఆయనకు బంధించాలి. ఈలోకంలో లోతట్టు ప్రాంతాలకు అతిచేరువగా మనం నివశిస్తున్నాం. పరలోక గుడారములోతెరచివున్న ద్వారంపై మన దృష్టిని నిలుపుదాం. “తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైన ” (హెబ్రి7:25) క్రీస్తు ముఖంపై అక్కడ దేవుని మహిమ ప్రకాశిస్తుంది.SCTel 78.3

    “ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు’‘ (కీర్త107:8) మనం దేవునికి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన భక్తి ప్రార్థనలు అడగడం పొందడానికే పరిమితం కారాదు. మనం పొందుతున్న ఉపకారాల్ని విస్మరిస్తూ, మన అవసరాలు కోరికల గురించే మనం ఎల్లప్పుడు ఆలోచించకూడదు. మనం అతిగా ప్రార్ధన చేయడమన్నది లేదేమోగాని అతి స్వల్పంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం జరుగుచున్నది. ప్రతినిత్యం మనం దేవుని కృపలు అందుకుంటున్నాం. ఆయన మనం ఎంత తక్కువగా దేవునిక కృతజ్ఞలర్పిస్తాం. ఆయన మనకు చేసిన ఉపకారాలనిమిత్తం ఆయనను అంతంత మాత్రంగానే కొనియాడతాము.SCTel 78.4

    పూర్వ దేవుని ఆరాధించేందుకు ఇశ్రాయేలు ప్రజలు సమావేశమైనప్పుడు ఆయనిలా ఆదేశించాడు, ‘’మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మునాశీర్వాదించి, మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీచేతి పనులన్నిటయందు సంతోషింపవలెను” (ద్వితి 12:7) దేవుని మహిమార్ధమె చేసినంతాసంతోషంతో, స్తుతిగానంతో, కృతజ్ఞతావందనముతో జరిగించాలి. విచారం తోను, దుఖ:ముతోకాదు.SCTel 79.1

    మన దేవుడు అపారమెన్ల కృపగల తండ్రి. ఆయన ఆరాధన కార్యక్రమము హృదయ వేదనతో, దుఖ:ముతోనిండిందిగా పరిగణించకూడదు. ప్రభువును ఆరాధించటం, ఆయన సేవలో పాలుపంచుకోవడం ఆనందదాయకం కావాలి. దేవుడు ఎవరికోసం ఇంత గొప్ప రక్షణనను ఏర్పాటుచేస్తాడో అట్టి తన బిడ్డలు తాను కఠినుడు, దయలేని యజమాని అన్నట్లు భావించరాదని ఆయన కోరిక. తన ప్రజలకు ఆయన ఉత్తమనే స్తము. వారు ఆయనను ఆరాధించిన పుడు, వారిని దీవించేందుకు, ఓదార్చేందుకు, వారి హృదయాల్ని ప్రేమ, సంతోషాలతో నింపేందుకు ఆయన వేచి ఉంటాడు, దేవుని ప్రజలు దేవ సేవలో ఓదార్పు పొందాలని, అది కష్టమని భావించటం కన్న ఆనందదాయకమని పరిగణించాలని ఆయన కోరిక. తనను ఆరాధించేందుకు వచ్చేవారు తన శ్రద్ధాశక్తులు, ప్రేమనుగూర్చి మంచి అభిప్రాయం కలిగివుండాలని దేవుడు అభిలాషిస్తున్నాడు. ఇందు మూలంగా వారు తమ దీన దిన కార్యకలాపాల్లో ఆనందం పొంది, అన్ని విషయాల్లోనూ నమ్మకంగాను నిజాయితీగాను వ్యవహరించడానికి వారికి కృప కలుగుతుంది. మనం సిలువ చుట్టూ సమావేశమవ్వాలి. మన ధ్యానాంశం ప్రస్తావన విషయం, మన మిక్కిలీ ఉత్సాహభరిత భావోద్యేగం సిలువవేయబడ్డ క్రీస్తే అయివుండాలి. దేవునివద్ద నుంచి మనకు వస్తున్న ప్రతీదీవెనను మనం మననం చేసుకోవాలి. ఆయన మహత్తరప్రేమను మనం గుర్తించినప్పుడు మనకోసం సిలువకు మేకులతో కొట్టబడ్డ చేతిని అప్పగించడానికి మనం సంసిద్దులం కావాలి.SCTel 79.2

    స్తుతి రెక్కలతో ఆత్మ పరలోకం దగ్గరలోకి ఎగరవచ్చు. పరలోకంలో పాటలు సంగీతం మధ్య దైవారాధన జరుగుతుంది. మనం మన కృతజ్ఞతల్ని వ్యక్తం చేసేటప్పుడు పరలోకంలోని దూత గణాల ఆరాధన తలపిస్తున్నాం. “స్తుతియాగము అర్పించు వాడు”SCTel 79.3

    దేవుని మహిమపర్చుచున్నాడు” (కీర్తన 50:23), “ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియ సంగీత గానము”(యెషయా 51:3)తో మన సృష్టికర్త సన్నిధిలోకి వద్దాం.SCTel 80.1