Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
అంత్యకాల సంఘటనలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    20 అధ్యాయము - పరిశుద్ధలు స్వతంత్రించుకొందురు.

    భద్రముగా సంరక్షించబడిన వారికి గుర్తింపు

    [నిత్యత్వమునకు సబంధించిన ప్రాతినిధ్యాలు ఎలెన్ వైట్ కు పరలోకము మరియు నూతన భూమి గూర్చి వివిద దృక్పదాలు దర్శన రూపములో అనుగ్రహించబడినవి.. మానవ భావనల విషయంలో ఆమె పరలోక విషయాలు చూపించబడియున్నవి. మానవుని అవగాహన మరియు భాష యొక్క పరిమితుల కారణంగా, దృశ్యాలను చూపించిన వాస్తవికతను మనము పూర్తిగా తెలుసుకోలేము. ఇప్పుడు అద్దములో చూచి నట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.” (1 కొరింథీయులకు 13:12). ]LDETel 198.1

    దేవుడు యొద్దనుండి బహుమానము

    కేవలం క్రీస్తే మరియు అతని నీతి మాత్రమే పరలోకమునకు అనుమతి పత్రము ఇచ్చేది.- లెటర్, 6బి, 1890. అహంకారంతో నిండిన హృదయం రక్షణను తనంతట తానే సంపాదించటానికి ప్రయత్నిస్తుంది. అయితే పరలోక ప్రవేశానికి మన హక్కుదానికి మన క్రీస్తు తాలూకు నీతి మాత్రమే. యుగయుగాల ఆకాంక్ష 300 (1898).LDETel 198.2

    మనము పరలోక కుటుంబ సభ్యలయయ్యేందుకుగాను ఆయన తన బిడ్డగా భావిస్తాడు. యుగయుగాల ఆకాంక్ష 638 (1898).LDETel 198.3

    లోకములోని మిక్కిలి శ్రేష్టమైన రాజభవనానికి హక్కువున్న క్రీస్తు సిద్ధం చెయ్య టానికి వెళ్లిన నివాసాలకు హక్కు ఉత్తమమయ్యింది. లోకములోని ప్రశంసలన్నిటి కన్నా రక్షకుడు తన నమ్మకమైన సేవకులతో చెప్పే ఈ మాటలు ఉత్తమమైనవి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి,- క్రీస్తు ఉపమాన ప్రబోదాలు, 374 (1900).LDETel 198.4

    రానున్న లోకము గూర్చి ఎందుకు మనము అలోచించవలేను?

    యేసు తన మహిమను మన కళ్ళముందు పత్యక్షపరుచుటకు మరియు ఆయనను వీక్షంచుటకు మరియు మనము ఎంచుకున్న నిత్యత్వము నుండి దూరము కాలేదు అని చెప్పుటకు ఆయన మనలను పరలోకమునకు తీసుకొని వచ్చేను.- ది సైన్స్ అప్ ది టైమ్, ఏప్రిల్, 4, 1895.LDETel 198.5

    నిత్య వాస్తవికతలతో మనము దేవుని ఉనికిని ఆలోచనలు అలవాటు చేసుకుంటాం. ఇది శత్రువు యొక్క రాకపోకలకు వ్యతిరేకంగా కవచంగా ఉంటుంది; అది బలం మరియు అభయము ఇస్తుంది, మరియు మన మనస్సు భయంపైన ద్వజమెత్తును, పరలోక వాతావరణము యొక్క శ్వాసనే మనము పిలిస్తామేతప్ప ఈ ప్రపంచంలో వాతవరణము యొక్క కాలుష్యము పీల్చాము.,.....యేసు పరలోకము యొక్క అందమైన అలంకార ములు మరియు ప్రయోజనాలు సమర్పించుటకు వచ్చెను, ఈ పరలోక ఆకర్షణలు మన తలంపులు బాగుగా ఎరుగునట్టు చేయును మరియు ఆ నిత్య సౌందర్యం మరియు పరలోక సంబందమైన చిత్రాలు మన జ్ఞాపకములో నిలిచిపోవును....గొప్ప బోదకుడు భవిష్యత్ ప్రపంచం గుర్చిన దృశ్యమును మానవునికి చూపిస్తాడు, ఆయన దృష్టి పరిధిలోనే, దాని స్వాదినములోనున్న ఆకర్షణీయమైనవి ముందుకు తీసుకొని వచ్చును ..... ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక సంబంధము మరియు భవిష్యత్తు జీవితం మరియు దాని ఆశీర్వాదము మద్యవున్న వ్యత్యాసమును గూర్చి అతను మనస్సును వేగముగా నిలపగలిగితే, వింతైన బేదాలు మనస్సులో ఉన్న తముగా నాటుకొనును, హృదయం మరియు ఆత్మ మరియు జీవితమంతయు నాకర్షించును. అవర్ హై కాలింగ్, 285, 286 (1890).LDETel 199.1

    క్రైస్తువుల ఉద్దేశాలు

    శక్తివంతమైన సాదనాల్ని ఆచరణలో పెట్టడం సాధ్యం కాదు. సత్రి యలకు కలిగే ఉత్కృష్ట ప్రతిపలం, పరలోకానందం, దేవదూతల సాంగత్యం, దేవునితోను, యేసుతో ను సహవాసం, ప్రేమానుబంధం, నిత్యకాల యుగాలన్నిటిలోను మన శక్తి సామర్ద్యల అభివృద్ధి ఇవి సృష్టికర్త, విమోచకుడు అయన యేసుకు హృదయ పూర్వక సేవలర్పించడానికి ఉద్రేక పర్చేందుకు మనకు ప్రోత్సాహాలు కావా.- క్రీస్తు యొద్దకు మెట్లు 21, 22 (1892).LDETel 199.2

    శాంతియుతముగా యేసును కలుసుకొని మనము రక్షింపబడితే, మనము ఇక ఎప్పటికీ రక్షింపబడతాము, అప్పుడు, మనము అత్యంత ఆనంద బరుతులమౌతాము, దుష్టత్వము నుండి వచ్చే శ్రమలు అగిపోయాయి మరియు అలసట నుండి విశ్రాంతి పోంది యువున్నాము అహో ఇది ఎంత బాగ్యము ఇక చివరికి ఇంటికి చేరుకొన్నను - లెటర్ 113, 1886.LDETel 199.3

    ప్రపంచంలో వున్న ప్రకృతి అందాలను తిలికించాలని నేను ఆశించుచున్నాను. పాపము వలన వచ్చిన శాపమునకు ప్రపంచము చెడిపోయింది లేకుంటే దేవుని యొక్క మంచి పనులతో నింపబడిన ఈ భూమి సంపూర్ణమైన సంతృప్తినిచ్చి ఉండేదని నేను బావించుచున్నాను. అయునను ఇప్పుడు మనకు క్రొత్త ఆకాశం మరియు క్రొత్త భూమి ఉన్నాయి. భక్తుడైన యోహాను దర్శనంలో చూచాడు, నేను పరలోకము నుండి ఒక గొప్ప స్వరము వింటిని, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై యుందురు, దేవుడు తానే వారికి తోడై యుండును,” [ప్రకటన 21: 3].అహా,ఎంత దన్యకరమైననిరక్షణ, ఇదే మహిమా న్వితమైన దృశ్యము ! - లెటర్ 62, 1886. LDETel 199.4

    వాస్తవము మరయు స్పష్టమైన స్థనలు

    పరలోకంలో అలాంటి ఒక స్నేహితుడు తమ పక్షాన విజ్ఞప్తి చేయడానికి వున్నాడని శిష్యులకు ఎంతో ఆనందాన్నిస్తుంది కదా! క్రీస్తు ఆరోపణము స్పష్టముగా అగుపడులు చేత, అందరి అభిప్రాయాలు మరియు పరలోకము యొక్క ఆలోచనలు మార్చబడ్డాయి. పూర్వం వారి మనస్సులలో ఏమి లేకుండగానే ద్యానము చేసారు, ఎటువంటి విషయము లేకుండగా ఆత్మ చేత నింపబడియున్నారు. ఇప్పుడు వారు ఎవరిని ప్రేమించియున్నారో, ఎవరిని అందరికంటే గౌరవించియున్నరో, వారు ఎవరితో సంభా షించియున్నరో మరియు ప్రయాణించారో, వారు ఎవరిని అదుకొన్నరో మరియు ఆయన పునరుత్థానములో సహా ఎవరెవరు సహాయపడియున్నరో, అది అంత యేసు క్రీస్తు యొక్క తలంపులతో నింపబడినది.... అయితే పరలోకం అస్పష్టమైనదిగాను మరియు అగోచరమైనదిగాను అవిశ్వాస ఆత్మలతో నిండిన ఖాళీ మనసులతో ఉన్నట్టు ఇక ఎన్నటికి కనిపించరు. ఇప్పుడు తమ ప్రియ రక్షకుడు వారి కొరకు సిద్ధము చేయుచున్న భవిష్యత్ నివాస గృహముకై ఎదురుచూచుచున్నారు.- ది స్పిరిట్ అప్ ప్రోఫస్సీ,3: 262 (1878).LDETel 200.1

    భవిష్యత్తులో పరలోకములోని వారసత్వమును భౌతిక దృష్టిగా భావించే భయమువల్ల పరలోకం మన గృహంగా పరిగణిచటానికి నడిపించే సత్యాల్ని అనేకులు ఆధ్యాత్మిక వాదంగా మాత్రమే అంగీకరిస్తున్నారు. తండ్రి ఇంట నివాసాలు సిద్ధ పర్చటానికి వెళ్లినట్లు క్రీస్తు తన శిష్యులతో చెప్పెను. మహా సంఘర్షణ, 674, 675 (1911).LDETel 200.2

    ఆదియందు ఆదాముకి అవ్వకు వినోదాన్ని ఉల్లాసానందాల్ని సమాకుర్చిన వ్యాపకాలు విమెచన పొందిన ప్రజలు నూతన భూమిలో చేపడ్డారు.- ప్రవక్తలు- రాజులు 730, 731 (c. 1914).LDETel 200.3

    వర్ణింపశక్యముగాని మహిమ

    నేను యేసు యొక్క మనోహరత్వము మరియు మహిమను చూచితిని. మధ్యాహ్నం సూర్యుని వెలుగు కంటే అతని ముఖం ప్రకాశవంతంగా వుంది. తెల్లని తెలుపు కంటే అతని వస్త్రం అంత తెలుపుగా వుంది,నేనుపరలోకపు యొక్క మహిమను, మరియు పది తీగలు కలిగియున్న వీణలు వాయుంచుచు మరియు పాడుచున్న అ సుందరమైన దేవదూతలును గూర్చి ఎలా వర్ణించగలను.,! - లేటెర్ 3, 1851.LDETel 200.4

    నేను చూచిన అద్భుతమైన విషయాలు నేను వర్ణించలేను. అహ! నేను కనాను బాషలో మాట్లాడుగలగియున్నటైతే, ఎంత బాగుండేది అప్పుడు నేను మహిమగలిగిన ఉన్నతమైన లోకం గూర్చి కొంచెం చెప్పగలిగేదాన్ని. ఎర్లీ రైటింగ్స్ -19 (1851).LDETel 201.1

    పరలోకము గూర్చి వర్ణించుటకు ప్రయత్నించగా ఏ భాష అయునను సరిపోదు అది తక్కువే అవుతుంది, అ దృశ్యము నా ముందు కనిపించినప్పుడు, ఆశ్చర్యతో నేను విస్మయం చెందితిని, అ అమోగమైన వైభవము మరియు మహోన్నతమైన మహిమ నన్ను దూరముగా ఊడ్చుకోనిపోయునది. ఇక నేను కలమును ప్రక్కన పారవేసి గొప్ప కేక పెట్టితిని. ఓహో ఏంత ప్రేమ! ఎంత అద్భుత ప్రేమ! పరలోకపు మహిమను లేదా సాటిలేని రక్షకుడి ప్రేమను వర్ణించుటకు ఎంతటి అత్యున్నతమైన భాష అయునను విఫలము కావలసినదే.- ఎర్లీ రైటింగ్స్ 289 (1858).LDETel 201.2

    నీతి మంతుల ప్రతిఫలం ఎలాంటిదో వర్ణించటానికి మానవ భాష చాలదు. చూచే వారే దానిని తెలుసుకోగలుగుతారు. దేవుని పరదైసును మహిమా ప్రబావాల్సి మానవ మేధ అవగాహన చేసుకోలేదు. మహా సంఘర్షణ,675 (1911). ఒక సారి మనము పరలోక పట్టణము యొక్క దృశ్యమును గాని విశ్లేషించినటైయితే ఇక ఎప్పటికీ భూమిపై నివసించడానికి ఇష్టపడము -సైన్స్ ఆప్ ది టైమ్స్, ఏప్రిల్ 8, 1889.LDETel 201.3

    సెలయేరులు, కొండలు, చెట్లు

    ఇక్కడ మనము జీవవృక్షము మరియు దేవుని సింహాసనం చూస్తాము. సింహాసనం నుండి స్వచ్చమైన నీళ్ళు ప్రవహించే నది వున్నది. మరియు నది ఇరువైపులా జీవ వృక్షం వున్నది. నది ఒక వైపున వున్న వృక్షముల యొక్క మొండెము ఎలా వున్నది అలాగే నది అవతల వృక్షము వున్నది. అయితే ఈ రెండు వృక్షములు పూర్తి స్వచ్చమైన బంగారంతో ఉన్నవి. మొదటి నేను రెండు వృక్షములు అని అనుకోన్నాను కాని నేను మళ్ళీ చూడగా అవి పైబాగము అ రెండు కలసియున్న ఒక వృక్షమే. కనుక జీవపు నది ఇరువైపులా జీవ వృక్షములు వున్నవి. ఆ వృక్షం యొక్క కొమ్మలు మేము నిలిచిన చోటున వంగి వున్నవి, ఆ వృక్ష పలము ఎంతో ఘన మైనదిగా అది వెండితో కలిసిన బంగారంలా కనిపించుచున్నది.ఎర్లీ రైటింగ్స్ 17 (1851).LDETel 201.4

    అక్కడ నిత్యము ప్రవహించే సెలయేరులు వుంటాయి, వాటి జలాలు నిర్మలముగా వుంటాయి. ఆ ఏరుల ప్రక్క తలలు అటూ ఇటూ ఊగుతూ రక్షణ పొందిన వారికి ఏర్పాటైన మార్గన ప్రక్కన వీడనిచ్చే చెట్లుంటాయి. అక్కడ విశాలమైన మైదానాలు , అందమైన కొండలవరకు వ్యాపించి ఉంటాయి. దేవుని పర్వతాలపై ఎత్తైన శిఖరాలు కనిపిస్తాయి. ఎంతో కాలంగా యాత్రికులు పరదేశులుగా జీవించిన దేవుని ప్రజలు నిత్యము ప్రవహించే ఆ ఏరుల ప్రక్క ప్రశాంత మైదానాల్లో నివాసముంటారు. మహా సంఘర్షణ ,675 (1911).LDETel 201.5

    పువ్వులు, పండ్లు, మరియు జంతువులు

    నేను మరోక వనమును రక రకాలైన పువ్వులతో నిండి వుండటం చూచాను, మరియు నేను కొన్ని తుంచాను, నేను గొప్ప స్వరముతో కేకవేసితిని. ఆ తర్వాత నేను పొడవైన గడ్డి పొలములను చూచాను. చూచుటకు అది ఎంతో అమోగముగా వున్నది. అది ఆకుపచ్చ రంగులో ఉంది. మరియు అది వెండి బంగారం యొక్క ప్రతిబింబం కలిగి ఉంది, ఇది రాజాది రాజైన ప్రభు యొక్క కీర్తి గర్వపడేలా వుంది.. అప్పుడు మేము రక రకాల జంతువులు వున్న స్థలమునకు వెళ్లాము,సింహము, గొఱ్ఱపిల్ల, చిరుతపులులు, తోడేలు, మరియు అన్ని ఒక చోటు హాయిగా కలసి వున్నాయి. మేము వారి మద్యలో నుంచి నడచి వెళ్లినప్పుడు అవి తరువాత శాంతియుతంగా మమ్మును వెంబడించెను. అప్పుడు మేము దట్టమైన అడవి లోనుంచి వెళ్లాము అయితే మనకి ఇక్కడున్న చీకటి అడవుల్లాంటిది కాదు అది, చక్కని వెలుతురు వున్నది. మరియు ఎంతో సుందరముగా వున్నది. చెట్ల కొమ్మలు ఇటు అటు కదులుచు చక్కని గాలి వీచుచున్నది, మనము ఇక్కడ ఈ అరణ్యంలో సురక్షితంగా నివసించెదము ఈ చెట్లు మద్య ప్రశాంతత వుంటుంది. మరియు మనము అడవులలో నిద్రపోదాం అని అందరు కేకలు వేసేను.“మేము అడవుల్లోనించి దాటుకొని వెళ్లుచునప్పుడు మేము సీయోను పర్వతమునకు వెళ్ల మార్గము కనిపించినది, సీయోను పర్వతం శిఖరం పైన ఒక అద్భుతమైన ఆలయం వుంది......ఆలయం చుట్టూ ఎన్నో రకరకాల చెట్లు వుండుట వలన ఆ స్థలము ఎంతే సౌందర్యముగా నున్నది. ఒక విధమైన సీమ చెట్లు, అనాస చెట్లు, మరియు దేవదారు వృక్షములు, దానిమ్మ చెట్టుతో ఉన్నవి, మరియు అంజూరపు చెట్టుపై అంతో విస్తారముగా పండ్లు కాయుట వలన బరువుతో కిందికి వంగి వున్నాయి- అవి అలా వుండుట వలన ఎంతో అద్భుతముగా వున్నది...... మరియు నేను స్వచ్చమైన వెండి బల్లను చూశాను. ఇది చాలా మేళ్ల పొడవుంది, అయున మా నేతలు అంత దూరము చూచుటకు సాధ్యమైనది. నేను అక్కడ వున్న జీవ వృక్షము, మన్నా,బాదము, దానిమ్మ, అంజూర ద్రాక్ష, మరియు అనేక రకాల పండ్ల ఫలాలను నేను చూశాను. అప్పుడు నేను ఈ పండు తినుటకు అనుమతిమ్మని యేసుని అడిగాను. - ఎర్లీ రైటింగ్స్ 18, 19 (1851).LDETel 202.1

    నిత్యయౌవన బలము

    ఎంలాంటి శరీరాలతో పుట్టిపెరిగారో అలాంటి శరీరాలతోనే అందరు సమాధులలోనించి బైటికి వస్తారు. పునరుత్థానమైన వారిలో ఆదాము ఉంటాడు. అతను పొడువుగాను, హుందతనముగా కనబడుతాడు, కాని దైవ కుమారుడైన క్రీస్తు కన్న కొంచము కురచగా ఉంటాడు. ఆదాముకి మరియు అనంత తరములవారికి మధ్య ఎంతో వ్యత్యాస ముంటుంది. మానవ జాతిలో చోటు చేసుకొన్న గొప్ప క్షీణత ఈ ఒక్క విషయంలోనే కళ్లకు కడుతుంది. కాకపోతే అందరూ నిత్యయవ్వనపు జవసత్వాలు కలిగిలేస్తారు. ఏదేనులోని జీవవృక్ష పలాలు భుజిస్తారు. ఆదిలో మానవుడు పెరుగుదలకు ఉద్దేశించిన పూర్తి స్థాయికి పెరుగుతాడు. -మహా సంఘర్షణ, 644, 645 (1911).LDETel 202.2

    అప్పుడు మనుష్యులు ఇరవై రెట్లు విశేషమైన శక్తి కలిగి వుండారు, సృష్టిలో ఆదాముకి కూడ అంత శక్తి వుండక పోవచ్చు, ప్రస్తుత జీవిత విదనములో సహజ చట్టమును ఉల్లంఘ అలవాట్లు ఉన్న తరము అంతరించిపోయినది. -సంఘమునకు ఉపదేశములు.. 3:138 (1872).LDETel 203.1

    విశ్రాంతి అవసరమయ్యేవారు గాని కోరేవారుగాని అక్కడ ఉండరు. దేవుని చిత్తాన్ని జరిగించటంలోగాని ఆయన నామాన్ని స్తుతించుటంలోనే గాని విసుగు అలసట ఉండదు. ఉదయమున ఉండే తాజతనమే ఎప్పుడు ఉంటుంది. సాయంత్రం రానే రాదు, రాత్రి అన్నది ఉండదు.- సంఘమునకు ఉపదేశములు.. 3:172 (1872)LDETel 203.2

    ఆనందం కలుగునని అభయము.

    భద్రముగా సంరక్షించబడినవారికి గుర్తింపు. వారి ప్రశ్నలకు సమాధానముగా యేసు భనిష్యత్ జీవితాన్ని మరుగుపర్చే తెరను తొలిగించాడు. ఆయన ఇలా అన్నాడు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోక మందున్న దూతలవలె వుందురు. యుగయుగాల ఆకాంక్ష.605 (1898).LDETel 203.3

    కొత్త భూమిలో వివాహాలు మరియు జననాలు జరుగుతాయని అనేక మంది నేడు వారి నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. కానీ లేఖనాలను నమ్మేవారు. అలాంటి సిద్ధాంతాలను అంగీకరించలేరు. క్రొత్త భూమిలో పిల్లలు పుట్టబోయే సిద్ధాంతం ” అది స్థిరమైన ప్రవచన వాక్యము కాదు.... దేవుడు తన వాక్యములో మనకు తెలియజేయని విషయాల్లో ఊహాగానాలు మరియు సిద్ధాంతాలను మునిగిపోయి వాటిని ఉపయోగించ టం గర్వనికి సూచనగా వుంది, మన భవిష్యత్ స్థితికి సంబందించి విషయలలో ఊహాగానాల్లోనికి వెళ్లడం అనవసరం. సంఘమునకు ఉపదేశములు. 1: 172, 173 (1904). 1:172, 173 (1904).LDETel 203.4

    కొత్త భూమిలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే విషయం దేవుని సేవకులుగా ఎక్కువుగా ఆలోచించి సమయం గడపకూడదు. దేవుడు వెల్లడించలేని విషయాల గురించి ఊహాగానాలు మరియు సిద్దాంతాలలో మునిగిపోయి వాటిని జోక్యము చేసుకొన కూడదు. భవిష్యత్ జీవితంలో మన ఆనందం కోసం ఆయన సమస్తము ఏర్పటు చేసేను. మరియు ఆయన మన కోసం ఏర్పటు చేసిన ప్రణాళికల గురించి మనం ఊహించ కూడదు. ఈ జీవితపు పరిస్థితుల ద్వారా భవిష్యత్ జీవిత పరిస్థితులను అంచనా వేయలేము. - గాస్పల్ వర్కర్స్, 314 (1904).LDETel 203.5

    క్రీస్తు పునరుత్థానం ఆయన యందు నిద్రించే వారందరి చివరి పునరుత్థానానికి ఛాయారూపం. తిరిగిలేచిన రక్షకుని ముఖం, ఆయన తీరు, ఆయన మాటలు అన్నీ శిష్యులికి తెలుసు. క్రీస్తు మృతులలో నుంచి ఎలా లేచాడో అలాగే ఆయన యందు నిద్రంచిన వారందరూ తిరిగిలేస్తారు. శిష్యులు యేసుని గుర్తించినట్లే మనము మన స్నేహితుల్ని గుర్తిస్తాం. ఈ మద్య జీవితంలో వారు వికలాంగులు కావచ్చు, వ్యాదిగ్రస్తులు కావచ్చు, కురూపులు కావచ్చు, అయినా మహిమ శరీరాలు దాల్చినప్పుడు వారు సంపూర్ణారోగ్యంతోను కళంకంలేని దేహాకారంతోను లేస్తారు.. యుగయుగాల ఆకాంక్ష 804 (1898).LDETel 203.6

    అదే రూపం వస్తుంది, అయితే ఎటువంటి వ్యాదిగాని మరియు ఏ విధమైన లోపముగాని లేకుండ స్వేచగా ఉంటాము మరల జీవిస్తున్నాము, విశిష్ట లక్షణాలు కలిగి ఉంటాడు, తద్వారా స్నేహితులు వారి స్నేహితులను గుర్తిపడతారు. ది ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 6: 1093 (1900).LDETel 204.1

    మనము ఎలాగా గుర్తంచబడతాము అక్కడ కూడా మనకు తెలిస్తుంది, దేవుడు మన హృదయములో నాటబడిన ప్రేమ మరియు అనురాగము ఎంతో యదార్ధంగాను మరియు ఆప్యాయంగాను ప్రదర్శిస్తాము.- ఎడ్యుకేషన్, 306 (1903).LDETel 204.2

    ఎఱ్ఱని ముఖవర్చస్సు మరియు కాంతివంతమైన వస్త్రము

    మన సృష్టికర్త చేతిలో ఆదాము సృష్టంచబడినప్పుడు, అతడు చాల గొప్ప ఎత్తున్నాడు మరియు సుందరమైన సౌష్టవముగల మనిషి, ఇప్పుడు మనుష్యులు భూమ్మీద నివసిస్తున్న వారి కంటే రెండు రెట్ల ఎత్తుగలిగి ఉంటాడు, సరిగ్గా అన్ని విదాలుగా సరిపోయేవాడు. అతని లక్షణాలు పరిపూర్ణమైనవి మరియు అందమైనవి. అతని ముఖ చర్మము తెల్లగా లేదా గోదము రంగులో లేడు, ఎర్రగా ఆరోగ్యం లేత రంగులో మెరుస్తూ ఉన్నాడు, అవ్వ ఆదాము అంత ఎత్తు లేదు, ఆమె తల అతని భుజాల పై కొంచెం వుంటుంది, ఆమె కూడా సౌజన్యంతో సున్నితమైనది, చాలా అందంగా ఉంది.- స్పిరుచ్వల్ గిఫ్ట్ 3:34 (1864).LDETel 204.3

    పాపరహితమైన ఆ జంట దుస్తులు దరించలేదు. దూతలకు మల్లే వారు వెలుగుతోను మహిమతోను కప్పబడి ఉన్నారు. దేవునికి లోబడి ఉన్నంతకాలం వారిని ఈ మహిమ అంగీ కప్పింది.- పితరులు - ప్రవక్తలు, 45(1890).LDETel 204.4

    పరలోకమందు మన కుటుంబమును చూచుట ఆనందం

    ద్వారము ఇరువైపులా దేవదూతల యొక్క సమాహమును మనము చూస్తాము, మరియు మనము దాటి వెళ్లచున్నప్పుడు, యేసు లోనికి ప్రవేశించించి, “నా తండ్రి చేత ఆశీర్వదించహడినవారులారా, లోకపునాది వేసిననాటి నుండి సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంతించుకొనుడి, తన ఆనందలో పాలిభాగస్తులు కండి అని ఆయన చెప్పును. మరియు అది ఏమిటి చూడు? తండ్రులు ఇది మీ యొక్క ఆత్మ పొందిన శ్రమకు వచ్చిన ఆనందం చూడుడి, తల్లులు ఇది మీ యొక్క ప్రయత్నాలకు వచ్చిన ప్రతిపలము ఇదిగొ ఇక్కడ మీ పిల్లలు వారి తలలమీద జీవ కిరీటం పెట్టబడి యుంది.- చైల్డ్ గైడెన్స్, 567, 568 (1895).LDETel 204.5

    ఎవరి జీవితం మన కొరకు దారబోసెనో ఆయనే మన క్రీస్తు, దేవుడు మనకు గొప్ప బహుమానం ఇచ్చిన. ఆయన మరణించి మన కొరకు తిరిగి లేచేను, మనము కూడ సమాది నుండి దివ్యమైన జయముతో బయటకు వస్తాము ఆ తర్వత పరలోక దేవదూల సమూహముతో, మన ప్రియమైనవారిని కలుసుకొని మరియు వారి ముఖాలను గుర్తుపడతాం ఎందు కంటే క్రీస్తు పోలికలో వారి స్వరూపం నాశనంకాలేదు, కాని అది మహిమ స్వరూపములోనికి రూపాంతరము చెందుతుంది, ఇక్కడ ప్రతి భక్తుడు కుటుంబ సంబందము కలిగియున్నాడు. అక్కడ మాత్రము ఒకరి కొకరు తెలుసు కుంటారు.సెలెక్ట్డ్ మెసెజన్స్. [3: 316 (1898).LDETel 205.1

    చంట్టి పిల్లలకు మరియు దుర్బలమైన వారి కి రక్షణ

    దూలితో కప్పబడియున్న సమాదుల నుండి చిన్నపిల్లలు అమరత్వము పొంది బయటకు వస్తున్నప్పుడు, వారు వెంటనే తమ తల్లి చేతులకు వెళ్లిపోతారు. వారు ఇక మరెన్నడూ వెరుచేయబడరు, అయితే ఎందరో చిన్న పిల్లలకు తల్లులు అక్కడ వుండరు. తల్లి నుండి ఉత్సాహభరితమైన విజయ గీతం వినినప్పుడు మేము వ్యర్ధముగా విన్నాము అనుకోనులోపు దేవదూతలు తల్లిలేని శిశువులను ఎత్తుకొని వారిని జీవ వృక్షము యెద్దకు తీసుకొని వెళ్లి పరిచయచేస్తారు. .-సెలెక్టేడ్ మెసెజన్స్ 2:260 (1858).LDETel 205.2

    విశ్వాసముగల తల్లిదండ్రులు ఉన్న చిన్న పిల్లలు కూడ రక్షించబడతారా అని కొందరు ప్రశ్నించారు, ఎందుకనగా వారు ప్రవర్తన విషయము పరీక్షించబడలేదు మరియు అందరు ఖచ్చితముగా పరీక్షింపబడాలి మరియు పరిక్షించుటములోనే ఒకరి స్వభావము నిర్ణయించబడుతుంది అని ఈ ప్రశ్న వేసియున్నారు. పిల్లలు ఇటివంటి పరీక్ష మరియు విచారణనలు ఎలాగా ఉంటాయి? ఐగుప్తీయుల మొదటి సంతానము మీదకి ఏ విదముగా తీర్పు పంపించియున్నదో అలాగే ఆ పిల్లలు యొక్క తల్లిదండ్రుల విశ్వాసము వారిని కప్పును అని నేను సమాదానము ఇచ్చాను..... అవిశ్వాసులైన తల్లిదండ్రుల పిల్లలు అందరు రక్షంపబడతారనే విషయము మనము చెప్పలేము ఎందుకంటే దేవుడు ఈ విషయము గురించి తన ఉద్దేశము ఏమైయునెన్న దో ఆయన బయలు పర్చలేదు, మరియు దేవుడు ఏక్కడ విడిచిపెట్టియున్నాడో అక్కడే మనము ఉందాము మరియు ఆయన వాక్యం మనకి స్పష్టముగా అర్ధమైనట్టుగా చేసేను కనుక మనము ఆ అంశలుపై ధ్యానము చేయుదము.సెలెక్ట్డ్ మెసెజన్స్ 3:313-315 (1885)LDETel 205.3

    (ఏ) అనే వారి విషయాన్ని పరిగణలోనికి వస్తే, ఇప్పుడు అతడు వున్న పాలిన చూచినటైయితే అతని సరళతను బట్టి తీవ్ర నిరసన తెలియజేయుదము. అతను పాపం విషయమై ఏమి ఎరుగక వున్నాడు. దేవుని యొక్క దయ వంశపారంపర్యంగా వచ్చిన అన్ని పరిణామాలను తొలగిస్తాడు మరియు వెలుగులో వున్న భక్తుల మధ్య వారికి వారసత్వం ఉంటుంది. నీకు యెహోవా కారణం తెలియజేసియున్నడు. కారణమునకు సంబంధించిన పరిమానం చూస్తే (ఏ) ఒక చిన్నబిడ్డ మరియు అది అతడి అనుకువ చిన్న బిడ్డ వలే విదేయత కనపరిచెను. -మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 8: 210 (1893).LDETel 205.4

    విశ్వాసముగల తల్లులకు సన్మానము

    తీర్పు ప్రారంభమై గ్రంధాలు తెరవటం జరుగినప్పుడు, భళా నమ్మకమైన దాసుడా, అంటు ఆ సర్వోన్నత న్యాయాధిపతి ప్రకటించగా విజేత తలమీద నిత్యజీవ కిరీటం పెట్టడం జరిగినప్పుడు, అనేకమంది తమ కిరీటాలు పైకెత్తి పట్టుకుని ,దైవ కృప ద్వారా నేను సాదించిన ఆధ్యత్మిక విజయానికి అదిగో అమె కారణం. ఆమె ఉపదేశం, ఆమె ప్రార్ధన, నా నిత్యరక్షణకు మార్గం సుగమం చేశాయి, అంటూ తమ తల్లి తట్టుకి వేలు చూపిస్తారు.యువతకు వర్తమానములు 330 (1881).LDETel 206.1

    తల్లితండ్రులు తమ పిల్లలను యేసు క్రీస్తుకు విజయవంతులగుటకు ప్రయత్నించి నందుకుగాను దేవుని దూతలు వారి పేర్లు శాశ్వతముగా వుంచెను.. చైల్డ్ గైడెన్స్, 568 (1895).LDETel 206.2

    ఆత్మలను రక్షించిన వారికి బహుమానము

    దేవుని సమక్షమందు రక్షకుడు నిలబడి నప్పుడు, విలువైన ఆత్మలు వారి పేర్లు వచ్చినప్పుడు ప్రతిస్పందన కనపరిచారు, అసలు వీరు ఎవరు? వారు విశ్వాసము కలిగివుండి, ఇతరులు కొరకు స్థిరమైన ప్రయత్నాలు చేసినవారు, నిజమైన విజ్ఞపనతోను మరియు యదార్ధమైన నమ్మకముతో ఆశ్రయ దుర్గమునకు వచ్చుటకు పట్టుదలతో వున్నవారు, ఈ లోకంలో ఎవరైతే దేవునితో జత పనివారుగా సేవచేసియున్నారో వారికి ప్రతిఫలం దక్కుతుంది. -సంఘమునకు ఉపదేశములు. 8:196, 197 (1904)LDETel 206.3

    పరలోకములో ఉన్నత స్థలమందు అందమైన నగరం యొక్క ద్వారాలు తెరవబడినప్పుడు,సత్యమును అనుసరించి నడుచుకొనిన ప్రజలు ప్రవేశించెదరు మహిమ కిరీటాలు వారి తలలపై పెట్టబడెను, మరియు వారందరు ఎంతో గౌరవముతో ఘనత మహిమ మన మహోన్నతమైన దేవునికి అని పొగిడెదరు. మరియు ఆ సమయంలో కొంతమంది మీ దగ్గరకు వచ్చి, “నీవు నాతో ఎంతో దయతో మాటలాడి వుండకపోతో,, నీ కన్నీళ్ళు మరియు ప్రార్ధనలు మరియు ఉత్సాహపూరిత ప్రయత్నాలునా కోసం చేయకపోవుంటే, నేను ఇంతటి సౌందర్యముగల రాజను ఎన్నడు చూచేవాడిని కాదు అనిLDETel 206.4

    అంటారు ఇది ఎంతటి గొప్ప బహుమానం! భవిష్యత్తులో విశ్వాసులు,శాశ్వత జీవితానికి నిరీక్షిస్తున్నవారు అనంతమైన ప్రతిపలాలతో పోలిస్తే ఈ భూమిపైన తాత్కలికంగా జీవిస్తున్న మనుషులకు ఇవి ఎంతటి విశేషమైన ప్రశంసములు. - వోడు అప్ ఎంకరేజ్ మెంట్ టూ సేల్ప సపోటంగ్ వర్కర్స్ (పిహెచ్113) 16 (1909)LDETel 206.5

    మన మనస్సు ఇక మాతదు

    మీరు పరలోకంలో పవిత్రమైన వ్యక్తిగా వుండలనుకుంటే, మొదట భూమిపై పరిపూర్ణమైన భక్తుడుగా ఉండాలి. నీ జీవితంలో నీవు కలిగియున్న గుణలక్షణములు అది మరణం ద్వారా లేదా పునరుత్థానం ద్వారా మార్చబడవు. మీ ఇంటిలో మరియు సమాజంలో మీరు ఎ స్వభావము చూపించియున్నారో, అదే విదమైన సహజ గుణాలుతోనే మీరు సమాది నుండి బయటికి వస్తాము, యేసు వచ్చే సమయంలో ముందు స్వబావమును మార్చడు ఆ స్వబావము మార్చుట అనే కార్యము ఇప్పుడే పూర్తి చేయాలి. మన అనుదిన జీవితమే మన గమ్యన్ని నిర్ణయిస్తుంది. మన ప్రవర్తనలో వుండే లోపాలకు పశ్చాత్తాపపడి ఒప్పుకొని క్రీస్తు దయ ద్వారానే, అదిగ మించగలుగుతావు. మరియు పరిశీలన స్థితిలోనే ఇదే రూపము అంటే క్రీస్తు పోలికలో మార్చబడాలి అప్పుడే పరలోకములో వున్న గృహములో నివసించిలకు సరిపోతాము. -మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 13:82 (1891).LDETel 207.1

    పరలోకము శాంతియుతమైనది మరియు ప్రేమించే వాతావరణం గలది

    పరలోక న్యాయస్థానాల్లో శాంతి సమాదానము మరియు ఐక్యమత్యముతోనే ఉన్నదే తప్ప, దౌర్జన్యము మరియు క్రూరత్వము మిళితమైన స్థితి అక్కడ లేదు. సంఘ మునకు ఉపదేశములు.. 8:140 (1904).LDETel 207.2

    పరలోకముంలో ప్రతిదీ గంబీరమైనది మరియు ఘనమైనదిగా వున్నది. ప్రతి ఒక్కరు ఇతరుల కొరకు సమయమును వెచ్చిస్తారు. వారి చుట్టూ ఉన్న వారి ఆనందం మరియు సంతోషముతో మెలగడం చూడాలని పవిత్రమై ప్రతి వ్యక్తి యొక్క అభిమాన ఆశయం . సంఘమునకు ఉపదేశములు. 2:239 (1869).LDETel 207.3

    భూమి పైన వచ్చే తూపానులను పోలిన యుద్ధాలు అధిగమించుటకు మరియు శాంతి ఎక్కడ ఉన్నదో అక్కడనే ఉండాలనుకుంటున్నాను అదే పరలోకము, పరిశుద్దులు మరియు పరిపూర్ణులు మరియు ఆశీర్వదించబడినవారు సమావేశమయ్యె నీతి రాజ్యం , వేల కొలది వేవేల లక్షల కొలది మంది జీవిస్తున్నారు మరియు సంతోషంగా దేవున్ని మరియు సింహాసనం మీద కూర్చున్న గొఱ్ఱపిల్లను స్తుతించుచు పవిత్రమైన సంబందముతో నడుచుకుంటారు, పరిపూర్ణ సామరస్యంలో వారి సంబాషణలు ఉన్నాయి. వారు ఎన్నడు ఒకరి కొకరు మెసము చేసుకోరు, పరలోకమునకు రాజైన ప్రభువు ఈ శక్తివంతమైన రాజ్యం అధికారిగా కేవలం మంచినే బయలుపరుచుచు, ఒకరి యెడల ఒకరు ఆనందం మరియు సంతోషము ఉండలనే ఆయన కోరుకొనుచున్నాడు... స్వగౌరవము తగ్గిచుకొవడం ఆయన కృతజ్ఞతలోను మరియు ప్రేమ సంపదలో అనుకువుగా ఉండడం అక్కడ ఎంతో గొప్ప విశేషము, సత్యము మరియు జ్ఞానం, సుస్స ష్టముగాను బలంగాను, మరియు పరిపూరమైనదిగా వున్నయి, తెలివైనవారిని మరుగు చేయుటకు ఎటువంటి చీకటి లోపాలు లేవు. సంతోషముతో నివశిస్తున్న వారి మీద వున్న అందమైన చాయను తరిమివేయుటకు ఇంకింత అనుమానము లేదు, పరలోకములో అనుభవము ఎంతో మధురమైనది మరియు పరిపూర్ణ శాంతిని చెరిపి వేయడానికి వివాదము కలిగించే అపశృతులు లేవు. అందులో నివాసుమున్నా వారు ఎటువంటి దుఃఖాన్ని, విచారాన్ని, కన్నీళ్లను రుచి చూడరు అన్ని సంపూర్ణ సామరస్యంతో, ఖచ్చితమైన క్రమంలో మరియు పరిపూర్ణ ఆనందం ఉంది .........ప్రతి హృదయములో జ్వలించే సంతోషం సమాదనం, హావభావలను చూపుట ద్వార వ్యక్తపరిచే గృహమే పరలోకం. ప్రేమే పరిపాలన చేస్తుంది,వాగ్వాదము నకు సంబందించిన అంశాలుగాని, ఏ అసమ్మతులుగాని లేదా వివాదాలు , ఘర్షణలు లేదా యుద్ధమునకు దారి తీసే వ్యాక్యానాలు అక్కడ వుండవు,- మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 9:104, 105 (1882)..LDETel 207.4

    శోధన లేకుంటే పాపము ఉండదు

    మంచి చెడులను తెలివినిచ్చే వృక్షం శోధనకు అవకాశం ఇచ్చే చాయే కనిపించదు, శోధన లేకపోతే పాపము చేయుటకు అస్కారమే ఉండదు.- ఎడ్యుకేషన్. 302 (1903). దేవదూతలు విమోచన పోందిన పరిశుద్దల విజయోత్సాహ ధ్వనులు విన్నాను, అవి పది వేల సంగీత వాయిద్యాలా వినిపించాయి. ఎందుకంటే సాతను సతాయింపులు శోదనలు ఇక వుండవు, ఇతర ప్రపంచాల నివాసులు అతడి సముఖంనుంచి శోదనల నుంచి విడుదల పొందారు.- దివ్య విమోచనాకదనం.416 (1858)LDETel 208.1

    తండ్రి మరియు కుమారునితో నుసంభాషణ

    దైవ ప్రజలు తండ్రితోను కుమారునిత ను భయముగాని దాపరికముగాని లేకుండా మాట్లాడవచ్చు. ఇప్పడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. మహా సంఘర్షణ, 676,677 (1911). LDETel 208.2

    మనము నిత్యము ఆయనతో నివసించెదం మరియు అతని ముఖ కవళికలు నుండి వస్తున్న విలువైన కాంతిలో సంతోషించుచున్నాను. ఉత్సాహభరితమైన దృశ్యమునకు నా హృదయం ఆనందముతో ఉప్పొంగుచున్నది.! - ఇన్ హెవెన్లీ ప్లేస్ 352 (1856). క్రీస్తు ఎక్కడ ఉంటే అదే పరలోకం, క్రీస్తుని ప్రేమించుచున్నాము అని చెప్పేవారికి ఆయన అక్కడ లేక పోయునటైయితే అది పరలోకమైన అది వారికి పరలోకం కాదు- ఎంమ్ ఎస్ 41, 1897LDETel 208.3

    దేవునికి పునరుత్థానులైన తన భక్తులుకీ మద్య అతి సున్నితమైన అనుబందం ఉంటుంది. యుగయుగాల ఆకాంక్ష,606 (1898).LDETel 208.4

    విమోచకుడి పాదాల వద్ద మనము తలలు వంచినప్పుడు ఆయన మన తలలపై కిరీటాలను పెట్టును, మరియు మనము బంగారు వీణాలు పట్టుకొని వాయుంచుచు పరలోకమంత సిహాసనాసీనుడైనవానికి స్తుతి స్తోత్రాలతో మారు మ్రోగేను-సంఘమునకు ఉపదేశములు.. 8:254 (1904).LDETel 208.5

    ఈ జీవితకాలంలో వారు దేవుని పట్ల విశ్వసనీయులుగా ఉంటారు ఆయన ముఖదర్శనము చేయుదురు, ఆయన నామము వారి నోసళ్లయందుడును ” (ప్రకటన 22: 4) దేవుణ్ణి చూచుటకన్న దానికి మించిన సంతోషం పరలోకములో ఏమున్నది ? క్రీస్తు అనుగ్రహం ద్వారా రక్షింపబడిన పాపికి దేవుని ముఖమును చూచి ఆయనే మన తండ్రి అని తెలుసుకొనిన దానికన్న మరి గొప్ప ఆనందం మరొకటి లేదు. - సంఘమునకు ఉపదేశములు. 8:268 (1904).LDETel 209.1

    దూతలతోను మరియు అన్ని తరముల విశ్వాసులతోను సహవాసము

    రక్షింపబడియున్న ప్రతి వ్యక్తి తన సొంత జీవితంలో దేవదూతల యొక్క పరిచర్యను అర్థం చేసుకుంటారు.మొట్టమొదటి క్షణం నుండి తనకు సంరక్షకుడుగా వున్న దేవదూత, ఆయన ప్రతి కదలికలు గమనించి ప్రమాద కాలములో అతని ప్రాణమును కాపాడిన దేవదూత, గాడాంధకారపు లోయలలో తనతో వున్న దేవదూత, అతని శాంతి కరమైన స్థలములో నడిపించేను, పునరుత్థాన దినమున మొట్టమొదటిగా పలకరించి మాట లాడిన ఆ దేవదూతతో-- కలసి చేయపట్టుకొని సంబాషించటం, మరియు పరలోక సంస్థాన మానవుని కొరకై ఏర్పాటు చేసిన ప్రణాళికలో వ్యక్తిగత జీవితములో దైవికమైన చరిత్ర గూర్చి తెలుసుకోవడం అది ఎంతటి గొప్ప తరుణం! ఎడ్యుకేషన్, 305 (1903).LDETel 209.2

    దూతల జోక్యం వల్ల మనం దృశ్యమైన, అదృశ్యమైన ఎన్నెన్ని ప్రమాదల నుండి రక్షింపబడ్డామో దేవుని నిత్యరాజ్యపు వెలుగులో ఆయన సంకల్పాల్ని చూచే వరకు మనకు తెలియదు. యుగయుగాల ఆకాంక్ష.., 240 (1898).LDETel 209.3

    రక్షణ పొందిన భక్తులు అక్కడ ఒకరినొకరు తెలుసుకుంటారు. దేవుని ఆత్మలో పెట్టిన ప్రేమ సానుభూతి అక్కడ క్రియాశీలకమవుతాయి. పరిశుద్ధదూతలతో నిర్మలమైన ఇష్టగోష్టి. దేవదూతలతోను అన్ని యుగాలలోను దేవునికి నమ్మకముగా నిలిచి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్తాలు ఉదుకుకొని తెల్లగా చేసుకొన్న భక్తులతో సామరస్య పూర్వక సాంఘిక జీవితం పరలోకమందును భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము, ఎపెస్సి 3,15 ను ఏకముచేసి పవిత్ర బంధాలు ఇవి విమోచన పోందిన వారికి సంతోషానందాల్ని ప్రోదిచేస్తాయి. -మహా సంఘర్షణ,677 (1911).LDETel 209.4

    పడిపోయిన దేవదూతలకు సాక్షులుగా నిలుస్తాము

    మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలలేదు గాని, పరిచర్య చేయుటకు వచ్చెను “(మత్తయి 20:28].క్రీస్తు పరిచర్య ఇక్కడ చేసినది పరలోకము కొరకు, మరియు ఈ ప్రపంచంలో అతనితో పని చేయుడం ఒక బహుమానమే కాని రాబోవు ప్రపంచంలోని అతనితో కలసి పనిచేయుడం ఘనమైన శక్తి మరియు ఉన్నత మైన అధిక్యతె అయున్నది. “నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు. (యెషయా 43:12) నిత్యత్వములో కూడా ఆదే కలిగి ఉంటాము. అయితే ఇది యుగాలుగా కొనసాగడానికి అనుమతించిన గొప్ప వివాదం ఏమిటి? తిరుగుబాటు చేసిన సాతాను ఉనికిని ప్రారంభంలో ఎందుకు తుంచివేయలేదు? దేవుడు పాపముతో వ్యవహారించే రీతి న్యాయబద్దముగా వున్నదని విశ్వమంతా అంగీకరించుటకు ఆ పాపం శాశ్వతమగా ఖండించబడుతుంది. రక్షణ ప్రణాళికలో ఎత్తులు మరియు లోతులు ఉన్నాయి, దేవదూతలు కోరిక విషయములో ఆశ్చర్యముతో చూడాలని నిత్యత్వము దానికదే ఎప్పటికి అలసిపోదు. సృష్టించబడిన వారందరిలో విమోచించబడిన వారు మాత్రమే పాపము యొక్క నిజమైన పోరాటము ఏమిటి అనేది ఒకరి అనుభవములో తెలుస్తుంది. వారు క్రీస్తుతో పనిచేశారు మరియు దేవదూతలు కూడా చేయలేకపోయారు, అతని శ్రమల సహవాసములో ప్రవేశించారు; విమోచన విజ్ఞాన శాస్త్రానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు- పడిపోయిన దూతలకు ఏది కూడ విలువైనది కాదు ? - ఎడ్యుకేషన్ , 308 (1903).LDETel 209.5

    గొప్ప అద్భతమైన సంగీతములతో దేవుని మహిమ పర్చుట

    సంగీతం మరియు పాటలు కచేరి అక్కడవుంది, అటువంటి సంగీతం మరియు పాటలు దేవుని దర్శనములు కొలువైయున్నవి, మర్త్యులైన వారి చెవులకు వినబడదు లేదా మనస్సు గ్రహించదు... ప్రభువా, దేవా, సర్వాధికారీ, క్రియలుఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు నీక్రియలు మార్గములు న్యాయములును సత్యములు నైయున్నవి; ప్రభువా. నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమ పరచినవాడెవడు? నీ న్యాయ విదులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిదిని నమస్కారము చేసెదరని చెప్పెను. (ప్రకటన) 15: 3, 4, ఎడ్యుకేషన్ 307-309 (1903).LDETel 210.1

    అక్కడ ఎల్లప్పుడూ ఒక దేవదూత పాటలు కచేరిని నడిపిస్తాడు, ఆ దేవదూత వీణను పట్టుకొని మొదటి వాయిద్యము ప్రారంబించినప్పుడు అందరు పరలోకములో వున్న గొప్ప పరిపూర్ణమైన సంగీతం వాయిద్యములో స్వరము కలిపెదరు.అ దివ్య మైన పరలోక సంగీత మాదుర్యం అది వర్ణనకు అతీతమైనది , సంఘమునకు ఉపదేశములు.1:146 (1857).LDETel 210.2

    వ్యసనాక్రాంతుడుగా కాదు, హల్లెలూయఅని హెబ్రీ భాషలో మరియు అన్యజన హోసన్నాలతో, రక్షణ పొందిన విస్తార జన సమూహాలు ఆయన్ని అందరికి ప్రభువుగా కిరీటం దరింపజెయ్యండి అంటూ చేస్తున్న నినాదాల నడుమ మహిమన్వితుడు విజయుడు ఆయన రాజుగా ఆయన ఒలీవల కొండ మీద నిలుస్తాడు. యుగయుగాల ఆకాంక.-830(1898). LDETel 210.3

    విశ్వములోనున్న ధన నిధిని వెతుకుట

    అక్కడ, మనకు దృష్టిని మరుగు చేయుచున్న ఆ ముసుగు తొలిగించబడినప్పుడు, మన కళ్ళు ఆ ప్రపంచ అందాన్ని సూక్ష్మదర్శిని ద్వారా చూచినట్టు మనము ఇప్పుడు తళుకున వీక్షించెదం, మనము పరలోక మహిమలను చూస్తున్నప్పుడు, సూక్ష్మదర్శిని ద్వారా దూరంగా వాటిని సూక్ష్మముగా పరిశోధ చేయగలము, ఆ వెలుగు పాపాన్ని తొలగించినప్పుడు, “ప్రభువైన యెహోవా యొక్క సౌందర్యములో భూమి మొత్తం కనిపిస్తుంది, మనము అధ్యయనం చేయుటకు ఎంత విశాలమైన భూమి వున్నది.! అక్కడ ప్రయోగ శాస్త్రము చదివే విద్యార్థి సృష్టిని గూర్చిన వృతాంతము చదవవచ్చు మరియు చెడు గూర్చిన చట్టం జ్ఞాపకాలు గ్రహింపునకు రావు, అతడు ప్రకృతి అందమైన సంగీతములు వినవచ్చును మరియు విచారం లేదు వేదనతో బాదపడటం అనేది అక్కడ కనిపించదు... రక్షణ పొందిన దేవుని ప్రజలు అద్యయనం చేయుటానికి విశ్వ విజ్ఞాన మంత వారి ముందర ఉంటుంది. అనిర్వచనీయమైన ఆనందంతో ను మరియు పడిపోని మానవుల జానంతో ప్రవేశించెదము. దేవుని చేతి పనిని యుగాయుగాలుగా స పరిశీలించి సంపాదించిన జ్ఞాన నిధులను వారు పరస్పరంగా పంచుకుంటారు. ఎడ్యుకేషన్ 303, 307 (1903).LDETel 211.1

    ఇక మరణ బంధకాలు లేని అర్హులు దూరాన వున్న ఇతర లోకాలకు అలవోకగా ఎరిగి వెళ్లారు- అవి మానవ దుఃఖన్ని చూచి వేదన చేంది, విమోచన పోందిన ఆత్మ విషయం విని ఎంతో ఆనందించే లోకాలు...... సృష్టి మహిమను- సూర్యుడు నక్షత్రాలు వాటి వాటి వ్యవస్థలు తన నిర్దిష్ట క్రమములో దేవుని సింహాసనం చుట్టు తిరగటానికి వారు స్వచ్చమైన నిర్మలమైన దృష్టితో వీక్షిస్తారు, చిన్న లేమి, పెద్దలేమి అన్నిటి మీద సృష్టికర్త పేరు వ్రాసి వుంటుంది. అన్నిటిలో ఆయన శక్తి సంపద ప్రదర్శితమౌతుంది.మహా సంఘర్షణ, 677, 678 (1911)LDETel 211.2

    పవిత్రమైన చరిత్ర సమీక్షించబడుతుంది

    విమోచించబడిన వారు ఒక లోకం నుండి మరో లోకమునకు వెళ్లే పరిమితి వుంది మరియు వారి సమయం రక్షణ ప్రణాళికలలో వున్న రహస్యాలను వెతకడానికి ఉపయోగించెదరు.-ది ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 7: 990 (1886).LDETel 211.3

    నిత్యత్వకాలం వినియోగమౌతుంది. శిష్యులికి బోధించటానికి క్రీస్తు ప్రయత్నించిన విమోచన పొందిన హృదయాలు, మనసుల నాలుకలు విమోచనాంశాల్ని అధ్యయనం అంశాల్ని వారు అవగాహన చేసుకుంటారు, క్రీస్తు సంపూర్ణత్వం మహిమను గూర్చిన కొత్త అభిప్రాయాలు యుగయుగాల పొడవున కనిపిస్తాయి. నమ్మకమైన గృహయజమానుడు తన ధనగారం నుంచి అనంత యుగాల పొడవున క్రొత్త పదార్థాల్ని పాత పదార్దాల్ని బయటికి తెస్తాడు. క్రీస్తు ఉపమాన బోధలు. 134 (1900)LDETel 211.4

    సమయం ప్రారంభమునకు మునుపు దాని పుట్టుకతో వచ్చిన మహా వివాదానికి దారితీసిన సంగతి ఆయన ముందుగా తెరవబడును మరియు ఆ సమయం నిలిపి వేయబడినప్పుడే మాత్రమే ముగిస్తుంది, పాపం యొక్క ప్రారంభమైన చరిత్ర సత్యము రావలసిన మార్గములో రాకుండ తప్పు దారి పట్టింది. కాబట్టి వంకర మార్గములో పనిచేయుట వలన అబద్దమనే ఆపదలో పడిపోయినది. అన్ని విషయలు బయలు పర్చబడతాయి, కనిపించేది మరియు కనిపించని ప్రపంచం మద్య వున్న అడ్డు తెర పూర్తిగా తొలిగించబడుతుంది. అప్పుడు అద్భుతమైన విషయాలు వెల్లడి చేయబడ తాయి.- ఎడ్యుకేషన్ 304 (1903).LDETel 212.1

    లోక సంబంధిత దుఃఖాలు, బాదలు, శోదనలు అంత మొంది. వాటికి కారకుడు బాద్యుడు తొలగిపోయినప్పటికి తమ రక్షణకు ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చిందో అన్న విషయమై దైవ ప్రజలకు ఖచ్చితమైన వివేకవంతమైన జ్ఞానము కలుగుతుంది...... మన రక్షకుడు తాను పొందిన సిలువ గుర్తుల్ని ఎల్లప్పుడు కలిగివుంటాడు. పాపం కావించిన చెడుగంతటిని సూచించే క్రూర చిహ్నాలు గాయపడ్డా ఆయన శిరం మీద, ఆయన ప్రక్కలో, చేతుల్లో కాళ్లలో కనిపిస్తాయి.--మహా సంఘర్షణ, 651, 674 (1911).LDETel 212.2

    జీవిత సంశయములు వివరించబడును

    జీవితం అనుభవములలో అన్ని కలవరములు అప్పుడు స్పష్టముగా అణిచివెయ బడతాయి. కేవలం ఎక్కడైతే మనకు నిరాశలు గందరగోళములు మరియు, విచిన్నమైన ఉద్దేశాలు మరియు అడ్డుపడిన ప్రణాళికలువున్నవో వాటిపై గొప్ప బలముతో అదిగమించి మరియు విజయ సాదించడం దైవిక సామరస్యాన్ని నిలకొల్పటం మనము చుస్తాము. - ఎడ్యుకేషన్, 305 (1903)LDETel 212.3

    దేవుని యొక్క సింహాసనం నుండి ప్రవహించే జీవన నది ప్రక్కన యేసు మనల్ని నడిపిస్తాడు మరియు ఈ భూమ్మీద వున్న చీకటి శక్తులు నుండి కాపాడి మన స్వబావమును పరిపూర్ణముచేయడానికి ఆయన ఏ విధముగా తీసుకొని వచ్చాడో మనకి వివరముగా తోలియజేయును. సంఘమునకు ఉపదేశములు.. 8:254 (1904).LDETel 212.4

    మనలను కలవరపెట్టినదంతా రాబోయే లోకములో దేవుని యొక్క కాపుదలలో స్పష్టంగా తీసివెయబడతాయి. అర్ధం చేసుకోవటానికి క్లిష్టమైన విషయాలు అప్పుడు వివరణను ఇవ్వబడుతుంది. కృప గూర్చిన రహస్యాలు మన ముందు విప్పబడతాయి, మన పరిమిత మనస్సులు మాత్రమే గందరగోళం మరియు నిరర్ధకమైన వాగ్దానాలు కనుగొన్నప్పుడు, మనము ఎంతో నిశ్చలమైనదియు మరియు అందమైన సామ రస్యాన్ని మరియు సమాధానమును ఇచ్చుట మనము చూస్తాము. అనంతమైన ప్రేమ చాలా ప్రయత్నాలు చేస్తున్న అనుభవాలను ఆదేశించినట్లు మనము తెలుసుకుంటాము మన మేలుకోరి మన నిమిత్తము ఎంతో శ్రద్ధను వహించి అయన చేస్తున్న కార్యములు అన్నిటిని గమనిస్తాము. చెప్పలేనంత ఆనందము మరియు గొప్ప మహిమతో మనము సంతోషించెదము.- సంఘమునకు ఉపదేశములు.. 9:286 (1909).LDETel 212.5

    ప్రతి ఉన్నతమైన కార్యము ఘనపర్చుట

    నిస్వార్థ ఆత్మతో చేసిన కార్యమునకు ప్రతి ఒక్కరూ వారి శ్రమల ఫలాలను చూస్తారు. సరియైన ప్రతీ సూత్రం యొక్క కృషి మరియు ఉన్నతమైన పనితీరు కనిపిస్తుంది. ఈ విధమైనది. ఇక్కడ మనము ఏదో చూడవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నతమైన పనికి ఎంత చిన్న పలితమో, కష్టించి పని చేసిన వారి జీవితములో కనిపిస్తుంది.! తమకు అందని దానిని అందుకోవడానికి జ్ఞానానికి మించినది పోందుటకు ఎంతమంది నిస్వార్థంగా మరియు అలసటలేకుండ కృషి చేస్తున్నారు! తల్లిదండ్రులు, ఉపాద్యాయులు వారి అంతిమ ఘడియలో ఇక కన్ను మూసేలోగ వారు జీవితాంతం చేసిన పని వ్యరమైనదని వారు చూడవచ్చు, అయితే వారి నిజాయితీకి ఎన్నడు అడుకట్ట వేయని ప్రవహించే ఆశీర్వాదం ఉత్పత్తి అవుతుంది అనే విషయము వారికి తెలియదు, కేవలం విశ్వాసంతోనే వారు శిక్షణ ఇచ్చిన పిల్లలకును వారి సహచరులకును ఒక దీవెనకరముగాను మరియు ప్రేరణ కలిగించే వారిగ వుంటారని వారు చూస్తారు. మరియు ప్రభావం కూడా వెయ్యి రెట్లు పునరావృత్తం అవుతుంది. అనేక మంది సేవకులు ఈ లోకములోనికి పంపబడియున్నారు వారు శక్తి మరియు నిరీక్షణ మరియు దైర్యం గల మాటలు ప్రతి దేశంలో వున్న ఎదురుచూచే హృదయాలకు ఆశీర్వాదములు మోసుకోని వెళ్లరు, కానీ వానికి వచ్చిన పలితము అతడు ఒంటరి వాడైనాడు మరియ ప్రసిద్ధి గాంచని వాడిగా మరుగైపోయాడు. ఆయితే అక్కడ అతని కృష్ణమునకు, బహుమతులు అందజేయబడుతుంది. బారములు మోసున్నప్పుడు, శ్రమ పడుటము సహజమే. మనుష్యులు వారి ప్రాణాలకు తెగించి విత్తుచున్నప్పుడు ఇతరులు దాని పంటను కోస్తున్నారు. ఒకరు విదరు, నాటెదరు, ఇతరులు ఫలము అనుభవించవచ్చు, వారు మంచి కార్యమును కదలించే ప్రతినిదులుగా వున్నారని ఇక్కడ సంతృంప్తి చెంది యున్నారు. ఇకమీదట, ఈ అన్ని చర్యలకు, ప్రతిచర్యలు చూడవచ్చు. ఎడ్యుకేషన్. 305, 306 (1903).LDETel 213.1

