Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    జీవన్మరణాల ఎంపిక

    ప్రతీ మనిషీ తను ఏమి కావాలని ఎంపిక చేసుకుంటాడో దాన్ని సాధించటంలో చాలా మట్టుకు కృతకృత్యుడవుతాడు. ఈ జీవితంలో దీవెనలు భావి నిత్యజీవం మానవుడికి అందుబాటులో ఉన్నాయి. అతడు బలమైన ప్రవర్తన నిర్మించుకుని అడుగడుగుకీ బలోపేతుడు అవుతాడు. వృద్ధి చెందే కొద్దీ ఉత్సాహానందాల్ని అనుభవిస్తూ, సద్గుణం వెంట సద్గుణాన్ని కృప వెంట కృపను సంపాదించుకుంటూ జ్ఞానవివేకాలతో రోజుకు రోజు పురోగమించవచ్చు. అతడి మానసిక శక్తులు ఉపయోగించే కొద్దీ వృద్ధి చెందుతాయి. అతడు ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే, ఇంకా సంపాదించటానికి అంత ఎక్కువ సామర్థ్యం పొందుతాడు. ఇలా అతడి ప్రతిభాపాటవాలు, సద్గుణ సచ్ఛీలాలు మరింత బలోపేతమై పరిపూర్ణతను సాధిస్తాయి.CDTel 2.4

    లేదా, అతడు తన శక్తుల్ని ఉపయోగించనందువల్ల లేదా చెడ్డ అలవాట్ల వల్ల, ఆత్మ నిగ్రహం వేనందువల్ల లేదా నైతిక శక్తి, దైవభక్తి లోపించినందువల్ల తన శక్తుల్ని నిర్వీర్యం చేసుకోవచ్చు. అప్పుడతడు పతన మార్గం పడతాడు. దైవ ధర్మశాస్త్రానికి ఆరోగ్య చట్టాలికి అవిధేయుడవుతాడు. తిండి వాంఛకు బానిస అవుతాడు. వాంఛ అతణ్ని తప్పుదారి పట్టిస్తుంది. నిత్యం చురుకుగా పనిచేసే దుష్టశక్తుల్ని అతడు ప్రతిఘటించి ముందుకి పోయేకన్నా అవి అతడ్ని వెనక్కి లాక్కుపోవటం సులభతరమౌతుంది. దుర్వ్యయం, వ్యాధి, మరణం సంభవిస్తాయి. దైవ సేవలోను మానవాళి సేవలోను ప్రయోజనకరంగా గడవాల్సిన అనేక జీవితాల చరిత్ర ఇది.CDTel 3.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents