Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
అంత్యకాల సంఘటనలు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    1 అధ్యాయము - భూమియందు చివరి సంక్షోభం

    భవిష్యత్తు గురించి విస్తృతమైన భయము

    ప్రస్తుతం జీవిస్తున్న వారందరికి ఎంతో ఆసక్తికరమైనకాలం ఇది. పరిపాలకులు మరియు రాజకీయనాయకులు, సంస్థ అధిపతులు మరియు అధికార హోదాను కలిగి యున్న వారు, మరియు అన్ని వర్గాలలో జ్ఞానయుక్తముగా ఆలోచించగల స్త్రీ, పురుషు లంతా మన చుట్టూ జరగబోవు సంఘటనల మీద దృష్టి నిలిపియున్నారు. దేశాల మధ్య కొనసాగుచున్న సంబంధాలను వారు పరిశీలిస్తున్నారు. భూసంబదమైన ప్రతి అంశం తీవ్ర రూపం దరిస్తున్నట్లు వారు గమనించుచున్నారు మరియ గొప్ప నిర్ణయాత్మకమైనవి ఏదో సంభవించబోతుందనియు మరియు ప్రపంచము ఘోరమైన సంక్షోభం అంచున ఉన్నదని గుర్తిస్తున్నారు. -ప్రవక్తలు - రాజులు, 537 ( 1914)LDETel 5.1

    భూమి మరియు సముద్రమువలన సంభవింపబోవు విప్పత్తులు, స్థిరమైన స్థితి గతులు లేని సమాజము, యుద్ధం మరియు భయకరమైన కీడును గూర్చి హెచ్చరికలు, గొప్ప పరిణాములో జరగనైయున్న సంఘటనలను గూర్చి ముందుగానే వారు అంచనా వేస్తున్నారు. దుష్ట శక్తి యొక్క ప్రతినిదులు మరియు వారి బలగాలు ఐక్యముగా కూటగట్టుకొని యున్నారు. ఇక చివరి గొప్ప సంక్షోభానికి వారి దళాలను బలపర్చుకొని యున్నారు. మన ప్రపంచంలోనే గొప్ప మార్పులు త్వరలోనే జరుగుతాయి, అంతిమ సంఘటనలు వేగవంతముగా కదులుచున్నవి. - సంఘమునకు ఉపదేశములు. 9:11 (1909)LDETel 5.2

    త్వరలో రానున్న శ్రమ కాలము

    శ్రమ కాలము మనకు సమీపములో వున్నది. అది అంతము వరకు కొనసాగు తుంది, మనము సమయమును కోల్పోకూడదు. ప్రపంచమంత యుద్ధవాత వరణం రేపుచున్నది. దానియేలు పదకొండవ అధ్యాయము యొక్క ప్రవచనము దాదాపుగా అంతయు నెరవేర్పునకు వచ్చియున్నది. -ది రివ్యూ అండ్ హెరాల్డ్, నవంబర్ 24, 1904. ఆపదకాలములు - అప్పుడు దేశ ప్రజలకు వచ్చిన సమస్య అలాంటి సమస్య కాదు (దానియేలు 12: 1] అది మనకు ఇప్పుడు మన నడినెత్తిమీ దేవుంది, మనము నిద్రిస్తున్న కన్యకలువలే వున్నాము. కనుక మనము మెలుకువగావుండి, ప్రభువా నీ దక్షిణహస్తాలుతో నన్ను ఎత్తుపట్టుకొనుము, మన ముందున్న ఈ కష్ట కాలములో నడిపించుమని వేడుకొనవలెను. -మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 3: 305 (1906)LDETel 5.3

    ప్రపంచం మరింత అక్రమముతో నిండిపోతుంది, త్వరలో గొప్ప ఆపద దేశముల మీదకి రానైయున్నది క్రీస్తు వచ్చే వరకు శ్రమలకు ముగింపులేదు-రివ్యూ అండ్ హెరాల్డ్, పిబ్రవరి 11, 1904.మనము శ్రమ కాలము అంచున ఉన్నాము,మరియు మనమెన్నడు కలలో కూడా ఊహించని భయంకరమైన గందరగోళములు మన ముందున్నవి.సంఘమునకు ఉపదేశములు 9:43 (1909).LDETel 5.4

    మనము యుగాలుగా సాగుతున్న సంక్షోభంలో ఉన్నాము. దేవుని తీర్పులు త్వరిత ముగా ఒకటి వెంబడి ఒకటి అనుసరించును- అగ్ని, వరదలు, భూకంపాలు, మరియు రక్తము చిందించబడిన యుద్దాలు వస్తాయి. ప్రవక్తలు- రాజులు.278 (c.1914). తుఫాను లాంటి సమయాలు మన ముందు ఉన్నప్పటికిని అపనమ్మకం లేదా నిరుత్సాహం కలిగించే ఒక మాటైనను మనము పలకకూడదు. క్రైస్త వసేవా 136 (1905)LDETel 6.1

    దేవుడు ఎల్లప్పుడూ రానున్న తీర్పులను గూర్చి హెచ్చరించెను

    దేవుడు ఎప్పటికప్పుడు మనుష్యులకు రానున్న తీర్పును గూర్చి ఆయన హెచ్చరిస్తునే ఉన్నాడు. వారి వారి సమయములో ఆయన ఇచ్చిన సందేశములకు ఎవరైతే శిరసావహించి మరియు ఆయన ఆజ్ఞాలకు విధేయలై విశ్వాసముగా నడుచు కుంటారో వారి మీదకి వస్తున్న తీర్పు, అవిదేయులు మరియు అవిశ్వాసుల మీదకి వచ్చినట్లుగా వారి మీద పడకుండ తప్పించబడుతారు. యెహోవా- ఈ తరమువారిలో నీవే నాయెదుట నీతిమంతుడవైయుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి నోవహుకు వర్తమానము ఇవ్వబడినది అప్పుడతడు ఆ మాటకు విధేయుడయ్యాడు, రక్షింపబడ్డారు. అలాగే లోతుకు కూడ వార్తమానము వచ్చింది, ఈ చోటు విడచిరండి యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవు చున్నాడని చెప్పెను. ఆది 7: 1; 19:14). లోతు పరలోక కాపుదలకు అంగీకరించాడు రక్షిణ పొందాడు. అ విదముగా క్రీస్తు,శిష్యులకు యెరూషలేము ద్వంసమైపోవునని హెచ్చ రించెను. రానున్న విధ్వంసానికి సూచనలు గమనించిన వారందరు నినాశనమును తప్పించుకొనుటకు వారు పట్టణములను విడిచి పారిపోవలెను, కనుక ఇప్పుడు క్రీస్తు రెండవ రాకడ మరియు ప్రపంచమీదకి నాశనము రానైయున్నదని మీము హెచ్చరిస్తు న్నాము. హెచ్చరికను లక్ష్యపెడుతున్న వారు రక్షించబడతారు.-యుగయుగాల అకాంక్ష 634 (1898).LDETel 6.2

    మన కాలంలో ఏమిజరుగునని దాని గూర్చి దేవుడు మనకు చెప్పెను?

    తనను చంపుతారని, సమాధి నుండి మరల లేస్తానని, రక్షకుడైన క్రీస్తు శిలువ వేయకముందే, తన శిష్యులకు అ విషయములు వివరించి చెప్పెను, ఈ వచనములు చూడండి (మార్కు 8:31, 32; 9:31; 10: 32-34.) దేవదూతలు ప్రత్యక్షమై అతని మాటలు మనస్సులలో మరియు హృదయములోను ఆ కట్టుకోనే విధముగా చేయును. అయితే శిష్యులు మాత్రము రోమ యొక్క అధికారము నుండి తాత్కాలికముగా విడుదల పొందాలని ఎదురు చూస్తున్నారు,ఎవరు మీద వారు నిరిక్షణ కలిగియున్నారో అట్టి వానికి ఇట్టి అవమానకరమైన మరణముతో వేదనపడడం వారు సహించలేక పోయారు, ఏమాటలైతే వారు గుర్తుంచుకోవలసిన అవసరముందో వాటినే వారి మనసు నుండి మాయమైపోయాయి. అయితే వారు నిరిక్షించే సమయము వచ్చేసరికి సిద్ధపడి వుండ లేదని తెలిసింది. ఆయన ఏదోవారికి ముందుగానే చెప్పకపోయినట్లు, క్రీస్తు మరణము వారి నిరిక్షణకు పూర్తి అంతమైపోవునట్లుగ భావించారు. అయితే ఈ ప్రవచనము అంటే క్రీస్తు మాటలు ఏ విధముగా శిష్యులకు స్పష్టముగా కనపరిచి యున్నాడో ఆ విధము గానే భవిష్యత్తు మన ముందు వుంచబడి యున్నది. కృపకాలము ముగింపునకు శ్రమకాలానికి మనల్ని సన్నద్ధపర్చే పనికి సంబందిచిన సంఘటనలను ప్రవచనాలు స్పష్టముగా విశదీకరించబడియుంది. ఈ విషయములను ఎన్నడు చెప్పక పోయినట్టు ఎందరో ఈ ముఖ్యమైన సత్యాలు గుర్తించక పోవుదురు. - మహా సంఘర్షణ 594 (1911)LDETel 6.3

    అంతిమ ప్రవచనములు మన శ్రద్ధను కోరుచున్నవి

    మరియు నేను మూడవ దేవదూతను చూచితిని [ప్రకటన 14: 9-11].నన్ను వెంబడించిన దూతలతో చెప్పితిని,” అతని కార్యయములు భయకరమైనవి. అయన పనులు భీకరమైనవి, ఆ దేవదూత గురుగుల నుండి గోదుమలను వేరుచేసి ఆ గోదుమలను మూటకట్టి లేదా ముద్ర వేసి పరలోక ధాన్యగారములోనికి ప్రోగుచేయును. ఈ విషయాలందు తప్పక మనస్సునుంచవలెను మరియు పూర్తి శ్రద్ధవహించవలెను ఎర్లీరైటింగ్స్ 118 (1854).LDETel 7.1

    మన విశ్వాసమునకు కారణాలను ఏమిటని తెలియచేయలంటే దేవుని యొక్క ఆజ్ఞలకు విదేయలమై యుండుటయే అని సమాధానమివ్వటానికి మనము న్యాయది పతులు ముందు నిలబడాలి. మరియు యువకులు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ప్రపంచ చరిత్రను మూసివేయబడక ముందు ఇవి నిశ్చయముగా జరగవలసిన సంఘట నలు అని వారు తెలుసుకోవాలి, ఈ విషయములు మన నిత్య సంక్షేమమునకు సంబంధించినవి, మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వీటిపై ఎక్కువ శ్రదవహించవలెను. -సంఘమునకు ఉపదేశములు. 6: 128, 129(1900)LDETel 7.2

    మనము ఏకాలములో జీవిస్తున్నమో అని సూచించే మార్గము గుర్తులను గూర్చి మనము అద్యయనం చేయవలసియుంది. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 4: 163 (1895).LDETel 7.3

    దేవుని స్వాదీనములోనికి వచ్చి ఆయన చేత నడిపించబడాలని తమను తాము ఎవరు సమర్పించుకుంటారో వారికి ఆయన చేత నిర్ణయించబడియున్న సంఘటనను ఏవైతే జరగనైయున్నవో వాటిని స్థిరముగా అనుసరించుటకు వీలౌతుంది.. సంఘ మునకు ఉపదేశములు 7:14(1902)LDETel 7.4

    గొప్ప సంస్కరణ ఉధ్యమములో భవిష్యత్తు గూర్చిన కార్యములు ఎరుగుటకును మరియు ఈ మహా సంగ్రామములో అంతిమ పోరుకు సిద్ధపడుచున్న దేశాలను క్రమము చూచినప్పుడు అ సంఘటనలు అభివృద్ధి చేస్తున విషయములను అర్ధము చేసు కొనుటకును, ముందు చెప్పబడిన ప్రవచనాలు ఏవేవి నెరవేరియున్నవో మనము చరిత్రలోనికి తొంగి చూడవలసియుంది, సంఘమునకు ఉపదేశములు.8: 307 (1904)LDETel 7.5

    దానియేలు మరియు ప్రకటన గ్రందములును గూర్చి అధ్యయనం

    దేవుని వాక్యము చాలా పరిశీలనగా అధ్యయనం చేయుట అవసరమై యుంది; ముఖ్యంగా దానియేలు మరియు ప్రకటన గ్రందాలు పై మునుపెన్నడు లేని దృ ఇప్పుడు వుండాలి. దానియేలు దేవుని యొద్ద నుండి పొందుకున్న సత్యము కడవరి కాలమును గూర్చిన ప్రత్యక్షత ఉన్నది.- టెస్టమోనీస్ టూ మినిస్టీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 112,113 (1896).LDETel 8.1

    దానియేలు పన్నెండవ అద్యాయం చదివి అద్యయనం చేద్దాం. అంతిమ కాలము రాక మునుపు ఇది ఒక హెచ్చరికని మన మందరము అర్థం చేసుకోవలసిన అవసరము వుంది.- మాన్యుస్కిప్ట్ రిలీజ్ ( 133(1900). క్రొత్త నిబందన ఆఖరి పుస్తకములో పూర్తి సత్యములు వున్నాయి వాటిని మనము అర్ధము చేసుకోవలసిన అవసరుము వుంది.క్రీస్తు ఉపమాన ప్రబోధాలు,133(1900)LDETel 8.2

    ప్రకటన పుస్తకములో ఇంక నెరవేరని ప్రవచనములు ఇక త్వరలోనే నెరవేరనై యున్నవి, దేవుని ప్రజలు ఇప్పుడు ఈ ప్రవచనాలను శ్రద్ధతో అద్యయనం చేయాలి మరియు స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. ఇది సత్యమును మరుగుచేయదు, కాని ముందు గానే హెచ్చరిస్తుంది, అయితే భవిష్యత్తులో ఏమి జరుగునైయున్నదో స్పష్టంగా తెలియ జేయును. -1 ఎ న్యూలైఫ్ (రివైవల్ అండ్ బియాండ్ ], 96 (1903).LDETel 8.3

    ప్రకటనలో క్రమముగా ఇచ్చిన గంభీరమైన సందేశములను దేవుని ప్రజలు మనస్సులలో మొదటి స్థానాన్ని ఆక్రమించాలి. -సంఘమునకు ఉపదేశములు. 8: 302 (1904)LDETel 8.4

    ప్రజలు ముందు విషయములను బయలుపర్చవలేను

    నేటి కాలానికి సంబంధించి ప్రవచనాలు యొక్క అర్థాన్ని గ్రహించలేనివారు ఎందరో ఉన్నారు, వారికి జ్ఞానోదయం కలగాలి, కనుక కాపరులు మరియు స్వచ్చంద సేవకులు ఈ ఇరువుల యొక్క బాద్యత సరైన ద్వనించే బూరగా వాడబడలి. ఎవాంజలిజం, 194, 195 (1875). ఇప్పడు కాపరులు వారి స్వరములు ఎత్తి నేటి సత్య సూవార్త సందేశం ప్రకటించవలసిన సమయము ఇదే. కనుక మనము ప్రవచనాత్మక చరిత్రలో ఎక్కడ వున్నామో ప్రజలకు చూపుదాం. సంఘమునకు ఉపదేశములు. 5:716(1889).LDETel 8.5

    ఈ ప్రపంచ చరిత్రను ముగించడానికి దేవుడు ఒక రోజును నియమించి యున్నాడు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును. ఈ ప్రవచనము త్వరితముగా నెరవేరు చున్నది, మరింత ఎక్కువగా ఈ అద్భుతమైన విషయాల గురించి చెప్పబడి యుంది, అంతిమ గమ్యమును నిర్ణయుంచుకొనే వారికి ఆ దినము సమీపములో నున్నది. ప్రవచనము యొక్క భయంకరమైన హెచ్చరిక ప్రతి వ్యక్తికి తెలియజేయబడిన సమచారము, ఆశ్చర్యా నికి గురిచేసే ప్రమాదం నుండి నేను సురక్షితంగా ఉన్నానని ఎవరూ భావించ కూడదు, ప్రజల ముందు ఈ విషయాలను ఉంచడానికి గొప్ప శ్రమ తీసుకోవాలి ఈ గంభీరమైన వాస్తవం ప్రపంచమునకు తెలియజేయుట మాత్రమే కాదు మన సొంత సంఘ ముల ముందు కూడ ఉంచవలసియుంది. ప్రభు దినము అనుకోకుండా అకస్మాతుగా రానైయున్నది. ఈ గొప్ప సంఘటన సమీపంలో ఉందని చూపించే ఈ సంఘటనల పరిజ్ఞానం యొక్క నిశ్చయత గురించి మీకు ఎవరి స్ఫూర్తిని కల్పించనీయకండి. - ఫండమెంటల్స్ అప్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ 335, 336 (1895)LDETel 8.6

    సరైన దృక్పథంలో భవిష్యత్తు సంఘటలను ఉంచవలేను

    భవిష్యత్తలో మన ప్రపంచంలో జరిగే సంఘటనలను ఖచ్చితముగా వివరించడానికి ఇప్పుడు మనము సమర్ధులముకామని మనకు తెలుసు, ప్రభు దినము సమీపములో వుంది కాబట్టి మనము మెలుకువగా వుండి ప్రార్థించవలెను. సెలెక్ట్డ్ మెసెన్స్ 2:35 (1901)LDETel 9.1

    మృగం యొక్క ముద్ర సరిగ్గా ఎలా ఉంటుందో అనే విషయము అది ప్రకటించ బడింది, కాని అన్ని విషయాలు దీనికి సంబందించినవి ఇంక అర్ధము చేసుకో వలసి యుంది, లేదా గ్రందమును విప్పిచదివి నప్పుడే పూర్తిగా అర్థమగును. -సంఘమునకు ఉపదేశములు 6:17 (1900)LDETel 9.2

    చాలామంది. ప్రస్తుత విధుల నుండి వెలుపలకు తొంగి చూస్తున్నారు, మరియు ప్రస్తుత సౌలభ్యమైన ఆశీర్వాదములు కొరకు ఎదురుచుస్తున్నారు, కాని భవిష్యత్తలో కలగబోవు సంక్షోభానికి సంబందించి ఇబ్బందులును కొని తెచ్చుకుంటున్నారు. ఇది ముందుగానే శ్రమకాలము త్వరగా వచ్చుటకు సిద్ధము చేస్తున్నది, ఇలాంటి సమస్యలకు మనము ఎటువంటి దయ కలుగదు.- సెలెక్టడ్ మెసేజన్స్ 3: 383, 384 (1884)LDETel 9.3

    దేవుని ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే సమయము ఉంది, కానీ ప్రజల ముందు ఇట్టి వేదనలుగూర్చి నిరంతరం గుర్తుచేస్తు, శ్రమకాలము రాకమునుపే వారిని నాశనమై పోవటానికి కాదు మనము వున్నది. దేవుని ప్రజల మద్య జల్లించుటము వుంటుంది, అయితే మన సంఘాలకు తీసుకొని వెళ్ళవలసిన ప్రస్తుత సత్యము ఇది మాత్రము కాదు. - సెలెక్టడ్ మెసేజన్స్ 1: 180 (1890)LDETel 9.4