    మన ఆనందము నిత్యము పెరుగుతుంది

    రక్షణ ప్రణాళికలో రహస్యాలు ఉన్నాయి. ఆయన దేవుని స్వరూపమును మరియు అద్భతమైన ప్రేమ కలిగినవాడైయుండి దాసుని స్వరూపమును ధరించుకొని తనకు తానే రిక్తినిగా చేసుకొనెను ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి కుమారునిగా తగ్గించుకొనెను. -అది పరలోక దేవదూతల నిరంతర ఆశ్చర్యమునకు పాత్రులైనారు. ..... మరియు ఇవి విమోచనగూర్చి యుగాల వెంబడి చేస్తున అధ్యయనం. రక్షణ ప్రణాళిక గూర్చిన విధ్య సృష్టి మరియు విమోచనలో దేవుని యొక్క పనిని గురించి వారు ఆలోచించినప్పుడు, విలువైన వాస్తవ విషయాలు మనస్సుకి నిరంతరంగా ఆశ్చర్యాన్ని కలిగించేవిగా మరియు ఆనందకరమైనవిగా విప్పబడుతాయి. వారు దేవుని ప్రేమ జ్ఞానం, మరియు శక్తి, గూర్చి, మరింత తెలుసుకొన్నప్పుడు వారిమనస్సులు నిరంతరం విస్తరిస్తునే ఉంటుంది, మరియు వారి ఆనందం నిరంతరం పెరుగుతుంది.- సంఘమునకు ఉపదేశములు.. 5:702, 703 (1889).LDETel 213.2

    నిత్యత్వములో సంవత్సరములు గడిచేకొద్దీ దేవుని గురించి క్రీస్తు గురించి ఎన్నో నూతనమైన మహిమానిత్యమైన సత్యాలు బయలుపడుతువుంటాయి. జ్ఞానం ప్రగతిశీల మైనట్లే ప్రేమ గౌరవము, సంతోషం వృద్ధి చెందుతాయి. దేవుని గురించిన జ్ఞానం మనస్సులో ఎంత పెరిగితే వారు దేవుని ప్రవర్తన అంత ఎక్కువగా అభినందిస్తు. అమూల్యమైన రక్షణ సంపదను గూర్చి యేసు వారికి వివరిస్తున్నప్పుడు విమోచన నొందిన భక్తజనుల హృదయాలు అత్యదిక భక్తితోను ఆనందోత్సాహాలతోను ఉప్పోంగి వారు తమ బంగారు వీణలు మీటుతారు వేవేల, లక్షలు, కోట్లాది స్వరాలు కలసి ఆయనకు స్తుతివందనాలు చెల్లిస్తాయి. మహా సంఘర్షణ, 678 (1911).LDETel 214.1

    ఎప్పటికి అందని అనంతమైనది

    ప్రతి శక్తి అభివృద్ధి చేయబడుతుంది, ప్రతి సామర్థ్యం పెరిగింది. గొప్ప సంస్థలు ముందుకు తీసుకెళ్ళబడతాయి, అతి గొప్ప ఆకాంక్షలు చేరుకుంటాయి, అత్యధిక లక్ష్యాలు గ్రహించబడతాయి. ఇంకా కొత్తవి ఉన్నతమైనవి అధిరోహించటానికి వున్నాయి ప్రశంసించుటకు కొత్త అద్భుతాలు, గ్రహించటానికి కొత్త సత్యాములు పరిపూర్ణమైన విషయలు కొరకు శరీరం మరియు ఆత్మ మరియు మనస్సు యొక్క శక్తులు ఆహ్వానిస్తుంది.- ఎడ్యుకేషన్, 307 (1903).LDETel 214.2

    దేవుని జ్ఞానం మరియు అతని శక్తిలోను మనము పరిజ్ఞానంలో పురోభివృద్ధి చెందవచ్చు, అయిన అది ఎప్పటికి అందని అనంతమైనదే .-రివ్యూ అండ్ హెరాల్డ్, సెప్టెంబర్ 14, 1886.LDETel 214.3

    తరం నుండి తరం వరకు మానవ హృదయాలలో నుంచి ప్రవహించిన తండ్రి ప్రేమ మనుష్యుల ఆత్మలలో సున్నితత్వం జ్వలించినను దేవుని ప్రేమతో పోల్చితే అది అనంతమైన సముద్రంలో ఒక చుక్క మాత్రమే. ఏ నాలుక అది వివరించలేనిది ; కలము అది వర్ణించలేదు. మీ జీవితంలో ప్రతిరోజు మీరు దాని గురించి ధ్యానించవచ్చు; మీరు అర్థం చేసుకోనుటకు లేఖనాలను శ్రద్ధగా పరిశోదించవచ్చు, పరలోక తండ్రి ప్రేమను, కనికరమును గ్రహించడానికి ప్రయత్నించినందుకు దేవుడు మీకు ఇచ్చిన ప్రతి శక్తిని, సామర్ధ్యాన్ని మీరు సమకూర్చవచ్చు; ఇంకా అందని అనంతం ఉంది. మీరు ఆ ప్రేమను గూర్చి యుగయుగాలుగా నేర్చుకోవచ్చు; అయిన ఈ లోకము కొరకు తన కుమారుని మరణానికి అప్పగించిన ఆ త్యాగపూరితమైన తండ్రి ప్రేమను ఎప్పటికిని దాని పొడవు మరియు వెడల్పు,లోతు మరియు ఎత్తును నీవు పూర్తిగా అర్థం చేసుకోలేవు, నిత్యత్వము కూడ పూర్తిగా ఎన్నడు బయలుపర్చలేదు సంఘమునకు ఉపదేశములు. 5:740.LDETel 214.4

    దేవుడు ప్రేమైయున్నాడని విశ్వమంత ప్రకటిస్తుంది

    మహా సంఘర్షణ సమాప్తమౌతుంది. పాపం ఇక ఉండదు. విశ్వమంతా పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఉంటుంది. సృష్టి అంతటా సామరస్యం ఆనందం, వెల్లివిరుస్తాయి. సమస్తాన్ని సృజించిన సృష్టికర్త నుండి హద్దులులేని అంతరిక్ష మంత జీవం వెలుగు ప్రవహిస్తాయి. సూక్ష్మాతి సూక్షమైన అణువు నుండి బ్రహ్మండమైన లోకం వరకూ సమస్త జీవులేగాని తమతమ సుందరమైన ఉత్సహ భరితమైన స్థితిలో దేవుడు ప్రేమాస్వరూపి అని ప్రచురపర్చుతున్నాయి. మహా సంఘర్షణ, 678 (1911).LDETel 215.1

    ఎలెన్.జి. వైట్ రచయిత్రిగా 130 కంటే ఎక్కువ పుస్తకాలు రచించారు.వీటిలో చాల వాటి విస్తృ తమైన మా స్క్రిప్ట్ పైల్ నుండి మరణాం తరం ప్రచురించబడ్డాయి. ఒక రచయిత్రిగా ఆమె పుస్తకాలు ప్రపంచంలో అత్యంతముగా అనువదించబడినవి. ఆమె రచనలు 150 కంటే ఎక్కువ భాషల్లో ముద్రించబడినవి. దైవావేశము వలన ఆమె యేసును హెచ్చించుచు మరియు ఒకని విశ్వాసం పరిశుద్ధ లేఖనాలే ఆధారమని చూపించారు.LDETel 216.1

    ఈ విశ్వంలోనున్న మన చిన్న ప్రపంచం ఒక పాఠ్య పుస్తకమని యుగయుగాల ఆకాంక్ష 19 పుటలో ) మరియు విశ్వమంత అమితాసక్తితో అంతిమ సంఘటనలను పరిశీలిస్తుంది ( ప్రవక్తలు- రాజులు 148)లో ఎలెన్. వైట్ వివరించియున్నారు. ఈ ప్రపంచచరిత్రముగింపు దృశ్యాలు. మంచి చెడుల మధ్య సాగుతున్న మహా సంఘర్షణకు సంబంధించి వాటిని మనము వీక్షిస్తున్నప్పుడు భూమి యొక్క వాతవరణము మార్పుతో సభవించే ఘట్టలలో ఏదో ఒక విశేషమైన దానిని కనుగొని ఇక యేసు త్వరలో రానైయున్నడని మహిమాన్వితమైన సత్యన్ని ఇతరులతో పంచుకొనుటకు మనము ప్రయత్నించుచు న్నాము.LDETel 216.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents