Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఉపొద్ఘాతము

    “నాయొద్దకు రండి”యనెడి పిలుపును పెక్కురు వినియున్నారనుటకు సంశయము లేదాయెను. జాలిగల రక్షకుడు దేవుని విడిచిపెట్టి వేరై పోయెడి వారిని ” నాయొద్దకు రండియని పిలుచుట మాత్రమేగాక, తన ప్రేమ పూర్ణమైన హృదయముచే వారినీ తన వెప్తుకు ఆకర్షించుకొనుటకు ప్రయాసపడుచున్నాడు. యేసు క్రీస్తుయందు సహాయమును కనుగొనవలయునని వాస్తవముగా నెవరు వాంచించుచున్నారో, అట్టి వారియొక్క కోరిక పరమ తండ్రి యొక్క గృహమునకు తిరిగి పోవునట్లు సజీవమగుచున్నది. ఇట్టి వారికి తోమాకు కలిగినట్లే,SCTel 3.1

    “ఆ మార్గమును మేము ఎట్లు కనుగొనగలము?” అనే ప్రశ్న కలుగుచున్నది. మరియు తండ్రి యొక్క గృహము బహు దూరముగా నున్నది. మార్గమున్నను బహు కష్టమగును. నిశ్చయము లేకను కనబడుచున్నది. అలాగైనా ఏ మార్గ ముల బోయినా సొంత గృహమునకు జేరగలము? యని అడుగుచున్నారు.SCTel 3.2

    ఈ పుస్తకము పై ప్రశ్నలకు ప్రత్యురమునిచ్చును; ఆత్మావసరతలను దీర్చెడి వాని దాపునకు నడుపును. సంశ పుకులను, తొట్రీల్లెడి వారిని “సమాధానమార్గము”నకు నడుపును. మేడ మీదికి పోయెడి వానిని మెట్లు ఎట్లు నడుపునో ఆ ప్రకారమే నీతిని సత్ప్రవర్తనవర్తనను వెదకెవారిని క్రమ క్రమమముగా క్రైస్తవ జీవమునకు నడుపును. పిదప సంపూర్ణ స్వీయ సమర్పణ వలన ఆయన ఉద్దారక కరుణా కటాక్షము సంపూర్ణ సౌభాగ్యత యందుతేజరిల్లజేయును. ఈ పుస్తకమందు ఇవ్వబడియున్న ఉపదేశము కలత నందు కూలియున్న బహు జనాళికి శఆంత నిరీక్షణలను కలిగించెను. రక్షకుని శిష్యాళిలో అనేకులు మిక్కిలి నమ్మకముతోను సంతసముననుతమ పరమ మార్గదర్శి యొక్క అడుగుజాడలలో నడుచునట్లు నడిపెను. సహాయముము కోరేడి వారందరు ఈ పుస్తకము నందు అదే విధమైన శుభ వర్తమానమును కనుగొనెదరని నిరీక్షించుచున్నాము.SCTel 3.3

    “పరమ పట్టణమునకు బోవు మార్గము, అందు చేరు మట్టుకు భాసిల్లునుగాక’‘ ఆ ప్రకారము యాకోబు ఆ మార్గమును కనుగొనెను. ఎలాగనగా, తమ పాపము దేవుని నుండి తనను చేధించెననెడి భయముచే కృంగి నిరాశతో రాత్రి గడుపుటకు పరుండి, “ఒక కలను కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడియుండెను. దాని కొన ఆకాశము నంటెను. దానిమీద దూతలు ఎక్కుచూ, దిగుచూచుండిరి” భూమ్యాకాశమునకు గల సంబంధము అప్పుడు వానికి ప్రత్యక్షమాయెను. ఛాయారూపకమైన సోపాన పంక్తి తుదనందు ఆశీనుడైన వానినుండి శాంతనిరీక్షణలు దేశ దిమ్మరియై భయమునందు కూలియున్న వానికి వినబడెను. జీవ మార్గమును గూర్చిన కథను చదివేడి వారందరికీ యాకోబుకు ప్రత్యక్షమైన పరమ దర్శనము ప్రత్యక్షమగును గాక!SCTel 4.1

    ప్రచురణ కర్తలు

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents