Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఇంటింటికీ వెళ్లి బోధించటం

    R. & H. జూన్, 6,11912 CDTel 495.3

    813. పూర్వ దురభిప్రాయం అనే నియంత ఆత్మ ద్వారాల్ని మూసి వేశాడు గనుక అనేకమంది ఆహార సంస్కరణ నియమాల విషయంలో అజ్ఞానులై ఉన్నారు. ఆరోగ్యదాయక ఆహారం తయారు చెయ్యటం నేర్చటం ద్వారా మంచి సేవ చెయ్యవచ్చు. ఈ రకమైన సేవ మనం చేపట్టగల ఇతర సేవలు ఎంత అవసరమో అంత అవసరం. వంట పాఠశాలల్ని ఎక్కువ సంఖ్యల్లో స్థాపించాలి. కొందరు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తయారు చేసే కళను నేర్పుతూ ఇంటింటికీ వెళ్లి సేవ చెయ్యాలి. ఆహార సంస్కరణ ప్రభావం ద్వారా అనేకమందిని శారీరక, మానసిక, నైతిక క్షీణతనుంచి కాపాడవచ్చు. వెలుగు కోసం వెదకే వారికి ఈ నియమాలు ఆకర్షణీయమౌతాయి. అనేకులు వీటినుంచి ముందుకి వెళ్లి ఈ కాలానికి దేవుడుద్దేశించిన సంపూర్ణ సత్యాన్ని స్వీకరిస్తారు.CDTel 495.4

    తన ప్రజలు సత్యాన్ని స్వీకరించి దాన్ని ఇతరులుకి, అల్లధించాలని ! దేవుడు కోరుతున్నాడు. నిష్పక్షపాతమైన, నిస్వార్ధమైన సాక్షులుగా పేరు : తమకు దేవుడిచ్చిన దాన్ని ఇతరులికి అందించాలి. మీరు సేవలో ప్రవేశించి, -- హృదయాల్ని చేరటానికి మీ శక్తి అంతటినీ ఉపయోగించేటప్పుడు, వ్యతిరేక అభిప్రాయాలు సృష్టించే బదులు వాటిని తొలగించే రీతిగా పని చెయ్యటం మరవకండి. క్రీస్తు జీవితాన్ని ప్రతి నిత్యం అధ్యయనం చెయ్యండిCDTel 496.1

    ఉత్తరం 1 ???CDTel 496.2

    814. ఆహార సంస్కరణ వెలుగు మొట్టమొదటగా మాకు వచ్చినప్పుడు, మేము సెలవులప్పుడు ప్రజలు సమావేశమయ్యతో స్టన్లు తీసుకువెళ్లి, పులియని రొట్టెలు, జెమ్స్, రోల్స్ అక్కడికక్కడ తయారు చేసేవాళ్లం. ఇప్పుడు మనకు లభించే ఆరోగ్యాహార పదార్థాల తయారీలు అప్పుడు లేకపోయినా, మా కృషి సత్ఫలితాలనిచ్చిందని నా నమ్మకం.. అప్పుడు మేము మాంసం వాడ కుండా నివసించటం నేర్చుకోటం ఆరంభిస్తున్నాం.CDTel 496.3

    కొన్నిసార్లు మేము వినోదాన్ని ఏర్పాటుచేసేవాళ్లం. మేము భోజనానికి తయారు చేసిందంతా రుచిగా ఉండేందుకు దాన్ని చక్కగా వడ్డించేందుకు శ్రద్ధ తీసుకునే వాళ్లం. పండ్లు లభించే కాలంలో బ్లూ బెరీల్ని, రేస్ బెరీల్ని, స్ట్రాబెరీల్ని తాజాగా చెట్లూ, పాదుల నుంచి కోసి తెచ్చే వాళ్లం. భోజనబల్లమీద పెట్టే ఆహార పదార్థాల్ని ఓ సాదృశ్య పాఠం చేసే వాళ్లం. మా ఆహారం ఆరోగ్య సంస్కరణ నియమాల ప్రకారం ఉన్నా అది అరకొర ఆహారం కాదని ఇది సూచించింది.CDTel 496.4

    కొన్నిసార్లు ఈ వినోద కార్యక్రమాల సందర్భంగా మితానుభవంపై ఓ చిన్న ఉపన్యాసం ఉండేది. ప్రజలకు ఈ విధంగా మన జీవన నియమాలతో పరిచయం ఏర్పడేది. మాకు తెలిసినంతవరకు, అందరూ సంతోషించారు. అందరూ విజ్ఞానాన్ని పొందారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరఫరా చెయ్యాల్సిన అవసరాన్ని, దాన్ని సామాన్యంగా తయారు చెయ్యాల్సిన అవసరాన్ని తినేవారికి రుచిగా ఉండి తృప్తినివ్వాల్సిన అవసరాన్ని గూర్చి చెప్పటానికి మనకు ఎప్పుడూ ఏదో ఉంటుంది.CDTel 496.5

    ఆహార వాంఛకు దాసుల్ని చేసే శోధనలతో ప్రపంచం నిండి ఉంది. ఈ విషయంలో సరియైన హెచ్చరికలు కుటుంబాల్లోను వ్యక్తుల్లోను అద్భుతమైన మార్పులు కలిగిస్తున్నాయి. CDTel 497.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents